Krishna Mukunda Murari May 22nd Episode: ముకుందను పెళ్లిచేసుకోనని తేల్చిచెప్పిన మురారి - ప్రేమ మైకంలో కృష్ణ‌-krishna mukunda murari may 22nd episode murari gives clarity on marriage with mukunda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 22nd Episode Murari Gives Clarity On Marriage With Mukunda

Krishna Mukunda Murari May 22nd Episode: ముకుందను పెళ్లిచేసుకోనని తేల్చిచెప్పిన మురారి - ప్రేమ మైకంలో కృష్ణ‌

HT Telugu Desk HT Telugu
May 22, 2023 09:43 AM IST

Krishna Mukunda Murari May 22nd Episode: ముకుందతో పెళ్లికి మురారిని ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు శ్రీనివాస్‌. మురారిని మాట‌ల‌తో రెచ్చ‌గొడ‌తాడు. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 22nd Episode: కృష్ణ‌తో మురారి క్లోజ్‌గా ఉండ‌టాన్ని ముకుంద స‌హించ‌లేక‌పోతుంది. క‌ళ్లెదురుగా ప్రేమించిన వాడు భార్య‌తో ఉంటే చూస్తూ ఈ ఇంట్లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని తండ్రితో త‌న బాధ‌ను చెప్పుకుంటుంది. కానీ తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతే మురారి త‌న‌కు ద‌క్క‌కుండా పోతాడ‌నే భ‌య‌ప‌డుతుంది.

కృష్ణ వెళ్లిపోగానే మురారి త‌న‌ను పెళ్లి చేసుకునేలా ఒప్పించ‌మ‌ని తండ్రిని కోరుతుంది. కూతురు మాట‌లకు శ్రీనివాస్ అడ్డుచెబుతాడు. ఒక‌వేళ నువ్వు ఈ ప‌ని చేయ‌క‌పోతే జీవితాంతం తాను ఒంట‌రిగానే బ‌తికాల్సివ‌స్తుంద‌ని, అలా న‌న్ను చూడాల‌ని అనుకుంటే మాట్లాడ‌వ‌ద్ద‌ని అంటుంది. ముకుంద బాధ‌ను చూడ‌లేక మురారితో మాట్లాడాల‌ని శ్రీనివాస్ ఫిక్స్ అవుతాడు.

మురారిపై శ్రీనివాస్ సీరియ‌స్‌...

కూతురి కోరిక మేర‌కు మురారితో మాట్లాడ‌టానికి అత‌డి ఆఫీస్‌కు వెళ‌తాడు శ్రీనివాస్‌. కానీ అక్క‌డ మురారి, కృష్ణ అన్యోన్యంగా ఉంటూ అత‌డి కంట ప‌డ‌తారు. వారిద్ద‌రి అనుబంధాన్ని చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. కృష్ణ వెళ్లిపోతానే మురారి వ‌ద్ద‌కు వ‌స్తాడు. మీ ఇద్ద‌రిది స్నేహ‌మా, ప్రేమా...భార్యాభ‌ర్త‌ల బంధ‌మా...మీ మ‌ధ్య ఏముంద‌ని మురారిని అడుగుతాడు.

శ్రీనివాస్‌ను అక్క‌డ చూసి మురారి ఆశ్చ‌ర్య‌పోతాడు. కృష్ణ‌తో నీ అగ్రిమెంట్ మ్యారేజీ గురించి ముకుంద త‌న‌కు చెప్పింద‌ని గుర్తుచేస్తాడు.మీ అగ్రిమెంట్ పూర్త‌యిపోతే నిన్ను పెళ్లిచేసుకోవాల‌ని ముకుంద ఎదురుచూస్తోంద‌ని అంటాడు. కానీ నువ్వేమో నాలుగు రోజుల్లో వెళ్లిపోయే అమ్మాయితో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయావ‌ని మురారిని మాట‌ల‌తో రెచ్చ‌గొడ‌తాడు శ్రీనివాస్‌

శ్రీనివాస్‌కు మురారి క్లాస్…

శ్రీనివాస్ మాట‌ల‌తో మురారిలో కోపం పెరుగుతుంది. మీరు మాట్లాడే దానిలో అర్థం లేద‌ని అత‌డిపై సీరియ‌స్ అవుతాడు. నేను వ‌చ్చేవ‌ర‌కు ఎదురుచూడ‌కుండా ముకుంద‌ను ఇంకొక‌రికి ఇచ్చి పెళ్లి చేసింది మీరే అంటూ శ్రీనివాస్‌పై ఫైర్ అవుతాడు. మంచి సంబంధం అని ఆద‌ర్శ్‌తో ముకుంద పెళ్లిని ఫిక్స్ చేశార‌ని, ఈ త‌ప్పులో త‌న‌ను దోషిగా తేల్చేశార‌ని అంటాడు.

