Krishna mukunda murari march 22nd: ఆదర్శ్ మీద చెయ్యెత్తిన కృష్ణ.. మురారి మిస్సింగ్, గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ
Krishna mukunda murari serial march 22nd episode: ముకుంద చెప్పినట్టుగా కాకుండా శ్రీనివాస్ మురారిని అరెస్ట్ చేయించి లాకప్ డెత్ చేయించాలని ప్లాన్ వేస్తాడు. అటు ఆదర్శ్ ముకుంద చనిపోవడానికి కారణం మురారి అని పూర్తిగా నమ్మేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial march 22nd episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ఆదర్శ్ ముకుంద మరణ వాంగ్మూలం చదివి పూర్తిగా అపార్థం చేసుకుంటాడు. ముకుంద పోతూ పోతూ ఎందుకు నా కొడుకు జీవితం నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఉందని అన్నీ అబద్ధాలు రాసిందని రేవతి ఏడుస్తుంది. ముకుంద చావుకి నీ కొడుకు కారణం అనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. తను ఏ తప్పు చేయలేదని దీని నుంచి ఎలా బయట పడాలో చూసుకుంటానని మురారి అందరికీ ధైర్యం చెప్పేసి పంపించేస్తాడు.
కూతురికి అబద్ధం చెప్పిన శ్రీనివాస్
ముకుంద మురారి గురించి ఆలోచిస్తూ ఉండగా శ్రీనివాస్ వస్తాడు. కృష్ణని అరెస్ట్ చేయించావా లేదా అంటే చేయించానని అబద్ధం చెప్తాడు. కానీ నువ్వు అనుకున్నట్టు కృష్ణని అరెస్ట్ చేయించలేదు నీతో వైట్ పేపర్ మీద సంతకం చేయించి మురారీనే నిన్ను మోసం చేయించాడని చెప్పి శిక్ష వేయించానని మనసులో అనుకుంటాడు. ముకుంద సంతోషంగా తండ్రికి థాంక్స్ చెప్పి నా విజయానికి మొదటి మెట్టు పడిందని సంతోషపడుతుంది. మురారి కృష్ణని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తను బయటకి రాకూడదని అంటుంది. హోమ్ మినిస్టర్ ఇన్ ఫ్యూయెన్స్ తో అరెస్ట్ చేయించాను ఎవరు రికమెండ్ చేసినా బయటకి రావడం కష్టమని శ్రీనివాస్ చెప్తాడు. మరి మురారి పరిస్థితి ఏంటి తను ఎలా ఉన్నాడని ముకుంద అడుగుతుంది.
ఎలా ఉంటాడు నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాడని చెప్తాడు. మురారి శిక్ష అనుభవించడం ఏంటని షాక్ అవుతూ అడుగుతుంది. కృష్ణకి దూరంగా ఉండటం అంటే మురారికి శిక్ష కదాని శ్రీనివాస్ కవర్ చేస్తాడు. కృష్ణ కష్టం ముకుంద ముద్దు అనుకునే రోజు రావాలి. ఆరోజు తీసుకొస్తా ఇప్పుడు కృష్ణ అరెస్ట్ అయిన బాధలో ఉన్నాడు కదా ఇప్పుడు వెళ్తానని అనేసరికి శ్రీనివాస్ కంగారుగా వద్దని అంటాడు. రేపు కృష్ణని హెల్ప్ చేయడానికి మురారి దగ్గరకి వెళ్ళి తనకి దగ్గర అవుతానని ముకుంద అంటుంది. రేపు నువ్వు మురారి కోసం వెళ్ళేసరికి లాకప్ డెత్ అయి ఉంటాడు. కాసేపు నువ్వు నన్ను తిట్టుకున్నా తర్వాత నీ బతుకు గురించి ఆలోచిస్తావని శ్రీనివాస్ అనుకుంటాడు.
