Krishna mukunda murari march 27th: ఆదర్శ్ కి కృష్ణ వార్నింగ్.. భవానీ ఇంప్రెస్, ముకుంద సక్సెస్, అసలు ఆట మొదలైంది
Krishna mukunda murari serial march 27th episode: భవానీ ముకుంద అలియాస్ మీరాని కలిసేందుకు వెళ్తుంది. తన మాటలకు భవానీ ఇంప్రెస్ అయిపోతుంది. తమతో పాటు ఉండమని చెప్పి మీరాని భవానీ ఇంటికి తీసుకెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial march 27th episode: ఆదర్శ్ కిందకి వచ్చి రేవతి దగ్గర నిష్టూరంగా మాట్లాడతాడు. మురారి తిన్నాడా? వాడిని పిలిచి మరీ పెడతారు కానీ నన్ను మాత్రం పట్టించుకొరని దెప్పి పొడుస్తాడు. టిఫిన్ విషయంలో కూడా ఎందుకు గొడవ చేస్తున్నావని సుమలత, మధు అడుగుతారు. ముకుంద చనిపోవడానికి మురారి కారణమని మరోసారి తిడతాడు. అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడుగుతాడు. మురారిని విడిపించిన మీరాకి థాంక్స్ చెప్పడానికి వెళ్ళిందని సుమలత చెప్తుంది.
ఆదర్శ్ కి వార్నింగ్
ఇప్పుడే కదా మా అమ్మ వచ్చింది అప్పుడే మీ వైపుకు తిప్పుకుని ఆ పనికిమాలిన దాని దగ్గరకు పంపించారా? అని అంటాడు. కృష్ణ వచ్చి ఎవరిని పనికిమాలినది అంటున్నావ్ ఏసీపీ సర్ ని కాపాడిన దేవత ఆ అమ్మాయి. అత్తయ్య కూడా అలా అనుకున్నారు కాబట్టే వచ్చీ రాగానే తనకి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళిందని చెప్తుంది. ఆవిడను దేవతను చేసి మా అమ్మ మనసు మార్చి పంపించారు. ప్రశాంతంగా అమెరికాలో ఉన్న తనని టెన్షన్ పెట్టి రప్పించారని కోపంగా అంటాడు. చాలు పడుతున్నాం కదాని ఇంకా మాట్లాడొద్దని కృష్ణ నోరు మూయిస్తుంది. ఇవే మాటలు పెద్దమ్మ దగ్గర మాట్లాడు పళ్ళు రాలగొడుతుందని మధు అంటాడు. ఇలా పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకునేది లేదని కృష్ణ వార్నింగ్ ఇస్తుంది.
మీరా ఉన్న ఏరియాకు వస్తుంది. హోమ్ మినిస్టర్ కూతురికి, ముకుందకి ఫ్రెండ్ అన్నారు ఈ అమ్మాయి చూస్తే ఈ ఏరియాలో ఉందని భవానీ డౌట్ పడుతుంది. భవానీ మీరా దగ్గరకు వస్తుంది. నాకు తెలుసు అత్తయ్య మీరు వస్తారని మీ రాక కోసం ఎదురుచూస్తున్నానని అనుకుంటుంది. ఏమి తెలియనట్టు ఎవరు మీరు అని భవానీని అడుగుతుంది. మురారి పెద్దమ్మని అని చెప్తుంది. విరిగిపోయిన కుర్చీ తీసుకొచ్చి వేసి కూర్చోమని అంటుంది. తను పేదరికంలో బతుకుతున్నట్టు కలరింగ్ ఇస్తుంది.
ముకుంద ప్లాన్ సక్సెస్
నువ్వు కాపాడింది ఒక్క ప్రాణం కాదు మా ఇంటి అందరి ప్రాణాలు, పరువుని కాపాడావు. నువ్వు చేసిన పనికి నీకు చేతులెత్తి మొక్కాలని అంటుంది. హోమ్ మినిస్టర్ కూతురు, మా కోడలు ఫ్రెండ్ వి కదా మరి ఏంటి ఇలాంటి ప్లేస్ లో ఉన్నావని అడుగుతుంది. గొప్ప వాళ్ళు స్నేహితులు అయినా వాళ్ళు దగ్గర సాయం తీసుకోవడం ఇష్టం లేదని కవర్ చేస్తుంది. ముకుంద గురించి గొప్పగా చెప్తుంది. తనని ఒక అనాథగా పరిచయం చేసుకుంటుంది. మీరా మాటలకు భవానీ ఇంప్రెస్ అవుతుంది. నువ్వు మాకు చేసిన మేలుకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మా ఇంట్లో అంటుంది. ఇంత త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తావని అనుకోలేదని ముకుంద మనసులో సంతోషపడుతుంది.
