Krishna mukunda murari march 26th: ఆదర్శ్ చెంప చెల్లుమనిపించిన భవానీ.. కృష్ణ ప్రేమ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న మురారి
Krishna mukunda murari serial march 26th episode: ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే మధు అడ్డుపడతాడు. దీంతో ఆదర్శ్ తనని ఘోరంగా అవమానిస్తాడు. అదంతా విన్న భవానీ కొడుకు చెంప చెల్లుమనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial march 26th episode: ఈ ఒక్కరాత్రి గడిచి ఉంటే మురారి లాకప్ డెత్ అయి ఉండే వాడు నా కూతురు మళ్ళీ ఈ పాట్లు పడే అవసరం ఉందని అనుకుంటాడు. అప్పుడే ముకుంద వస్తుంది. మురారిని విడిపించి తప్పు చేశావ్ ముకుంద అని అంటాడు. తప్పు చేసింది నువ్వు నాన్న నీకు అసలు మనసు ఉందా? మురారిని అంత దారుణంగా కొట్టిస్తావా?అని నిలదీస్తుంది. ఈ ఒక్కరాత్రి నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే మురారి కన్ను మూసేవాడని శ్రీనివాస్ అంటాడు. ఆపు నాన్న ఇంకొక మాట మాట్లాడితే కన్నతండ్రివి అని కూడా చూడనని సీరియస్ అవుతుంది. నా కూతురు జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఉంటానని శ్రీనివాస్ బదులిస్తాడు.
తండ్రిని వెళ్లిపొమ్మన్న ముకుంద
మురారి నా జీవితం నాశనం చేశాడని నేను చెప్పానా? నా విషయంలో మురారి ఎప్పుడూ క్లియర్ గా ఉన్నాడు. నేనే మురారిని వదలకుండా ఉన్నాను. అది అర్థం చేసుకోకుండా నా మురారి ప్రాణాలు తీస్తావా? నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో నేను మురారి దగ్గరకి వెళ్లిపోతాను తనని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇంటిని అమ్మేసి డబ్బు తీసుకుని వెళ్లిపొమ్మని అంటుంది. నువ్వు ఇక్కడే ఉంటే నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఎక్కడ నాకు అడ్డు పడతావోనని భయంగా ఉందని చెప్తుంది. అసలు నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుందని అనుకుంటున్నావ్. మురారి ప్రేమించిన రూపం ఉన్నప్పుడే మురారి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలా పట్టించుకుంటాడని అడుగుతాడు.
ఎలాగైనా నా మురారిని నా సొంతం చేసుకుంటాను. నిన్ను పంపించడం వెనుక నీ క్షేమం కూడా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను చంపేయాలని కోపంతో ఉన్నారు అది జరగక ముందే వెళ్లిపొమ్మని చెప్పేస్తుంది. మురారి నిద్రపోతుంటే కృష్ణ తనని చూస్తూ అలాగే కూర్చుని ఉంటుంది. మురారి నిద్రలేచి రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతాడు. మీకు ఏమవుతుందోనని భయంతో వణికిపోయాను. ఇక రారేమో అని అనుకుంటున్న టైమ్ లో మీరు వచ్చారు. కలా, నిజమా అన్నట్టు ఉంది. కళ్ళు మూస్తే అది ఎక్కడ కల అవుతుందోనని భయంతో రాత్రంతా మిమ్మల్ని చూస్తూనే ఉన్నానని అనడంతో మురారి కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
మధుని ఘోరంగా అవమానించిన ఆదర్శ్
నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నావని మురారి అంటాడు. మీరు నాకోసం బాధలు పడలేదా? ముకుంద మీద ఉన్న ప్రేమకి నా చెయ్యి వదిలేసి తన చెయ్యి పట్టుకునే వాళ్ళు కదా. కానీ అలా చేయలేదు ఎంత ఎక్కువ బాధలు పడితే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టని కృష్ణ చెప్తుంది. రేవతి వచ్చి కొడుకు, కోడలిని చూసి మురిసిపోతుంది. ఆదర్శ్ బ్యాగ్ పట్టుకుని కిందకి వస్తాడు. నందిని తనని ఆపి ఎక్కడకి వెళ్తున్నావని అడుగుతుంది. వెళ్లిపోతున్నానని చెప్తాడు. ఒకప్పుడు ముకుంద మనసులో చోటు లేదని వెళ్లిపోయాను ఇప్పుడు ఈ ఇంట్లోనే చోటు లేదని అర్థం అయ్యింది అందుకే వెళ్లిపోతున్నానని అంటాడు.