కృష్ణ‌తో నేను విడిపోతే ..ముకుంద‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ఎలా అనుకుంటున్నార‌ని శ్రీనివాస్ మాట‌ల‌కు అడ్డుచెబుతాడు. ఈ విష‌యంలో త‌న‌ను నిల‌దీయ‌డం బాగాలేద‌ని మురారి కోప‌గించుకుంటాడు. నా కూతురు భ‌విష్య‌త్తు ఏం కావాల‌ని అడిగితే...అది మీరు ఆలోచించుకోవాల‌ని శ్రీనివాస్‌తో అంటాడు మురారి.

ముకుంద‌ను పెళ్లిచేసుకోన‌ని తేల్చిన మురారి...

ముకుంద మెడ‌లో ఆద‌ర్శ్ తాళిక‌ట్టాడు...ప‌రాయి వాడి భార్య‌ను నేను ఎలా పెళ్లి చేసుకోగ‌ల‌న‌ని శ్రీనివాస్‌తో చెబుతాడు మురారి. ముకుంద రోజు త‌న‌ను టార్చ‌ర్ పెడుతోంద‌ని, ఇంట్లో వాళ్ల‌కు ఆమె గురించి తెలిస్తే అస‌హ్యించుకుంటార‌ని ముకుంద టార్చ‌ర్‌ను భ‌రిస్తున్న‌ట్లు చెబుతాడు.

త‌న వ‌ల్లే కృష్ణ తండ్రి చ‌నిపోయాడ‌ని, ఆమెకు తాను త‌ప్ప ఎవ‌రూ లేర‌ని, ఆమెను వ‌దిలిపెట్టి ఒంట‌రిదానిని చేయ‌లేన‌ని అంటాడు. కృష్ణ వెళ్లిపోతాన‌న్న తాను ఆమెను వెళ్ల‌నివ్వ‌న‌ని అంటాడు. అప్ప‌టివ‌ర‌కు మురారిపై సీరియ‌స్ అయిన శ్రీనివాస్ అత‌డి మాట‌ల‌తో క‌న్వీన్స్ అవుతాడు. ముకుంద మ‌నుసు విరిగేలా చేసి ఆమెను త‌న ఇంటికి పంపిచ‌మ‌ని మురారిని రిక్వెస్ట్ చేస్తాడు. అంత‌కు మించి ఇంకో దారి లేద‌ని చెప్పి శ్రీనివాస్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

ప్రేమ మైకంలో కృష్ణ…

మ‌రోవైపు హాస్పిట‌ల్‌లో డ్యూటీ చేస్తోన్న కృష్ణ పూర్తిగా మురారి ఆలోచ‌న‌ల్లో మునిగిపోతుంది. పేషెంట్స్ అంద‌రూ ఆమెకు మురారిలాగే ఆమెకు క‌నిపిస్తుంటారు. దాంతో డ్యూటీ చేయ‌డం క‌ష్టంగా మార‌డంతో త‌న రూమ్‌లోకి వెళ్లిపోతుంది. అక్క‌డికి కూడా మురారి వ‌చ్చిన‌ట్లుగా క‌ల‌గంటుంది.ఆ క‌ల నుంచి తేరుకొని సిగ్గుప‌డుతుంది. మురారిని గాఢంగా ప్రేమిస్తోన్న‌ట్లు అర్థం చేసుకుంటుంది.

ముకుంద త‌న‌తో చేసిన ఛాలెంజ్ తో పాటు శ్రీనివాస్ అన్న మాట‌ల‌ను గురించి ఆలోచిస్తూ మురారి కారులో ఇంటికి బ‌య‌లుదేరుతాడు. ముకుంద మ‌న‌సులో త‌న‌పై ద్వేషాన్ని క‌లిగించాలి, త‌న ప్రేమ‌ను పూర్తిగా మ‌ర్చిపోయేలా చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point