Krishna mukunda murari march 30th: బెడ్ మీద మురారితో ముకుంద ముచ్చట్లు.. ఆస్తి రాసివ్వమన్న ఆదర్శ్-krishna mukunda murari serial march 30th episode mukunda plan success adarsh demand assets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari Serial March 30th Episode Mukunda Plan Success, Adarsh Demand Assets

Krishna mukunda murari march 30th: బెడ్ మీద మురారితో ముకుంద ముచ్చట్లు.. ఆస్తి రాసివ్వమన్న ఆదర్శ్

Gunti Soundarya HT Telugu
Mar 30, 2024 07:37 AM IST

Krishna mukunda murari serial march 30th episode: ముకుంద మురారి షర్ట్ దొంగిలించి తన గదిలో పెట్టుకుంటుంది. అందులో మురారిని ఊహించుకుంటూ సంబరపడుతుంది. దాన్ని పక్కన పెట్టుకుని మురారి పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 30వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 30వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 30th episode: గోడ మీద ఉన్న ముకుంద ఫోటో తీసేయమని మీరా అడుగుతుంది. తను ఇంట్లో ఉన్నప్పుడు బాధపెట్టింది, ఇప్పుడు ఫోటో కూడా బాధపెడుతుంది. నీ చేతులతో నువ్వే తీసేయ్ అనిన ఆదర్శ్ కి భవానీ చెప్తుంది. ఫోటో తీసేస్తున్నందుకు ముకుంద సంతోషిస్తుంది. ఆదర్శ్ ముకుంద ఫోటో తీయమన్నాడు అంటే అర్థం ఉంది, మీరా ఎందుకు తీయమన్నదని కృష్ణ డౌట్ పడుతుంది. కృష్ణ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఏమైందని మురారి అడుగుతాడు. చనిపోయిన వాళ్ళ ఫోటో హాల్లో పెట్టి దండ వేస్తే తప్పా అంటుంది. అలాగే వేయాలి కదా అంటే కానీ మన ఇంట్లో జరిగింది ఏంటి మీరా తీయమని చెప్పగానే అందరూ కలిసి తీసేశారని కృష్ణ బాధపడుతుంది.

మీరా చేసిన పని నచ్చలేదన్న కృష్ణ 

ముకుంద ఎలాగూ మన మధ్య లేదు కనీసం తన ఫోటో అయిన ఉండాలి కదా అంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముకుందని మనం ఏదో చేశామని ఆదర్శ్ అనుకుంటున్నాడు. ఫోటో చూస్తే అదే గుర్తుకు వస్తుందని తీయమన్నాడని మురారి సర్ది చెప్తాడు. ఆదర్శ్ సరే మీరా ఎందుకు తీయమంది, తను చెప్పిన రీజన్ ఎందుకో కరెక్ట్ గా అనిపించడం లేదు బాగా తెలిసిన వాళ్ళు పోతే చనిపోయి దేవుడితో సమానంగా దండ వేస్తారు అలాంటిది మీరా ఎందుకు అలా అన్నది అంటుంది. మీరా అంతరంగం ఏంటా అని ఆలోచిస్తుంది. తన అంతరంగం మంచిదే అయి ఉంటుంది లేకపోతే నన్ను నమ్మి ఎలా విడిపిస్తుంది తన గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తాడు.

కృష్ణ మురారి షర్ట్ కనిపించడం లేదని వెతుకుతుంది. ఆ షర్ట్ ముకుంద దొంగిలించి తన గదిలో పెట్టుకుంటుంది. గార్డెన్ లోనే ఎక్కడో పడి ఉంటుందని వెళ్ళి చూస్తానని మురారి వెళతాడు. ముకుంద మురారి షర్ట్ తీసుకుని చూసి మురిసిపోతూ ఉంటుంది. మురారి పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ సాంగ్ వేసుకుంటుంది. హల్లో మురారి ఏదో ఆలోచిస్తూ ఉంటే ముకుంద పలకరిస్తుంది. ఏంటి వెతుకుతున్నారని అడుగుతుంది. షర్ట్ కనిపించడం లేదని ఎక్కడో మిస్ అయ్యిందని అంటాడు. నా దగ్గరే ఉంది ఇక అది దొరకదు నువ్వు నాకు దగ్గరైనప్పుడు మాత్రమే దొరుకుతుందని మనసులో అనుకుంటుంది.

