Krishna mukunda murari march 28th: నెలరోజుల్లో మురారిని సొంతం చేసుకుంటానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన కృష్ణ
Krishna mukunda murari serial march 28th episode: నెలరోజుల్లో ఎలాగైనా మురారిని సొంతం చేసుకోవాలని అందుకోసం ఎంత ఆరాచకమైన సృష్టించాలని ముకుంద డిసైడ్ అవుతుంది. ఇక మీరా పరిస్థితి తెలుసుకున్న కృష్ణ తన మీద డౌట్ పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial march 28th episode: ఆదర్శ్ నందిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. ఎందుకు వెళ్ళాలి ఈ ఇంట్లో నీకు నాకు ఉండేందుకు ఎంత హక్కు ఉందో తనకి అంతే హక్కు ఉందని మురారి అంటాడు. పోలీసుల దెబ్బలు అప్పుడే తగ్గిపోయాయా నీతులు చెప్పడానికి వచ్చావని నోటి దురుసుగా మాట్లాడతాడు. నీలాగే నందు కూడా నీతులు చెప్తుంటే ఇల్లు వదిలి పొమ్మని చెప్తున్నా అదే నువ్వు చెప్తే పర్మినెంట్ గా ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పాల్సి వస్తుందని ఆదర్శ్ వాగుతాడు. నందిని సీరియస్ అవుతుంది.
మురారిని తిట్టిన ఆదర్శ్
మీరంతా ఒక్కటే మీరు చెప్పేది కూడా ఒక్కటే. అయినా నేను వెళ్లిపోయినప్పుడే నాకోసం రావాల్సింది కానీ ఎవరూ రాలేదు. ముకుంద అడ్డు తొలగించుకోవడం కోసం అప్పుడు నా దగ్గరకు వచ్చారని అపార్థం చేసుకుంటాడు. ఎంత చెప్పినా వినడం లేదని నందిని కోపంగా అంటుంది. వాడు ఎంత చెప్పినా వినడు నిజం ఏంటో వాడంతట వాడు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు వాడే అర్థం చేసుకుంటాడని చెప్పి మురారి నందిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆదర్శ్ తో మాట్లాడటానికి ఎందుకు వెళ్ళావని రేవతి అంటుంది. వాడు మాట్లాడకపోతే చాలా కష్టంగా ఉంది అందుకే వెళ్లానని అంటే ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో మనం ఎదురుపడితే ఇంకా ఆవేశ పడుతున్నాడని, తన కోపం పోయే వరకు మనం దూరంగా ఉండటం మంచిదని కృష్ణ సలహా ఇస్తుంది.
నీ మొగుడు కావాలి ఇచ్చేయ్
భవానీ మీరాని తీసుకుని ఇంటికి వస్తుంది. మొదటి సారి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను అనుకున్నది సాధించకుండానే వెనక్కి వెళ్లిపోయాను. కానీ ఈసారి మాత్రం వెనుకడుగు వేసేది లేదని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇంట్లోకి కుడి కాలు పెట్టి లోపలికి వస్తుంది. కృష్ణ చేసిన అవమానం తలుచుకుంటుంది. ఇంట్లో వాళ్ళకి భవానీ మీరాని పరిచయం చేస్తుంది. నా బిడ్డ ప్రాణాలు కాపాడావ్ అని రేవతి తనకి కృతజ్ఞతలు చెప్తుంది. ఈ ఇంట్లో పరిచయం చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి నా ప్రియమైన కోడలు తింగరి కృష్ణ అంటుంది. నాకు మాత్రం ప్రియమైన శత్రువని ముకుంద మనసులో అనుకుంటుంది. నీకు ఏ సమస్య వచ్చినా కృష్ణకి చెప్పుకో తను పరిష్కరిస్తుందని అంటుంది.
కృష్ణ నా సమస్య ఆ విషయం మీకు ఎలా చెప్పాలి అత్తయ్య అని మనసులో తిట్టుకుంటుంది. పైకి మాత్రం కృష్ణని పొగుడుతుంది. కృష్ణ కూడా నీకు ఏం సాయం కావాలన్నా అడుగు చేస్తానని అంటుంది. నీ మొగుడు కావాలి ఇచ్చేయ్ అయినా నువ్వు ఇచ్చేది ఏంటి నేను లాక్కోవడానికి కదా వచ్చిందని అనుకుంటుంది. ఆదర్శ్ వచ్చి మీరా వైపు కోపంగా చూస్తాడు. మురారిని కాపాడిన మీరా తనే అని ఆదర్శ్ కి పరిచయం చేస్తుంది. సీరియస్ గా చూస్తాడు. తన భార్య చనిపోయింది కదా అందుకే డల్ గా ఉన్నాడని భవానీ కవర్ చేస్తుంది. మీరా ఇక నుంచి మన కుటుంబంలో సభ్యురాలు. ఇక నుంచి మనతో పాటు ఇక్కడే ఉంటుందని భవానీ చెప్పడంతో ఆదర్శ్ కోపంతో రగిలిపోతాడు.