ఆదర్శ్ మీద చెయ్యెత్తిన కృష్ణ
కృష్ణ వాళ్ళు ఇంటికి వస్తారు. రేవతి ఎవరికో ఫోన్ చేసి మురారి విషయం గురించి మాట్లాడుతుంది. మధు కూడా తన ప్రయత్నం తాను చేస్తాడు. కమిషనర్ అబ్బాయి నా ఫ్రెండ్ తనతో మాట్లాడాను ఇందులో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడంట మేమేమి చేయలేమని అంటున్నారని మధు అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది. ఆయన్ని ఎలాగైనా బయటకి తీసుకురమ్మని కృష్ణ రేవతిని బతిమలాడుతుంది. వాడు రాడు కృష్ణ మర్చిపో. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ మురారిని బయటకి తీసుకురాలేరు. జీవితాంతం జైలులో మగ్గి అక్కడే చావాల్సిందేనని ఆదర్శ్ అంటాడు. తన మాటలకు కృష్ణ కోపంగా ఆదర్శ్ అని చెయ్యి ఎత్తుతుంది. చెంప పగిలిపోతుంది ఏమనుకున్నావో ఏం తప్పు చేశాడని నా ఏసీపీ సర్ కి ఆ గతి పట్టాలని కోరుకుంటున్నావని అంటుంది.
కృష్ణని క్షమించమని అడిగిన ఆదర్శ్
తప్పు కాదు పాపం చేశాడు. వాడు చేసిన పాపాలకు తగిన శిక్ష పడింది. వాడి జీవితం జైలులో అంతం కావాల్సిందే మర్చిపో అంటాడు. షటప్ ఆదర్శ్ ఇంకొక మాట మాట్లాడితే ప్రాణాలు తీసేస్తాను. ఆయన్ని ఎవరైనా అర్థం చేసుకోకపోవచ్చు కానీ నువ్వు అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరి కన్నా మురారి గురించి నీకే బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు నువ్వు అలా మాట్లాడకూడదని ఏడుస్తూ అంటుంది.
ఇప్పటి వరకు కృష్ణని అనుమానించావు ఇప్పుడు మురారిణి అనుమానిస్తున్నావని రేవతి తిడుతుంది. చేతనైతే విడిపించు లేదంటే మమ్మల్ని వదిలేయమని అంటుంది. సారీ కృష్ణ ఈ సారీ మురారి జైలులో చావాలని అన్నందుకు కాదు ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు. నీ స్వార్థం కోసం ముకుంద అడ్డు తప్పించుకోవాలని నువ్వే చేశావని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ అసలు తప్పు మురారి చేశాడని నాకు ఇప్పుడే అర్థం అయ్యిందని అంటాడు.
మురారిని అపార్థం చేసుకున్న ఆదర్శ్
మురారి అన్నయ్య ఏ తప్పు చేయలేదని నందిని అంటే చేశాడని ఆదర్శ్ కోపంగా గట్టిగా అరుస్తాడు. ముకుంద మరణ వాంగ్మూలం చదివిన తర్వాత కూడా వాడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు. తన విషయంలో జరిగింది ఒకటి అయితే నేను అనుకున్నది ఒకటి. ముకుందని నేను ప్రేమించానని తెలుసుకుని మురారి తన ప్రేమని త్యాగం చేశాడని అనుకున్నాను. కానీ ప్రేమించి మోసం చేసి మోజు తీరిపోయాక నాతో పెళ్లి చేశాడు. అంతటితో ఆగకుండా కృష్ణని అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఏంటని అడిగితే నామీద ప్రేమ ఉన్నట్టు నన్ను తీసుకొచ్చాడు. అప్పటికి ముకుంద మనసు మార్చుకుని కాపురం చేయడానికి సిద్ధపడింది అప్పుడు మళ్ళీ మా జీవితాలతో ఆడుకున్నాడు. ముకుంద చావుకి కారణం అయ్యాడు. అలాంటి వాడికి ఉరిశిక్ష కూడా తక్కువే అంటాడు.
ఆపు ఆదర్శ్ ప్లీజ్ నువ్వు చెప్పినవన్నీ నిజాలు కాదని కృష్ణ అంటుంది. అంటే ముకుంద చెప్పింది అబద్ధమా అంటే అబద్ధమేనని మధు చెప్తాడు. కానీ ఆదర్శ్ మాత్రం ముకుంద చెప్పింది నిజమేనని నమ్ముతాడు. ఏసీపీ సర్ అలాంటి వాళ్ళు కాదు ఇది హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళిందని అంటే ఇందులో ఏదో కుట్ర ఉందని అంటుంది. నువ్వే అర్థం చేసుకో లేదంటే ముకుందకి పట్టిన గతే నీకు పడుతుందని ఆదర్శ్ అంటాడు. మురారిని మనమే విడిపించుకుందామని ఎవరి సహాయం అవసరం లేదని కృష్ణ కోపంగా చెప్తుంది. అందరూ ఆదర్శ్ వైపు కోపంగా చూస్తారు. మురారి ఏం తినలేదని చెప్పి కృష్ణ క్యారేజ్ పట్టుకుని స్టేషన్ కి వస్తుంది. సెల్ లో మురారి లేకపోవడం చూసి కృష్ణ కంగారుగా మురారి ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది.
