తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 2 | సలాం రాకీ భాయ్.. బాహుబలి 2ని మించిపోయిన కేజీఎఫ్‌ 2

KGF 2 | సలాం రాకీ భాయ్.. బాహుబలి 2ని మించిపోయిన కేజీఎఫ్‌ 2

HT Telugu Desk HT Telugu

29 May 2022, 16:11 IST

    • రాకీ భాయ్‌ దూకుడు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సినిమాలో తనది ఎంత పవర్‌ఫుల్‌ క్యారెక్టరో ఇండియన్‌ సినిమాపై కూడా అంతే పవర్‌ చూపిస్తున్నాడు.
కేజీఎఫ్2లో యశ్
కేజీఎఫ్2లో యశ్ (Twitter)

కేజీఎఫ్2లో యశ్

సలాం రాఖీభాయ్‌ అంటోంది ఇప్పుడు ఇండియన్‌ సినిమా. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 ఒక్కో రికార్డు బద్ధలు కొట్టుకుంటూ వెళ్తుంటే.. గత సినిమాలన్నీ అలా చూస్తుండిపోతున్నాయి. బాక్సాఫీస్‌పై ఇప్పటికే ఆ సినిమా దండయాత్ర కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసింది. తొలి పార్ట్ సక్సెస్‌ కావడంతో ఈ మూవీపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

అయితే ఆ ఫస్ట్‌ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.200 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఈ సెకండ్‌ ఛాప్టర్‌ మాత్రం అంతకు ఆరింతలు చేయడమే అసలైన రికార్డు. ఇక ఇప్పుడు రాజమౌళి అద్భుతం బాహుబలి 2 రికార్డును కూడా కేజీఎఫ్‌ 2 మించిపోయింది. అయితే అది కలెక్షన్ల పరంగా కాదు. ఇంకా దానికి ఈ మూవీ చాలా దూరంలోనే ఉంది.

టికెట్‌ బుకింగ్ పోర్టల్‌ అయిన బుక్‌మైషోలో ఈ తాజా రికార్డు నమోదు చేసింది కేజీఎఫ్‌ 2. ఇప్పటివరకూ ఈ పోర్టల్‌లో కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 టికెట్లు 1.71 కోట్లు అమ్ముడుపోవడం విశేషం. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు. ఈ విషయంలో బాహుబలి 2ని ఈ సినిమా మించిపోయింది. ఇన్ని టికెట్లు ఇదొక్క పోర్టల్‌ ద్వారానే అమ్ముడయ్యాయంటే మొత్తంగా ఈ సినిమా రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఎర్లీ యాక్సెస్‌ పేరుతో రూ.199 చెల్లించిన వారు మాత్రమే రెంట్ రూపంలో చూడొచ్చు. ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం ఇంకా తెలియలేదు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.