Krishna mukunda murari march 23rd: శ్రీనివాస్ కాళ్ళ మీద పడిన కృష్ణ.. మురారి ముందు నిజాలన్నీ కక్కేసిన ముకుంద
Krishna mukunda murari serial march 23rd episode: మురారిని విడిపించమని కృష్ణ ఏడుస్తూ శ్రీనివాస్ కాళ్ళ మీద పడుతుంది. కానీ శ్రీనివాస్ మాత్రం ఒప్పుకోడు. తండ్రి చేసిన మోసం తెలుసుకుని వెంటనే మురారిని విడిపించాలని వెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial march 23rd episode: మురారి కనిపించకపోయే సరికి కృష్ణ కుమిలికుమిలి ఏడుస్తుంది. మినిస్టర్ కి భవానీ ఫోన్ చేస్తుంది. నా కోడలు ముకుంద సూసైడ్ చేసుకుంది. ఆ కేసుకు సంబంధించి మురారిని అరెస్ట్ చేశారని చెప్తుంది. మురారిని విడిపించమని ఫోన్ చేయలేదు కదా అది అయితే నా చేతుల్లో లేదు. నాకంటే పవర్ ఉన్న వాళ్ళు మహిళా మండలి సంఘం వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వారిని శిక్షించకుండా ఎలా వదిలేస్తారని నన్ను ఉతుకుతారని మంత్రి చెప్తాడు. అలా అనకండి మా మురారి తప్పు ఏం లేదు వాడు అమాయకుడని అంటుంది.
భవానీకి సాయం చేయనన్న మినిస్టర్
తన చావుకు కారణం మురారి అని చెప్పి ముకుంద సూసైడ్ నోట్ లో ఉంటే తను అమాయకుడని అంటారెంటని మంత్రి ప్రశ్నిస్తాడు. ఈ విషయంలో తాను ఏ సహాయం చేయలేనని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మంత్రి పక్కనే శ్రీనివాస్ ఉంటాడు. స్నేహితుడు కోసం చాలా చేస్తున్నావని చెప్పి థాంక్స్ చెప్తాడు. ఇప్పుడు మురారిని విడుదల చేస్తే మళ్ళీ వాడి చుట్టూ పిచ్చిదానిలా తిరుగుతుంది. రూపం మారినా దాని తలరాత మారకుండా పోతుందని శ్రీనివాస్ బాధపడతాడు. మురారి తలరాత మార్చేస్తున్నాం కదా నీ బిడ్డకి ఏం కాదని మంత్రి హామీ ఇస్తాడు.
ఆదర్శ్ తాగుతుంటే మధు వస్తాడు. ఎవరు ఎంత చెప్పినా ఎందుకు నీ ప్రవర్తన మార్చుకోవడం లేదని నిలదీస్తాడు. క్లాస్ పీకడానికి వస్తే వినే ఓపిక లేదని అంటాడు. కృష్ణని ఎందుకు బాధ పెట్టేలా మాట్లాడతావని అడుగుతాడు. మళ్ళీ ఇంకొకసారి ఇలా జరగకూడదని వార్నింగ్ ఇస్తాడు. పెగ్గు కోసం బెగ్గింగ్ చేసే నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా పో బయటకి ఆదర్శ్ అవమానిస్తాడు. నాకు వచ్చే కోపానికి ఇక్కడే నీ బుర్ర పగలగొట్టాలని ఉంది కానీ ఈ ఇంటి మనుషుల పట్ల ప్రేమ ఉంది అన్ని వదిలేసి నీలాగా పశువులాగా ప్రవర్తించలేనని ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని వార్నింగ్ ఇస్తాడు కానీ ఆదర్శ్ పట్టించుకోడు.
లాకప్ డెత్ ప్లాన్
భవానీ రేవతికి ఫోన్ చేసి మినిస్టర్ హెల్ప్ చేయనని చెప్తున్నాడని అంటుంది. అరెస్ట్ చేయించింది ఆయనే కదా మళ్ళీ ఆయన చేతిలో లేకపోవడం ఏంటని కృష్ణ అంటుంది. ఆయన శ్రీనివాస్ ఫ్రెండ్ కదా అతనికి మాట ఇచ్చి ఉంటాడు, డైరెక్ట్ గా అడిగితే మహిళా సంఘాలని ఏవేవో మాట్లాడుతున్నాడని భవానీ చెప్తుంది. రేవతి ఏడుస్తుంటే ధైర్యం చెప్తుంది. రెండు రోజుల్లో వచ్చేస్తున్నానని అంటుంది. కృష్ణ ఇంటికి కానిస్టేబుల్ వస్తాడు. ఏసీపీ సర్ మంచివాళ్ళు. కానీ ఆయన వెనుక కుట్ర జరుగుతుంది. ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటకి తీసుకురండి లేదంటే లాకప్ డెత్ జరుగుతుందని కానిస్టేబుల్ చెప్తాడు. ఆ మాటకు కృష్ణ కుప్పకూలిపోతుంది. ఇన్ స్పెక్టర్ పై ఆఫీసర్ తో మాట్లాడుతుంటే విన్నానని చెప్తాడు.
