తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial April 1st: ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలన్న భవానీ.. కృష్ణకి అడ్డంగా దొరికిపోయిన మీరా

Krishna mukunda murari serial april 1st: ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలన్న భవానీ.. కృష్ణకి అడ్డంగా దొరికిపోయిన మీరా

Gunti Soundarya HT Telugu

01 April 2024, 7:24 IST

google News
    • Krishna mukunda murari serial april 1st: ఆదర్శ్ ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని చెప్పి ముకుంద ట్రై చేస్తుంది. అటు మీరా శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడటం కృష్ణ వింటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి సిరియల్ ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సిరియల్ ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సిరియల్ ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial april 1st: ఆదర్శ్ గట్టిగా అరిచే సరికి ఇంట్లో అందరూ వస్తారు. భవానీ వచ్చి ఏంటి గొడవ అంటుంది. వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు. నేను నీ కొడుకుని కాదు కదా వీళ్లందరికీ లోకువ అయిపోయాను. నన్ను పరాయివాడిలా చూస్తున్నారని చెప్తాడు. నిన్ను ఇప్పుడు ఎవరు తక్కువ చేశారని భవానీ అడిగితే అందరూ అని చెప్తాడు. నాకు అన్యాయం చేసిన వాళ్ళకు ఉన్న విలువ కూడా నాకు లేదు. చివరికి దారిన పోయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వడం లేదని అంటాడు.

ఆదర్శ్ చెంప చెల్లుమనిపించిన భవానీ

రేవతి ఏమైందని అడుగుతుంది. ఇంట్లో పెద్ద పెద్దమ్మ ఉంది రూమ్ లో తాగు బయటకి వెళ్లకని చెప్పానని మధు చెప్తాడు. దేనికి పనికిరాని వీడు కూడా నేను ఏం చేయాలో అని నీతులు చెప్తున్నాడని ఫైర్ అవుతాడు. అంటే తప్పు ఏముందని రేవతి నిలదీస్తుంది. మురారి ఏ తప్పు చేయలేదని లోకం మొత్తం తెలిసినా వీడు నమ్మలేదు. పోలీసులు ప్రాణాలు తీసేస్తారని చెప్పినా లెక్కలేదు. మధు అంటే అసలే లెక్కలేదు. మధు ఎందుకు పనికిరాకపోవచ్చు కానీ వాడికి ఒక లక్ష్యం ఉంది. దానికోసం నిరంతరం కష్టపడుతున్నాడు. నేను తప్పు చేశానని వాడు నమ్ముతున్నాడు అందుకని నేను ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే వాడిని పరాయివాడిలాగా చూసినట్టా అని మురారి అంటాడు.

ఆదర్శ్ ఏమైపోతాడోనని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నాం. పోనీ సొంత మనిషి అనుకోవాలంటే ఏం చేయాలో చెప్పమని కృష్ణ బాధగా అడుగుతుంది. చెప్పు ఇంట్లో అందరినీ అంటున్నావ్ అంటే నన్ను కూడా కలిపి అన్నట్టే కదా చెప్పు ఇంకా ఏం చేస్తే సొంత వాడిలా ఫీల్ అవుతావని భవానీ నిలదీస్తుంది. ఈ ఇల్లు, ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేయ్. అప్పుడు ఈ ఇల్లు నా సొంతం అవుతుంది అప్పుడు నేనే డిసైడ్ చేస్తాను ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అనేసరికి భవానీ కోపంగా చెంప చెల్లుమనిపిస్తుంది. చంపేస్తాను పిచ్చి పిచ్చిగా వాగావంటే ఎవరిని వేరుగా చూశాను ఈ ఇంట్లో అందరూ నాకు ప్రాణం. ఏ ఒక్కరినీ వదులుకోవాల్సి వచ్చినా నా ప్రాణం పోయినట్టే చెప్పు నా ప్రాణం తీసేస్తావా అని నిలదీస్తుంది. ఆదర్శ్ ని నా వైపు తిప్పుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని ముకుంద మనసులో అనుకుంటుంది.

ముకుంద మనసు ఎవరో మార్చేశారన్న మీరా

ఆదర్శ్ కి తాను సర్ది చెప్తానని చెప్పేసి ముకుంద తనని తీసుకుని వెళ్ళిపోతుంది. పక్కనే కూర్చుని మరీ మందు పోస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరూ తనకోసం ఆలోచించడం లేదని ఆదర్శ్ అంటాడు. మీరంటే ప్రేమించే వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారని ముకుంద అంటుంది. ఎవరు ఉన్నారు నేను ఎంతో ఇష్టపడిన ముకుంద కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని అంటాడు. ఇంకా నా గురించే ఆలోచిస్తున్నాడు నేను అదే దారిలో వెళ్ళి తనని దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటుంది. ముకుంద మీ గురించి ఆలోచించింది. మీరంటే తనకు చాలా అభిమానం, గౌరవం. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఆదర్శ్ జెంటిల్ మెన్ అని చెప్పేదని అంటుంది.

