Krishna mukunda murari march 25th: మీరాగా మారిన ముకుంద.. మురారి లాకప్ డెత్ కావాలని కోరుకున్న ఆదర్శ్-krishna mukunda murari serial march 25th episode mukunda introduces herself to murari as meera ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari Serial March 25th Episode Mukunda Introduces Herself To Murari As Meera

Krishna mukunda murari march 25th: మీరాగా మారిన ముకుంద.. మురారి లాకప్ డెత్ కావాలని కోరుకున్న ఆదర్శ్

Gunti Soundarya HT Telugu
Mar 25, 2024 07:38 AM IST

Krishna mukunda murari serial march 25th episode: ముకుంద వచ్చి మురారిని విడిపించుకుంటుంది. ముకుంద ఫ్రెండ్ మీరాగా తనని పరిచయం చేసుకుంటుంది. ఇంటికి వచ్చిన మురారిని చూసి కృష్ణ వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 25వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 25వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 25th episode: కృష్ణని అరెస్ట్ చేయించమని చెప్తే నాన్న నిన్ను అరెస్ట్ చేయించాడు. నాన్నకి నీ మీద ఇంత కోపం ఉందని తెలియదు తప్పంతా నాదేనని చెంపలు వాయించుకుంటుంది. నీకు దగ్గర కావాలని ఏదో చేయాలని అనుకుంటే ఏదో జరిగింది. ఏంటి మురారి నన్ను అలా చూస్తున్నావ్ నేను ముకుందని అనేసరికి మురారి షాక్ అవుతాడు. నువ్వు ముకుంద ఏంటి తను చనిపోయింది కదా ఎవరు నువ్వు? ముకుందనని ఎందుకు చెప్తున్నావని అడుగుతాడు. అదంతా ముకుంద ఊహ. కానిస్టేబుల్ పిలిచే సరికి ఊహలో నుంచి బయటకి వస్తుంది. అతన్ని రిలీజ్ చేయమని అడుగుతుంది.

ముకుంద అలియాస్ మీరా 

నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేశామని ఎస్సై వచ్చి చెప్తాడు. ముకుంద హోమ్ మినిస్టర్ కి ఫోన్ ఎస్సైతో మాట్లాడిస్తుంది. వెంటనే పోలీసులు మురారిని రిలీజ్ చేస్తారు. నడవలేక ఇబ్బంది పడుతున్న మురారిని చూసి ముకుంద చాలా బాధపడుతుంది. మురారికి సారి చెప్తుంది. మీరు రాకపోయి ఉంటే బయటకి వచ్చి ఉండే వాడిని కాదు అలాంటిది మీరు సారి చెప్తున్నారని మురారి అంటాడు. రావడం అలస్యమైనందుకు సారి అంటుంది. నేను పోలీస్ ఆఫీసర్ ని నన్ను నేను కాపాడుకోలేకపోయారు. ఇంట్లో వాళ్ళు విడిపించడానికి ట్రై చేసి ఉంటారు. వాళ్ళ వల్ల కూడా కాలేదు మీరు ఎలా విడిపించారు ఇంతకీ మీరు ఎవరు అంటే ముకుంద అంటుంది.

ముకుంద ఫ్రెండ్ మీరాని, హోమ్ మినిస్టర్ కూతురు ఫ్రెండ్ ని కూడా కవర్ చేస్తుంది. ముకుంద వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్ ఫ్రెండ్ మీరు చెప్తే ఎలా రిలీజ్ చేశారని మురారి అనుమానంగా అడుగుతాడు. ముకుంద, నేను, మృదుల ఫ్రెండ్స్, కూతురు మాట కాదనలేక విడిపించారని చెప్పి కవర్ చేస్తుంది. హెల్ప్ చేసినందుకు మురారి ముకుందకి థాంక్స్ చెప్తాడు. ముకుంద చనిపోయే ముందు నాకు కాల్ చేసింది మురారి లేకుండా నేను బతకలేను అందుకే వెళ్లిపోతున్నానని చెప్పింది. నీమీద ముకుందకు ఎప్పుడు కోపం లేదు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుందని చెప్తుంది. తనతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఏం తెలియనట్టు మురారి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది.