శ్రీనివాస్ బాబాయ్ ఒక్కరు మాత్రమే మురారిని కాపాడగలుగుతాడని కృష్ణ నమ్మకంగా చెప్తుంది. అవసరంఅయితే ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడతానని చెప్పి శ్రీనివాస్ దగ్గరకి బయల్దేరుతుంది. ముకుందని శ్రీనివాస్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. మురారిని కలిసి కృష్ణని బయటకి తీసుకురావడానికి వెళ్తానని ముకుంద చెప్పేసరికి శ్రీనివాస్ టెన్షన్ పడతాడు. ఈ టైమ్ లో వద్దు తర్వాత వెళ్లవచ్చని సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ ముకుంద మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈ ఒక్కరాత్రి ముకుందని ఆపితే తెల్లారే సరికి మురారి ఉండదు. అప్పుడు ఏ సమస్య ఉండదని శ్రీనివాస్ ఆలోచిస్తాడు. అప్పుడే కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వస్తుంది.
తండ్రి మోసం తెలుసుకున్న ముకుంద
తనని చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. ముకుంద చాటుగా మొత్తం గమనిస్తుంది. కృష్ణని వెళ్లిపొమ్మని చెప్తాడు. ఏసీపీ సర్ ని ఎలాగైనా కాపాడమని విడిపించమని ఏడుస్తూ కృష్ణ శ్రీనివాస్ కాళ్ళ మీద పడుతుంది. కృష్ణ ఇక్కడ ఉంది ఏంటని అనుకుంటుంది. మీకు ఏం అన్యాయం చేశామని ఏసీపీ సర్ ని అరెస్ట్ చేయించారని కృష్ణ ఏడుస్తూ అడుగుతుంది. కృష్ణని అరెస్ట్ చేయించమని చెప్తే మురారిని అరెస్ట్ చేయించడం ఏంటని ముకుంద అనుకుంటుంది. నాకేం తెలియదు గొడవ చేయకుండా వెళ్లిపొమ్మని శ్రీనివాస్ టెన్షన్ గా చెప్తాడు. మీకు అంతా తెలుసు హోమ్ మినిస్టర్ తో మాట్లాడి మురారిని అరెస్ట్ చేయించారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో తెలియదు. లాకప్ డెత్ అని న్యూస్ వినిపిస్తుంది. ఆయన్ని ఏం చేయవద్దని కృష్ణ మళ్ళీ శ్రీనివాస్ కాళ్ళ మీద పడుతుంది.
నేను కంప్లైంట్ ఇచ్చాను తర్వాత ఏం జరిగిందో తనకి తెలియదని అంటాడు. ముకుంద చావుకు ఏసీపీ సర్ కారణం కాదని అంటుంటే శ్రీనివాస్ మాత్రం వినిపించుకోకుండా వెళ్లిపొమ్మని చెప్పేసి డోర్ వేసేస్తాడు. ముకుంద మొత్తం విని తండ్రి మీద కోపంతో రగిలిపోతుంది. కృష్ణ మాటలు పట్టించుకోవద్దని శ్రీనివాస్ చెప్తాడు. ఆపండి నాన్న నేను నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటని నిలదీస్తుంది. అవును మురారిని నేనే అరెస్ట్ చేయించాను తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. కృష్ణ అమాయకురాలు అందుకే మురారిని అరెస్ట్ చేయించానని చెప్తాడు.