నేను నా జీవితంలోకి ఆదర్శ్ ని ఎందుకు ఆహ్వానించకూడదని అడిగింది. మంచి నిర్ణయం ఆలోచించచడం ఎందుకని అలాగే చేయమని చెప్పానని చెప్తుంది. కానీ శోభనం గదిలో ఏం జరిగిందో తెలుసా? అంటాడు. తెలుసు మనసు మార్చుకుని ఇద్దరూ సంతోషంగా ఉంటారని అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని చెప్తుంది. తన మనసు ఎవరో మార్చేశారు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఖచ్చితంగా ఎవరో తన మనసు విరిచేశారు. లేదంటే ముకుంద అలాంటి మనిషి కాదు. గతంలో ముకుంద మాట్లాడిన విషయాలన్నీ ఆదర్శ్ తలుచుకుంటాడు. దయచేసి ముకుంద గురించి నెగటివ్ గా ఆలోచించడం మానేయండి మీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో పంచుకొండని మందు పోసి ఇస్తుంది.

మీరా మాటలు నమ్మేసిన ఆదర్శ్

ముకుంద కూడా ఇలాగే మందు కలిపి ఇచ్చేది ఇప్పుడు నువ్వు అని అంటాడు. నువ్వు చెప్పేది నిజమే మీరా ఎవరో తన మనసు స్పాయిల్ చేశారని అంటాడు. మురారి వచ్చేసరికి ఆవేశంగా మాట్లాడతాడు. ఎందుకు ఇలా అయిపోయావ్ నేను నీ మురారిని అంటాడు. నాకు వాడి గొంతు వింటేనే టార్చర్ గా ఉందని కోపంగా మాట్లాడతాడు. మురారిని మీరా పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది. కావాలని మురారి చెయ్యి పట్టుకుని మీ బాధ నాకు అర్థం అయ్యింది. మన మీద కోపం ఉన్నప్పుడు సర్ది చెప్పాలని చూస్తే కోపం పెరుగుతుంది. సమయం చూసి తనకి నేనే సర్ది చెప్తాను అప్పటి వరకు ఓపికగా ఉండమని చెప్తుంది.

భవానీ ఆదర్శ్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తు ఉంటుంది. తనతో మాట్లాడేందుకు కృష్ణ వస్తుంది. కుటుంబం అంతా కలిసి ఉండాలని నేను పాకులాడుతుంటే ముక్కలు చేయాలని వాడు అనుకుంటున్నాడని చిరాకు పడుతుంది. తాగిన మత్తులో అలా మాట్లాడుతున్నాడని కృష్ణ సర్ది చెప్తుంది. ఆదర్శ్ కి నా మీద ఏసీపీ సర్ మీద కోపం ఉంది. ముకుంద చనిపోవడానికి మేమే కారణమని నమ్ముతున్నాడని కృష్ణ అంటుంది. వాడు నమ్ముతున్నాడని మిమ్మల్ని పంపించేయాలా? ఎక్కువ మాట్లాడితే వాడే వెళ్లిపోతాడని భవానీ అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది.

ముకుంద బండరాయి

కొన్ని సంవత్సరాలు వాడు కనిపించకపోతే ఎక్కడ ఉన్నాడోనని బాధపడ్డాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాడు ఎందుకు వచ్చాడా? అని అసలు వాడిని తిరిగి తీసుకొచ్చినందుకు మీ మీద కోపంగా ఉందని చెప్తుంది. క్షమించండి అత్తయ్య తప్పంతా నాదేనని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీరు ఇచ్చిన మాట నెరవేర్చారు నా బాధ్యత మాత్రం నెరవేర్చలేకపోయానని కృష్ణ భవానీ కాళ్ళు పట్టుకుంటుంది. నిన్ను క్షమించడం ఏంటి? నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నీకు క్షమాపణలు చెప్పాలి. ముకుంద ఆదర్శ్ ని ఒక్కటి చేయాలని చూశాం కానీ మనుషులను మార్చగలం కానీ బండరాయిని మార్చలేము కదా. ముకుంద ఒక బండరాయి తాను అనుకున్నది జరగదని తెలిసినా ఇంకా మురారిని కోరుకుంది. నువ్వే మారిందని నమ్మి తన అంతరంగాన్ని అర్థం చేసుకోలేకపోయావని అంటుంది.

తరువాయి భాగంలో..

ఇల్లు అమ్మలేకపోతున్నావని ముకుంద శ్రీనివాస్ ని తిడుతూ నాన్న అని పిలిస్తూ ఫోన్లో మాట్లాడుతుంది. ఆ మాటలు కృష్ణ వింటుంది. తనకి ఎవరు లేరని చెప్పింది కదా మరి నాన్న అని ఎవరితో మాట్లాడుతుందని డౌట్ పడుతుంది. ఎవరిని నాన్న అని పిలుస్తున్నావని కృష్ణ ముకుందని అడుగుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం