తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /   Keeravani Father On Naatu Naatu: నాటు నాటు పాటపై కీరవాణి తండ్రి షాకింగ్ కామెంట్స్.. అస్సలు నచ్చలేదని స్పష్టం

Keeravani father on Naatu Naatu: నాటు నాటు పాటపై కీరవాణి తండ్రి షాకింగ్ కామెంట్స్.. అస్సలు నచ్చలేదని స్పష్టం

19 March 2023, 14:59 IST

    • Keeravani father on Naatu Naatu: ఎంఎం కీరవాణి తండ్రి, ప్రముఖ రచయిత శివ శక్తి దత్త నాటు నాటు పాటపై సంచలన కామెంట్లు చేశారు. తన కుమారుడు స్వరపరిచిన ఈ సాంగ్‌కు తనకు అస్సలు నచ్చలేదని వ్యాఖ్యలు చేశారు.
కీరవాణి-చంద్రబోస్
కీరవాణి-చంద్రబోస్ (RRR Movie )

కీరవాణి-చంద్రబోస్

Keeravani father on Naatu Naatu: తెలుగువాళ్లే కాదు యావత్ భారతీయులంతా గర్వపడే రీతిలో ఆస్కార్ దక్కించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన స్వరపరిచిన నాటు నాటు పాటకు అకాడమీ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణితో పాటు ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ కూడా ఆస్కార్ అందుకున్నారు. వీరి విజయాన్ని దేశమొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఫలితంగా కీరవాణి, దర్శకుడు రాజమౌళి వరల్డ్‌లో టాప్‌గా నిలిచారు. కీరవాణి తండ్రి ప్రముఖ రచయిత శివ శక్తి దత్త కూడా కుమారుడి విజయాన్ని ఆనందిస్తున్నారు. కుమారుడి విజయానికి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు నాటు నాటు పాట అంతగా నచ్చలేదని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Brahmamudi May 7th Episode: తండ్రి త‌ప్పుకు రాజ్‌కు శిక్ష‌- దుగ్గిరాల ఇంటికి కావ్య దూరం - రాజ్ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రంటే?

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ శక్తి దత్త కుమారుడి గురించి మాట్లాడుతూ.. "కీరవాణి తన హృదయం, ఆత్మ అని అన్నారు. అతడికి(కీరవాణి) మూడేళ్ల వయసులో సంగీతం నేర్చుకునేలా చేశాను. అతడి అద్భుతమైన ప్రతిభ చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. కానీ నాకు ఆర్ఆరఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ నచ్చలేదు. అది కూడా పాటేనా? అందులో సంగీతం ఎక్కడుంది? కానీ విధిని అనూహ్యమైంది. దాన్ని మనం ఊహించలేం. ఈ పాట కీరవాణి ప్రతిభకు గుర్తింపునిచ్చింది. చంద్రబోస్ రాసి 5 వేల పాటలకంట ఇది ఏ మాత్రం మెరుగైన సాంగ్ కాదు. కీరవాణి కెరీర్‌లో ఇది అత్యుత్తమ మ్యూజిక్ కాదు." అని శివ శక్తి దత్త తెలిపారు.

అయితే ఈ పాటకు కొరియోగ్రాఫ్ అందించిన ప్రేమ్ రక్షిత్‌ను మాత్రం శివ శక్తి దత్త అభినందించారు. "నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సాంగ్‌కు పూర్తిగా న్యాయం చేకూర్చారు. ఈ పాట ఇంత సక్సెస్ కావడానికి వీరి కష్టమే ప్రధాన పాత్ర పోషించింది." అని ఆయన అన్నారు.

ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ పురస్కారం సాధించింది. టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా నుంచి లేడీ గాగా ఆలపించిన హోల్ట్ మై హ్యాండ్, బ్లాక్ ఫ్యాంతర్ వకాండ ఫరెవర్ నుంచి రిహానా పాడిన్ లిఫ్ట్ మీ అప్ లాంటి పాపులర్ సాంగ్స్‌ను కూడా అధిగమించి నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది. పాట స్వరపరిచిన ఎంఎం కీరవాణి, రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.