మురారిని షూట్ చేస్తారన్న ఆదర్శ్
నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానో చెప్పినా అర్థం కాలేదా? నేను ఇది చేస్తుంది కృష్ణ మీద పగతో కాదు మురారికి దగ్గర కావడానికని చెప్తుంది. అదే నాకు ఇష్టం లేదు నువ్వు మళ్ళీ మురారి వెనుక పిచ్చిదానిలా తిరుగుతున్నావ్. కృష్ణ లాకప్ డెత్ అంటుంది అంటే మురారిని చంపేద్దామని అనుకుంటున్నావా? మురారి నా ప్రాణం తనకోసం రూపం మార్చుకుని ఉంటే ఇలా చేస్తావా? తను ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతుంది. చెప్పనని అంటాడు. నా మురారికి ఏమైనా జరిగితే ఈ ముకుంద ప్రాణాలతో ఉండదని బెదిరిస్తుంది. దీంతో శ్రీనివాస్ మురారి ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. ముకుంద స్టేషన్ కి బయల్దేరుతుంది.
కృష్ణ ఇంటికి వచ్చి శ్రీనివాస్ సాయం చేయనని అన్నారని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని చెప్తుంది. ఏసీపీ సర్ మీద చాలా కక్ష పెంచుకున్నారు ఆయన తప్పు లేదని చెప్పిన వినిపించుకోలేదని కృష్ణ ఏడుస్తూ చెప్తుంది. కూతురు ప్రాణాలు తీస్తే నువ్వు ఏడుస్తూ అడిగితే కనికరిస్తాడా? ఆయన మంచోడు కాబట్టి అరెస్ట్ చేయించి వదిలేశాడు. ఆయన ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే షూట్ చేసి ఉండేవారని ఆదర్శ్ అంటాడు. స్టాపిడ్ ఆదర్శ్ అని కృష్ణ కోపంగా అంటుంది. ఈరోజు మనం ఏడుస్తున్నామంటే అందుకు కారణం మురారి కదా. మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందేనని అంటాడు.
మురారి ముందు నిజాలు కక్కేసిన ముకుంద
ఏసీపీ సర్ ఏ తప్పు చేయలేదని కృష్ణ గట్టిగా అరుస్తుంది. ఆదర్శ్ మాత్రం మురారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఏసీపీ సర్ కి శిక్ష వేయడం లేదు లాకప్ డెత్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని కృష్ణ ఏడుస్తూ చెప్తుంది. నిజంగా తప్పు చేసి ఉంటే చట్టానికి వదిలేయచ్చు కదా ప్రాణాలు తీయడం ఎందుకని కృష్ణ నిలదీస్తుంది. ఎన్ని చెప్పినా కూడా ఆదర్శ్ మాత్రం ముకుంద మరణ వాంగ్మూలం గురించే నమ్ముతాడు. ఈ రెండేళ్ళు నువ్వు ఇక్కడ లేవు నీకేం తెలియదు ఆ లెటర్ లో ఉన్నవన్నీ అబద్ధాలు అది నువ్వు తెలుసుకున్న రోజు నాకంటే ఎక్కువ ఏడుస్తావని కృష్ణ చెప్తుంది. మురారి ముకుంద గురించి ఆలోచిస్తాడు. నువ్వు కనిపించడం నా భ్రమ మాత్రమే. నువ్వు ఆత్మ రూపంలో నా చుట్టూ ఉంటే నన్ను ఈ పరిస్థితిలో చూసి వదలవు. నేను నీకు దక్కలేదని నువ్వు చనిపోయి నాకు ఈ శిక్ష వేశావని అనుకుంటాడు.
ముకుంద స్టేషన్ కి వచ్చి దెబ్బలతో ఉన్న మురారిని చూసి బాధపడుతుంది. తనతో మాట్లాడటానికి వెళ్తుంది. మురారి ముకుందని ఆశ్చర్యంగా చూస్తాడు. ముకుంద మురారి దెబ్బలు చూసి చలించిపోతుంది. ఈ దెబ్బలు ఏంటి కొట్టారా? తప్పు నాదే నన్ను క్షమించు. కృష్ణని అరెస్ట్ చేయమని చెప్తే నాన్న నిన్ను అరెస్ట్ చేయించారు. నాన్నకి నీ మీద ఇంత కోపం ఉందని నాకు తెలియదు తప్పంతా నాదేనని తన చెంపలు తానే వాయించుకుంటుంది. నీకు దగ్గర కావాలని ఏదో చేయాలని అనుకుంటే ఏదో జరిగిందని ముకుంద ఆవేశంలో నిజాలన్నీ చెప్పేస్తుంది.
తరువాయి భాగంలో..
భవానీ దేవి ముకుందని తీసుకుని ఇంటికి వస్తుంది. ఒకసారి కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టి వెనక్కి వెళ్లిపోయాను ఈసారి వెనుకడుగు వేసేదే లేదని ముకుంద మనసులో అనుకుంటుంది.