మురారి మిస్సింగ్
ఎస్సై వచ్చి ఎవరు ఏం కావాలని అంటాడు. మురారి ఎక్కడని అంటే ఎస్సై తెలియదని చెప్తాడు. మీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా తెలియదని అంటారు ఏంటని కంగారుగా అడుగుతుంది. విచారణ కోసం పై అధికారులు వేరే స్టేషన్ కి తీసుకెళ్లారని చెప్తాడు. ఏసీపీ సర్ ని ఎక్కడ ఉంచారో చెప్పమని కృష్ణ ఏడుస్తూ అడుగుతుంది. అసలు ఏం చేయాలని అనుకుంటున్నారు ఎక్కడ ఉన్నారో చెప్పే వరకు కదలనని అంటే య్ ఎస్సై కృష్ణని బలవంతంగా బయటకి పంపించేస్తాడు. కృష్ణ కానిస్టేబుల్ ని బతిమలాడుతుంది. నిజంగా నాకు తెలియదు తెలిసినా ఎవరు చెప్పరు ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తుంది.
చుట్టుపక్కల ఏదో ఒక స్టేషన్ కి తీసుకెళ్ళి ఉంటారని వెళ్ళి వెతకమని లేడీ కానిస్టేబుల్ చెప్పేసరికి కృష్ణ ఏడుస్తూ వెళ్తుంది. మురారిని కట్టేసి పోలీసులు దారుణంగా కొడతారు. అటు కృష్ణ మురారి కోసం అన్నీ పోలీస్ స్టేషన్లకు తిరుగుతుంది. కానీ ఎక్కడ తన ఆచూకీ తెలియదు. మురారి ఉన్న స్టేషన్ కి వచ్చి అక్కడ కానిస్టేబుల్ తో మాట్లాడుతుంది కానీ మురారిని చూడకుండానే వెళ్ళిపోతుంది. దెబ్బలకు తట్టుకోలేక మురారి స్పృహ కోల్పోతాడు. ముకుంద ఇంత పని చేస్తుందంటే నమ్మలేకపోతున్నానని రేవతి అంటుంది. అది ముకుంద రాసి ఉండదు అది శ్రీనివాస్ రాసి ఉంటాడని డౌట్ పడతారు. మనం ఇదే విషయాన్ని రుజువు చేస్తే బయటకి తీసుకురావచ్చని అంటాడు.
మురారి జీవితం జైలులోనే ముగిసిపోతుంది
కృష్ణ డల్ గా ఇంటికి వస్తుంది. మురారిని కలిశావా అని రేవతి అడుగుతుంది. ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నారో తెలియలేదని కృష్ణ ఏడుస్తూ చెప్తుంది. విచారణకి వేరే స్టేషన్ కి తీసుకెళ్లారని చెప్తున్నారని అన్ని స్టేషన్లు తిరిగాను కానీ ఎక్కడ ఆయన ఆచూకీ తెలియలేదని ఏం జరుగుతుందోనని భయంగా ఉందని కృష్ణ ఏడుస్తుంది. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది పొద్దున చెప్పాను కదా మురారి జీవితం జైలులోనే ముగిసిపోతుంది. పొద్దున నువ్వు చూసిందే ఆఖరి చూపు ఇక మురారి నీకు కనిపించడని ఆదర్శ్ అంటాడు.
నీకు దణ్ణం పెడతాను ఆపు అని కృష్ణ వేడుకుంటుంది. అర్హత లేనివాడి కోసం నువ్వు ప్రయత్నించడం అనవసరమని అంటాడు. రేవతి ఆదర్శ్ మీద సీరియస్ అవుతుంది. అక్కకి ఫోన్ చేసి అంతా చెప్పాను హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారని రేవతి అంటుంది. అనవసరంగా ఎక్కడో ఉన్న ఆదర్శ్ ని వెతికి తీసుకొచ్చాను తనని తీసుకురాకపోతే ఇలా జరిగి ఉండేది కాదు మొత్తం నేనే చేశానని కృష్ణ తనని తాను నిందించుకుంటుంది. భర్త కోసం కుమిలికుమిలి ఏడుస్తుంది.