తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf-2 Collections Record | కేజీఎఫ్-2 అరుదైన రికార్డు.. కలెక్షన్ల సునామీ

KGF-2 Collections Record | కేజీఎఫ్-2 అరుదైన రికార్డు.. కలెక్షన్ల సునామీ

17 May 2022, 8:00 IST

    • కేజీఎఫ్ ఛాప్టర్-2 అరుదైన ఘనత సాధించింది. బాహుబలి-2, దంగల్ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
కేజీఎఫ్ ఛాప్టర్ 2
కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Yash Twitter)

కేజీఎఫ్ ఛాప్టర్ 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ నటించిన చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్-2. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా గత నెల 14న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. రూ.1200 కోట్ల మార్కును అధిగమించి దంగల్, బాహుబలి-2 తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

సినిమా విడుదలై నెల రోజులు దాటిన వసూళ్లు మాత్రం ఆగడం లేదు. 500, 1000 కోట్లను ధాటి తాజాగా రూ.1200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటి వరకు ఈ క్లబ్‌లో చేరిన సినిమా దంగల్, బాహుబలి-2 మాత్రమే. తాజాగా ఈ రెండింటి తర్వాత ఆ మార్కును అందుకున్న సినిమాగా కేజీఎఫ్ ఛాప్టర్-2 అవతరించింది.

కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా హిందీ బెల్టులో ఈ సినిమా విశేష ఆదారణ లభిస్తోంది. విడుదలై నెల రోజులు కావస్తున్నా.. కలెక్షన్ల వర్షం మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది.

అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్పుడే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1 అందుబాటులో ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనే ఈ ఛాప్టర్‌ 2 కూడా వచ్చేసింది. ఈ విషయాన్ని సోమవారం ప్రైమ్‌ వీడియోనే ట్విటర్‌ ద్వారా అనౌన్స్‌ చేసింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నంత మాత్రాన ఈ సినిమాను ఫ్రీగా చూసే ఛాన్స్‌ లేదు. ఎర్లీ యాక్సెస్‌ పేరుతో ఈ సినిమాను తీసుకొచ్చిన అమెజాన్‌.. రెంట్‌ మీద మాత్రమే అందిస్తోంది.

అంటే ఈ సినిమా చూడాలనుకునేవాళ్లు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి మూవీని రెంట్‌కు తీసుకుంటే అది 30 రోజుల వరకూ వేలిడిటీ ఉంటుంది. అయితే సినిమా చూడటం ప్రారంభిస్తే 48 గంటల్లోపే పూర్తి చేయాలి. కొన్నిరోజుల పాటు ఈ సినిమా పే పర్ వ్యూ బేస్ మీద నడిపించిన తర్వాత అందరి స‌బ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. అయితే ఇది ఎప్పుడనేది మాత్రం తెలియాల్సి ఉంది.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం