Krishna mukunda murari march 29th: భర్త మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్న ముకుంద.. ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్న కృష్ణ
Krishna mukunda murari serial march 29th episode: మీరా ఇంట్లో ఉండటం తనకి ఇష్టం లేదని వెంటనే పంపించేయమని ఆదర్శ్ భవానీతో చెప్తాడు. దీంతో కొడుకుని తిడుతుంది. ఆదర్శ్ మాటలు విన్న ముకుంద ఎలాగైనా తన మనసు గెలుచుకోవాలని డిసైడ్ అవుతుంది.
Krishna mukunda murari serial march 29th episode: అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. ఆదర్శ్ ఎక్కడ పిలవమని అంటే పిలిచినా రాడని నందిని చెప్తుంది. నేను నా కొడుకు మురారిని ఒక రకంగా తనని మరొక రకంగా చూస్తున్నానని అంటున్నాడని రేవతి చెప్తుంది. తనని ఇలాగే వదిలేస్తే ఇంట్లో అందరినీ శత్రువులు మాదిరిగా చూస్తాడని వాడిని మార్చాలని భవానీ అంటుంది. ముకుంద మురారి షర్ట్ పట్టుకుని గదిలోకి వచ్చి మురిసిపోతుంది. కానీ వెంటనే షర్ట్ బదులు మురారి ప్రత్యక్షం అవుతాడు.
కృష్ణ నీకు సెట్ అవదు
మురారి నేను నీ ముకుందను నీకోసం చూడు ఎలా మారిపోయానో. ఈ షర్ట్ నీకు చాలా బాగుంటుంది కానీ ఇది వేసుకుని నువ్వు కృష్ణ పక్కన ఉంటే బాగోదు అదే నా పక్కన ఉంటే నీ అందం రెట్టింపు అవుతుంది. అసలు నీకు కృష్ణ సెట్ అవదు ఎందుకు నువ్వు దాన్ని పట్టుకుని వేలాడతావ్. వచ్చేయ్ మనం ఇద్దరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దామని అంటుంది. అప్పుడే కృష్ణ వచ్చేసరికి షర్ట్ తీసి దాచి పెట్టేస్తుంది. భోజనానికి రమ్మని పిలిచి వెళ్ళిపోతుంది. ఆదర్శ్ కిందకి వస్తే భోజనం చేయమని చెప్తుంది. మనసు బాగోలేదని అంటే అంత కష్టం ఏమొచ్చిందని అడుగుతుంది.
ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఉంటే మనసు కష్టంగా ఉంటుందని ఆదర్శ్ చెప్తాడు. మురారి, కృష్ణ ఉండటం ఇష్టం లేదని అంటున్నాడు నన్ను కూడా ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడని నందిని తల్లికి చెప్తుంది. అంత కష్టంగా ఉంటే వెళ్లిపోతామని కృష్ణ, మురారి తినకుండా లేస్తారు. భవానీ సీరియస్ గా కూర్చోమని చెప్తుంది. కొన్ని బంధాలు నిలబడాలంటే కొన్నింటిని లెక్కలోకి తీసుకోవాలి, కొన్నింటిని లెక్క తీసుకోకూడదు. కొన్నాళ్ళు నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉన్నావ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళని దూరంగా పొమ్మంటున్నావా అని భవానీ అడుగుతుంది.
మీరాని పంపించేయమన్న ఆదర్శ్
నేను చెప్పింది మీరా గురించి శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడకుండా చేసింది. తనని ఇంట్లోకి తీసుకురావడం నాకు నచ్చలేదమ్మ. అదంతా ముకుంద వింటుంది. నా అనుమానమే నిజం అయ్యింది. ఇప్పుడు కృష్ణ, మురారి అంటే ఆదర్శ్ కి ఇష్టం లేదు. ఇది ఒకందుకు మంచిదే వాళ్ళు గొడవ పడితేనే కదా నా పని సులువు అవుతుందని అనుకుంటుంది. మీరాని ఇంట్లో నుంచి పంపించేయమని ఆదర్శ్ అంటాడు. తను ఈ ఇంట్లో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను కానీ ఎప్పుడు కొట్టలేదు ఈరోజు కొట్టాను. మొదటిసారి నిన్ను కొట్టాను అంటే నీ ఆలోచనలు దారి తప్పాయి. అర్హత ఉన్నవాళ్ళకే ఈ ఇంట్లో చోటు ఉంటుంది. అర్హత లేనివాళ్ళు ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందే ముకుందలాగా.
