తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 23rd Episode Krishna Convey His Love On Murari

Krishna Mukunda Murari May 23rd Episode: కృష్ణ‌కు ఊహించ‌ని షాక్ ఇవ్వ‌నున్న ముకుంద? - రేవ‌తి వార్నింగ్

HT Telugu Desk HT Telugu

23 May 2023, 9:18 IST

  • Krishna Mukunda Murari May 23rd Episode: మురారి ప‌ట్ల త‌న మ‌న‌సులో దాగి ఉన్న ప్రేమ‌ను అత‌డికి చెప్ప‌డానికి కృష్ణ సిద్ధ‌మవుతుంది. ఆమెకు ముకుంద ఊహించ‌ని షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari: ముకుంద త‌న జీవితం నుంచి వెళ్లిపోవాలంటే ఆమె మ‌న‌సులో ద్వేషాన్ని నింప‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని మురారి డిసైడ్ అవుతాడు. ముకుంద త‌న‌ను అస‌హ్యించుకునేలా చేస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంద‌ని అనుకుంటాడు. కృష్ణ‌తో తాను ప్రేమ‌గా ఉంటే ముకుంద మ‌న‌సు మారిపోతుంద‌ని డిసైడ్ అవుతాడు మురారి.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

కృష్ణ‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఆపితే త‌న ప్రేమ గెల‌వ‌డంతో పాటు ముకుంద అడ్డు తొల‌గిపోతుంద‌ని ఫిక్స్ అయిన‌ట్లుగా నేటి ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గురువుకు ఇచ్చిన మాట నెర‌వేరుతుంద‌ని మురారి భావిస్తోన్న‌ట్లుగా తెలుస్తోంది.

ముకుంద కొత్త ప్లాన్‌

మురారిని క‌న్వీన్స్ చేసి త‌న‌తో పెళ్లికి తండ్రి ఒప్పించాడ‌ని సంతోషంగా ఉంటుంది ముకుంద‌. తండ్రి స‌మాధానం కోసం ఎదురుచూస్తుంటుంది. కానీ శ్రీనివాస్ నుంచి ఊహించ‌ని ఆన్స‌ర్‌ ఆమెకు వ‌స్తుంది. దాంతో తానే మురారిని పెళ్లికి ఒప్పించ‌డానికి ముకుంద కొత్త ప్లాన్ వేసిన‌ట్లుగా నేటి ఎపిసోడ్‌లో క‌నిపిస్తోంది. ఆమె వేసిన ఎత్తును మురారి ఎలా ఎదుర్కొంటాడ‌న్న‌ది చూడాల్సిందే.

మురారితో పూర్తిగా ప్రేమ‌లో మునిగిపోతుంది కృష్ణ‌. అనుక్ష‌ణం అత‌డి ఊసులు, ఊహ‌ల‌తో తేలిపోతుంటుంది. మురారి ప‌ట్ల త‌న మ‌న‌సులో దాగి ఉన్న ప్రేమ‌ను అత‌డిని చెప్పాల‌ని అనుకుంటుంది. కానీ ఆమెకు ముకుంద ఊహించ‌ని షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.అదేమిట‌న్న‌ది కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో చూడాల్సిందే.

భ‌వానీ ఆశ్ర‌మానికి వెళ్ల‌డంతో ఇంట్లో అంద‌రికీ పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ప్ర‌సాద్‌, మ‌ధుక‌ర్ మందులో మునిగితేలుతుంటారు. వారిఎంజాయ్‌మెంట్ గురించి భ‌వానీతో చెబుతాన‌ని రేవ‌తి ప్ర‌సాద్‌, మ‌ధుక‌ర్‌ల‌కు వార్నింగ్ ఇవ్వ‌నుందా? లేదా? అన్న‌ది నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్‌లో తేల‌నుంది..

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.