మీరాని ముకుంద అని పిలిచిన భవానీ
భవానీ మీరాని ముకుంద అని పిలుస్తుంది. ఏదో అలవాటులో పొరపాటులో పిలిచానని చెప్తుంది. మీరాకు ముకుంద రూమ్ చూపించమని నందినికి చెప్తుంది. ముకుంద నీ ఫస్ట్ ప్లాన్ సక్సెస్ కానీ నీ ఫోటోకి దండ బాగోలేదు తీయించేద్దామని మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ తన వైపు కోపంగా ఎందుకు చూశాడని ముకుంద ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను మీరా రూపలో ఉన్నాను కదా నా మీద ఎందుకు కోపం అనుకుంటుంది. ముకుంద చనిపోవడానికి కారణం మురారి అని ఆదర్శ్ నమ్ముతున్నాడు కాబట్టి తనని నేను రిలీజ్ చేయించానని నా మీద కోపంగా ఉన్నాడు. కారణం ఏదైనా కోపం తగ్గించి ఈ మీరా మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేయాలి. లేదంటే అత్తయ్యతో చెప్పి నన్ను బయటకు పంపించే ప్రమాదం ఉందని అనుకుంటుంది.
మురారి నిన్ను సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి. నెల తిరిగే లోపు నిన్ను సొంతం చేసుకుంటాను దాని కోసం ఎంతకైనా తెగిస్తాను ఎన్ని ఆరాచకాలైన సృష్టిస్తానని ముకుంద డిసైడ్ అవుతుంది. భవానీ మీరా గురించి చెప్తుంది. ఆ అమ్మాయి ఒక స్లమ్ ఏరియాలో ఇరుకు గదిలో ఉంది. మంచి మనసు ఉన్న ఆమ్మాయికి ఇన్ని కష్టాలా అని భవానీ అంటుంది. మీరా బాగా చదువుకుంది కదా తెలివైనది కదా. తన తెలివికి మంచి ఉద్యోగమే వస్తుంది కదా. మరి మంచి జీతం వస్తుంది కదా. మంచి ఏరియాలో ఉండవచ్చు కదా ఆరూమ్ లో ఉండాల్సిన అవసరం ఏంటని డౌట్ పడుతుంది.
కృష్ణ డౌట్
నాకు ఆ డౌట్ వచ్చింది కానీ జీవితంలో చాలా దారుణమైన దెబ్బలు తిన్నట్టు అనిపించింది. కొన్ని ఎదురుదెబ్బలు తగిలితే జీవితం మీద విరక్తి వస్తుంది. అలాంటి వాళ్ళు విరక్తి బతుకు గురించి ఆలోచిస్తారు. మీరా కూడా అలాంటిదే ఏ ఆశలు కోరికలు ఉన్నట్టు అనిపించలేదని భవానీ తెగ పొగుడుతుంది. కృష్ణ వెంటనే పాపం అని జాలి చూపిస్తుంది. మొదలు పెట్టేసింది ఇక తన కష్టాలు తెలుసుకుని సాల్వ్ చేయడానికి మనల్ని కూడా పక్కన పెట్టేస్తుందని మురారి అంటాడు. ప్రేమ, జాలి మోతాదుకి మించి చేస్తే నష్టం జరుగుతుంది. ముకుంద విషయంలో జరిగింది కదా నీ లిమిట్స్ లో నువ్వు ఉండమని కృష్ణకి మురారి సలహా ఇస్తాడు.
దండెం మీద ఆరేసిన మురారి ష్టర్ తీసుకుని ముకుంద తెగ మురిసిపోతుంది. నువ్వు వచ్చే వరకు నీ షర్ట్ నాకు తోడుగా ఉంటుంది. ఇది ఉంటే నువ్వు నాతో ఉన్న ఫీలింగ్ ఉంటుందని అనుకుని తీసుకుంటుంది. వెనక్కి తిరిగి చూస్తే నందిని ఉంటుంది. షర్ట్ తీసుకోవడం చూసేసిందని మీరా టెన్షన్ పడుతుంది. కానీ నందిని చూడలేదు. మంచిదానిలా మాట్లాడుతూ నటిస్తుంది.
తరువాయి భాగంలో..
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే ఈపూటకు నేను వడ్డిస్తానని ముకుంద అడుగుతుంది. సరేనని ఒప్పుకుంటారు. ఇక మీరా భోజనం కలుపుతుంటే అది కృష్ణ చూసి నువ్వు అచ్చం మా ముకుంద అన్నం కలుపుతున్నట్టే కలుపుతున్నావని అనేసరికి అందరూ తనవైపు చూస్తారు. ముకుంద షాక్ అవుతుంది.
టాపిక్