ఇన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చింది వెళ్లిపోడానికా అంటుంది. ఇక్కడికి వచ్చి తప్పు చేశాను పొందిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువని అంటాడు. మధు వచ్చి సీరియస్ గా లోపలికి వెళ్ళమని చెప్తాడు. నన్ను ఎవరు అపొద్దని అంటాడు. పెద్ద పెద్దమ్మ వచ్చే వరకు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడానికి వీల్లేదని మధు ఆదర్శ్ ని అడ్డుకుంటాడు. ఎక్కడ మందు వాసన వస్తే అక్కడికి వెళ్ళి బెగ్గర్ లా మందు అడుక్కునే వాడివి నువ్వు ఎవడివి నన్ను అడగడానికని అవమానిస్తాడు.
ఆదర్శ్ చెంప పగలగొట్టిన భవానీ
ఆదర్శ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నా కొడుక్కి నీలా సంపాదన లేకపోయి ఉండవచ్చు కానీ నీలా సంస్కారం లేని వాడు కాదు. వాడికోక లక్ష్యం ఉంది దానికోసం ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అన్నయ్యవని అభిమానంతో మళ్ళీ ఎక్కడ దూరం అవుతావోనని ఆపుతున్నాడు. అంతే కానీ ఇక్కడే ఉంటే రోజుకొక గ్లాసు మందు పోస్తావని కాదు. నా కొడుక్కి ఈ ఇంటి మీద ఉన్న ప్రేమలో కొంచెమైన నీకు ఉందా? ఉంటే ఇలా ప్రవర్తించవు. చీటికి మాటికి ఇల్లు వదిలి వెళ్లిపోతానని బయల్దేరావని సుమలత తిడుతుంది.
నాకు ఇంట్లో ఎవరి మీద ప్రేమ లేదు అయినా నిన్ను వీడిని చూసి నేర్చుకోవాలని ఆవేశంగా వెళ్తుంటే భవానీ వచ్చి లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. ఏంటి వాగుతున్నావ్ చంపేస్తాను. ఎక్కడికి బయల్దేరావ్ బ్యాగ్ పట్టుకుని. లోపలికి వెళ్ళి తలస్నానం చేసిరా నీ అవతారం చూడలేకపోతున్నానని తిడుతుంది. ఆదర్శ్ అమ్మా అని తనని పట్టుకుని ఏడుస్తాడు. మురారి ఎలా ఉన్నాడని రేవతిని అడుగుతుంది. పోలీసుల చేతిలో దెబ్బలు తింటాడని కలలో కూడా ఊహించలేదని రేవతి బాధగా చెప్తుంది. ఇంట్లోనే ఉన్నా ఎప్పుడు ఇంటి మనిషిలా లేదు ఇప్పుడు అసలే లేదని భవానీ ముకుంద ఫోటో చూస్తూ అంటుంది.
మురారికి అండగా నిలిచిన భవానీ
పాపం ముకుంద అమ్మా అన్యాయంగా అంటాడు. ఎవరికి అన్యాయం జరిగిందో అసలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. మనవి చూసేవి విన్నవి నిజాలు అనుకుంటే పొరపాటు. ఒక్కోసారి అంతకుమించి లోతుగా ఆలోచించాలి. నీకు అర్థం అయ్యే సమయం వస్తుందని అంటుంది. మధు, కృష్ణ మురారిని పట్టుకుని కిందకి తీసుకొస్తారు. తనని చూసి భవానీ ఎమోషనల్ అవుతుంది. ఆదర్శ్ మాత్రం కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. చేయని తప్పుకి నిందలు శిక్షలు అనుభవించాల్సి వస్తుందని కృష్ణ బాధగా అంటుంది.
నేను ఏ తప్పు చేయలేదు పెద్దమ్మ ముకుంద అలా ఎందుకు రాసిందోనని అంటుంటే భవానీ మురారిని సపోర్ట్ చేస్తుంది. నా బిడ్డ ఎలాంటి వాడో నాకు తెలుసు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటానని చెప్తుంది. సమయానికి మీరా వచ్చి కాపాడింది లేదంటే ఏసీపీ సర్ మనకి దక్కి ఉండే వాళ్ళు కాదని కృష్ణ చెప్తుంది. ఎవరు ఆ అమ్మాయి తనని కలవాలని భవానీ అంటుంది. మురారిని బతికించిన దేవత మీరా అని భవానీ పొగుడుతుంది.
టాపిక్