ఇంటికి వచ్చిన మురారి 

కృష్ణ ఇంట్లో కూర్చుని భయపడుతుంది. పెద్దత్తయ్య వచ్చే లోపు ఏం చేయలేమా అని ఏడుస్తుంది. కానిస్టేబుల్ చెప్పిన మాటలు గుర్తు వస్తున్నాయి, అత్తయ్య వచ్చే లోపు జరగరానిది ఏదైనా జరిగితే ఏంటని గుక్కపట్టి ఏడుస్తుంది. ఆదర్శ్ మాత్రం మురారి తప్పు చేశాడని తనని విడిపించి తీసుకురావడం ఎవరి వల్ల కాదని మనసులో అనుకుంటాడు. అప్పుడే కానిస్టేబుల్స్ ఇంటికి వస్తారు. కృష్ణ వాళ్ళు కంగారుగా ఏమైందని ఏడుస్తూ అడుగుతుంది. అక్కడ మురారిణి చూసి అందరూ తన దగ్గరకి వెళతారు. ఒంటి నిండా దెబ్బలతో ఉన్న మురారిని చూసి ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు.

ఏసీపీ సర్ ఇంటికి తిరిగి వచ్చారన్న, ఆయన్ని మీరు చూస్తున్నారంటే దానికి కారణం ఒకావిడ. ముకుంద ఫ్రెండ్ అంట తను వచ్చి విడిపించిందని కానిస్టేబుల్ చెప్తాడు. కృష్ణ అది నిజమేనా అని మురారిని అడిగితే నిజమేనని అంటాడు. నువ్వు అసలు బయటకి రావని అనుకున్నాను బయటకి వచ్చేశావ్ లక్కీ ఫెలో. ఎవరు విడిపించారు ముకుంద ఫ్రెండ్ నా చాలా ఆశ్చర్యంగా ఉందే. నువ్వే తనని మోసం చేశావని క్లియర్ గా సూసైడ్ నోట్ రాసి చనిపోయింది కదా. ఈ విషయం తన ఫ్రెండ్ కి కూడా తెలిసే ఉంటుందే అయినా నిన్ను ఎలా విడిపించిందని ఆదర్శ్ అడుగుతాడు. తన స్నేహితురాలు చావుకు కారణమైన వాడిని కాపాడింది అంటే తను స్నేహితురాలు ఎలా అవుతుంది ద్రోహి అవుతుంది.

కొడుకును చూసి తల్లడిల్లిపోయిన రేవతి 

అలాంటి ద్రోహులను నడిరోడ్డు నిలబెట్టి ప్రాణాలు తీసేయాలని అంటాడు. నోర్ముయ్ ఇంకొక్క మాట ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడొద్దని మురారి సీరియస్ గా చెప్తాడు. తనతో మాటలు అనవసరమని కృష్ణ అంటుంది. ముకుంద ఫ్రెండ్ అయి ఉండి కూడా సూసైడ్ నోట్ నిజం కాదని నమ్మి నన్ను విడిపించింది. కానీ నువ్వు నాతో చిన్నప్పటి నుంచి కలిసి ఉండి నేనెంటో తెలిసి కూడా నన్ను నమ్మలేకపోతున్నావ్. ఆవిడ గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదని అంటాడు. నిన్ను కాపాడిన అమ్మాయి కాటేసిన విషపు నాగు నువ్వేనని తెలుసుకుంటుందని ఆదర్శ్ అంటాడు. ఇంట్లో అందరూ ఆదర్శ్ ని తలా ఒక మాట తిడతారు.

కొడుకు పరిస్థితి చూసి రేవతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. శరీరం మొత్తం గాయాలు ఉన్నాయని కృష్ణ కూడా ఏడుస్తుంది. ఆ లెటర్ ముకుంద రాసి ఉండదు తనే రాసి నిన్ను అరెస్ట్ చేయించాడని రేవతి అంటుంది. ఆదర్శ్ నా ఫ్రెండ్ వాడే నా గురించి తెలిసిన వాడు నన్ను అర్థం చేసుకోలేదు. నా తప్పేమీ లేకపోయినా నేను దక్కలేదనే కదా ఆత్మహత్య చేసుకుంది. అలాంటప్పుడు శ్రీనివాస్ అంకుల్ తప్పుగా అర్థం చేసుకోవడంలో ఆశ్చర్యం ఏముందని అంటాడు. మానసికంగా, శారీరకంగా అలిసిపోయాను తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. చాలా ఆకలేస్తుందని మురారి అనేసరికి కడుపు మెలిపెట్టేస్తుంది. రేవతి కొడుక్కి అన్నం తినిపిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భవానీ ఎంట్రీ ఇస్తుంది. తనతో పాటు ముకుంద ఇంట్లోకి అడుగుపెడుతుంది. 

K

IPL_Entry_Point