నేను ఎక్కడికి పోలేదు అత్తయ్య ఈ ఇంట్లో ఎక్కువగా ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది అది మీకు తొందర్లోనే అర్థం అవుతుందని మనసులో అనుకుంటుంది. అందరి దగ్గరకి సింపతీ కొట్టేయాలని మీరా డ్రామా స్టార్ట్ చేస్తుంది. కన్నీళ్ళు పెట్టుకుంటుంది మీరా. ఇంత పెద్ద కుటుంబంతో కలిసి ఉంటానని కలలో కూడా ఊహించలేదని నటిస్తుంది. అందరూ తన యాక్టింగ్ నిజమని నమ్మేస్తారు. ఆదర్శ్ కోపాన్ని పోగొట్టాలని తన మనసు గెలుచుకోవాలని అనుకుంటుంది. అందరికీ తాను వడ్డిస్తానని అడుగుతుంది.
ముకుంద ఫోటో తీసేయమన్న మీరా
మీరా ఆదర్శ్ కి వడ్డిస్తుంటే కోపంగా చూస్తాడు. ఆదర్శ్ కి ఇష్టమైనట్టుగా ఫుడ్ వడ్డిస్తుంటే నా ఇష్టాలు నీకు ఎలా తెలుసని గట్టిగా నిలదీస్తాడు. నువ్వు సీరియస్ గా చూసేసరికి టెన్షన్ లో వేసి ఉంటుందని సుమలత అంటుంది. అక్కడ గోడకి తన ఫోటోకి దండ వేసి ఉండటం చూసి షాక్ అవుతుంది. ఎలాగైనా దాన్ని తీసేయించాలని అనుకుంటుంది. మీరా అన్నం కలపడం చూసిన కృష్ణ నువ్వు అచ్చం మా ముకుందలాగే కలుపుకుంటున్నావని అనేసరికి అందరూ తనవైపు చూస్తారు. డౌట్ రాకుండా ఏదో చెప్పి కవర్ చేస్తుంది. ముకుందతో ఉన్న ఒక జ్ఞాపకం చాలా బాధేస్తుంది. అది తను రైలు కింద పడిపోవడం. అది గుర్తుకు వచ్చినప్పుడు నా గుండె తరుక్కుపోతుంది. మర్చిపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నా. కానీ గోడ మీద ఉన్న ఫోటో చూస్తుంటే నాకు అదే గుర్తుకు వస్తుందని చెప్తుంది.
ఏమి అనుకొకపోతే ఆ ఫోటోకి ఉన్న దండతో పాటు ఫోటో కూడా తీసేస్తారా అని అడుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే వద్దని మళ్ళీ కవర్ చేస్తుంది. మనుషులు మనసులో ఉంటే చాలు గోడ మీద పెట్టడం ఎందుకని అంటుంది. ఈ ఒక్క విషయంలో కరెక్ట్ గా చెప్పావ్ నేను అదే ఫీల్ అయ్యాను. ఎవరిదైనా ఫోటో కనిపిస్తే వాళ్ళకి సంబంధించిన తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి కానీ చేదు జ్ఞాపకాలు కాదని అంటాడు. అయితే వెళ్ళి తీసేయమని చెప్తుంది.
తరువాయి భాగంలో..
ఆదర్శ్ కి ముకుంద మందు పోస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ తనని మనిషిగా చూడటం లేదని అంటాడు. మధుతో ఆదర్శ్ గొడవ పడుతుంటే భవానీ వస్తుంది. ఏంటి గొడవ అంటే నేను నీకు సొంత కొడుకుని కాదు కదా అందుకే అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు. నాకు విలువ ఇవ్వడం లేదని అంటాడు. ఏం చేస్తే సొంత వాడిలా ఫీల్ అవుతావని భవానీ అడుగుతుంది. ఈ ఇల్లు, ఆస్తి నా పేరు మీద రాసేయి అప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేస్తానని అంటాడు.
టాపిక్