ఇంటికి రాలేనని మీరా బిల్డప్ ఇస్తుంది. నేను ఇలాగే ఆత్మాభిమానంగా ఉంటాను కానీ సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయకుండా ఉండలేను. ఒకప్పుడు దంపతులు నాకు సాయం చేశారు. కానీ ప్రమాదవశాత్తూ వాళ్ళు చనిపోయారు. అప్పటికి వాళ్ళకు ఆరు నెలల కొడుకు ఉన్నాడు. వాడిని నేనే పెంచుకున్నాను వాడు ఎవరో కాదు నా పెద్ద కొడుకు ఆదర్శ్ అని చెప్తుంది. నువ్వు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తమ ఇంటికి వచ్చి ఉండమని చెప్తుంది. తనని ఒప్పించి ఇంటికి తీసుకెళ్తుంది. మీరాకు కావాల్సిన బట్టలు అన్నీ కొనిస్తుంది.
మురారికి ముద్దుపెట్టిన కృష్ణ
శ్రీనివాస్ దగ్గరకు తన స్నేహితులు వచ్చి పరామర్శిస్తారు. ఈ టాపిక్ వదిలేయమని శ్రీనివాస్ కోపంగా అంటాడు. ముకుంద ఫోటోకి దండ వేసి దీపం పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదని ఫ్రెండ్ అడుగుతాడు. అది పెడితే మళ్ళీ గుర్తు వస్తుందని అందుకే పెట్టలేదని చెప్తాడు. ట్రైన్ కింద పడి చావాల్సిన అవసరం ఏమొచ్చిందని గుచ్చి గుచ్చి అడిగేసరికి శ్రీనివాస్ కోపంగా ఆపండని గట్టిగా అరుస్తాడు. బతికుండగానే చనిపోయినట్టు నటించే నీచమైన ఆలోచన తనకి ఎలా వచ్చిందోనని తిట్టుకుంటాడు. మీరా ఇంటికి రాగానే తనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కృష్ణ అంటుంది. నేను నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని మురారి చెప్తాడు.
ఏంటి అంటే బిడ్డను అని చెప్తాడు. అది నాకు ఇచ్చే గిఫ్ట్ మాత్రమే కాదు ఇంట్లో అందరికీ ఇచ్చే గిఫ్ట్ అంటుంది. కృష్ణకు ఐలవ్యు చెప్తాడు. కృష్ణ సిగ్గుపడుతూ ఐలవ్యూ 2 అని ముద్దుపెడుతుంది. ఆదర్శ్ ఏక్ నిరంజన్ అని పాట పెట్టుకుని ఉండేసరికి నందిని వచ్చి పిలుస్తుంది. అమ్మ మీరాని తీసుకొస్తుందని నందిని చెప్తుంది. థాంక్స్ చెప్పడానికి వెళ్ళింది కదా మళ్ళీ ఆ దరిద్రం ఇంటికి ఎందుకని అంటాడు. ఇలా మాట్లాడతావనే ముందుగా చెప్తున్నానని నందిని అంటుంది. అసలు నీకు ఈ ఇంట్లో ఏం పని? పెళ్లైంది భర్త అత్తమామల దగ్గర ఉండకుండా ఎప్పుడు ఇక్కడే పడి మాకు నీతులు చెప్తావ్ ఏంటని నందినిని బాధపెడతాడు. ఇక్కడ విషయాలు పట్టించుకోకుండా నీ ఇంటికి నువ్వు వెళ్లిపో అంటాడు. ఎందుకు వెళ్లాలని మురారి అంటాడు.
తరువాయి భాగంలో..
మీరా ఇంట్లో అందరికీ భోజనం వడ్డిస్తుంది. ముకుంద రైలు కింద పడిపోవడం నాకు చాలా బాధగా ఉంది గోడ మీద తన ఫోటో చూస్తుంటే నాకు అదే గుర్తుకు వస్తుంది. మీరు ఏమి అనుకొకపోతే ఫోటో తీసేయమని అడుగుతుంది. అందరూ షాకింగ్ గా చూస్తారు.
టాపిక్