తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? నెట్టింట బాలీవుడ్ బ్యూటీపై రూమర్స్..!

Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? నెట్టింట బాలీవుడ్ బ్యూటీపై రూమర్స్..!

23 April 2023, 20:38 IST

    • Katrina Kaif Pregnancy: బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇటీవల సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ నిర్వహించిన ఈద్ పార్టీకి హాజరైంది. అందంగా ముస్తాబైన కత్రినా.. కాస్త లావుగా కనిపించే సరికి నెటిజన్లు ఆమె ప్రెగ్నెంటా? అంటూ ప్రశ్నలు విసురుతున్నారు.
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

Katrina Kaif Pregnancy: బాలీవుడ్ కత్రినా కైఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో గ్లామర్ క్వీన్‌గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందంతో కుర్రకారు కలల రాకుమారిగా మారిన ఈ బ్యూటీ 2021 డిసెంబరులో వివాహం చేసుకుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్‌తో కొంతకాలం సీక్రెట్‌గా డేటింగ్ చేసిన కత్రినా అనంతరం పెళ్లిచేసుకున్నారు. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

ఇటీవల ఓ పార్టీకి హాజరైన కత్రినా కైఫ్‌ను చూసిన అభిమానులు కాస్త షాక్ తిన్నారు. కొంచెం బొద్దుగా కనిపించే సరికి కత్రినా తల్లికాబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లే ఇటీవల సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ ప్రముఖలు చాలా మంది హాజరయ్యారు. వీరిలో కత్రినా కైఫ్ కూడా ఉంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్‌ను ధరించిన కత్రినా చాలా అందంగా కనిపించింది. వివాహామైనప్పటికీ కుందనపు బొమ్మలా ఉన్న ఆమె పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయితే ఇదే సమయంలో కాస్త లావుగా ఉన్నట్లు కనిపించేసరికి నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె ప్రెగ్నెంట్‌లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కాస్త బరువు పెరిగింది అని ఓ యూజర్ తన స్పందనను తెలియజేయగా.. ఆమె చాలా అందంగా ఉందని, గర్భవతి అయి ఉండొచ్చంటూ మరొకరు పోస్ట్ పెట్టారు. అయితే ఈ కామెంట్లపై కత్రినా ఇంకా స్పందించలేదు.

కత్రినా కైఫ్ చివరగా సిద్ధాంత్ చతుర్వేది-ఇషాన్ కట్టర్‌తో కలిసి ఫోన్ బూత్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మెర్రీ క్రిస్టమస్ కాగా.. రెండోది టైగర్3. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది ఈ ముద్దుగుమ్మ.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.