మురారిని అడ్డు తప్పించేందుకు కొత్త స్కెచ్ 

ఆ షర్ట్ అంటే అంత ఇష్టమా అంటే ఇష్టమే నాకంటే కృష్ణకి మరీ ఇష్టం. అది కనిపించడం లేదని టెన్షన్ పడుతుందని అంటాడు. బయటకి వెళ్తున్నానని అంటే ఒక్కరే ఎందుకు కృష్ణని తోడుగా తీసుకెళ్లమని చెప్తాడు. ఎందుకు నా బండారం నేను బయట పెట్టుకోవడానికా అనుకుని ఒక్కదాన్నే వెళ్లిపోతానని అంటుంది. తండ్రిని కలిసి మాట్లాడుతుంది. కూతురిని చూసుకుని శ్రీనివాస్ సంతోషిస్తాడు. చేరాల్సిన చోటుకి చేరిపోయావా అంటాడు. ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటో చూపిస్తూ కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఫోటో నీకు పంపిస్తాను. అది నేను మురారి కలిసి ఉన్న ఫోటో ఇద్దరి మెడలో పూల దండలతో అంటుంది.

శ్రీనివాస్ కూతురు మాటలకు షాక్ అవుతాడు. తనకి డబ్బు చాలా అవసరమని ఇల్లు త్వరగా అమ్మేయమని చెప్తుంది. మురారిని దక్కించుకోవడం కోసం చాలా ప్లాన్స్ చేయాలి అందుకోసం డబ్బు కావాలని చెప్తుంది. దేవుళ్ళు కొత్త అవతారాలు ఎత్తుతారు అలాగే నేను కూడా కొత్త అవతారం ఎత్తాను. అందుకే నేను దేవతను. నా ఫోటో పెట్టి దండ వేయమని చెప్తుంది. మురారి అనే వాడిని లేకుండా చేస్తే ఈ బాధలు ఉండేవి కావు. కానీ పాపం కృష్ణ మురారిని ఏమైనా చేస్తే అన్యాయం అయిపోతుందని బాధపడతాడు. వేరే ఏదో ఒక ప్లాన్ వేయాలని డిసైడ్ అవుతాడు.

ఆస్తి రాసివ్వమన్న ఆదర్శ్ 

పోలీస్ అయి ఉండి నేనే పోలీసు దెబ్బలు తినాల్సి వచ్చిందని మురారి అనేసరికి కృష్ణ ఏడుస్తుంది. మనం ఎవరికి ఏం అన్యాయం చేశాం మనకే ఇలా ఎందుకు జరుగుతుందని బాధపడుతుంది. మురారి తనని ఓదారుస్తాడు. ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ బాబాయ్ నిన్ను వదిలేస్తారా ? మళ్ళీ ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉందని చెప్తుంది. హోమ్ మినిస్టర్ విడిపించాడు ఇక తన జోలికి రాడు అని మురారి చెప్తాడు. 

హోమ్ మినిస్టర్ కాకపోతే మరేదైనా మార్గం ద్వారా మిమ్మల్ని ఏదైనా చేస్తాడేమోనని భయంగా ఉందని అంటుంది. తన జాగ్రత్తలో ఉంటానని ధైర్యం చెప్తాడు. ఆదర్శ్ మందు తాగడం కోసం బాటిల్ పట్టుకుని వెళ్తుంటే మధు అడ్డుపడతాడు. గదిలో తాగమని చెప్తే ఆదర్శ్ నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తాడు. నువ్వు ఎవరు నాకు నీతులు చెప్పడానికని తిడతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ఆదర్శ్ ఇల్లు, ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని భవానీని అడుగుతాడు.

WhatsApp channel