తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September6th Episode: క్రూరంగా మారిన జ్యోత్స్న- ఓ వైపు దీప చావుకు, మరోవైపు పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్

Karthika deepam september6th episode: క్రూరంగా మారిన జ్యోత్స్న- ఓ వైపు దీప చావుకు, మరోవైపు పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్

Gunti Soundarya HT Telugu

06 September 2024, 7:01 IST

google News
    • Karthika deepam 2 serial today september 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప అడ్డు తొలగించుకోవడం కోసం జ్యోత్స్న నరసింహతో చేతులు కలుపుతుంది. దీపను చంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేయిస్తుంది. అటు పంతుల్ని కలిసి పెళ్ళికి రెండు రోజుల్లోనే ముహూర్తం ఉందని చెప్పిస్తుంది. 
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial today september 6th episode: ఇల్లు తన పేరు మీద రాసి డబ్బులు ఇవ్వమని లేదంటే చావదొబ్బి అయినా తీసుకుంటానని నరసింహ అంటాడు. దీంతో అనసూయ కత్తిపీట తీసుకొచ్చి ఇప్పుడు వాగు అని తిడుతుంది. నరసింహ మాత్రం ఏ మాత్రం భయపడకుండా అడిగింది ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అంటాడు.

నరసింహను రెచ్చగొట్టిన జ్యోత్స్న 

దీప కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇల్లు ఇవ్వకపోతే మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చి నరసింహ వెళ్లిపోతుంటే పక్కనే శౌర్య ఉండి భయపడుతూ చూస్తుంది. బూచోడు అంటూ దీపను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. నరసింహ రోడ్డు మీద వెళ్తుంటే జ్యోత్స్న ఆపుతుంది.

కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. నీ పెళ్ళాం నిన్ను వదిలేసి తనకు నచ్చినట్టు తిరుగుతుంది. ఏం చేశావ్, మీ అమ్మ దీప కోసం నిన్ను మోసం చేసింది ఏమైనా చేయగలిగావా? చివరికి నీ కూతురిని కూడా నీకు దూరం చేశారు. నువ్వు ఏమైనా చేయగలిగావా అని రెచ్చగొడుతుంది.

దీపను చంపేస్తా 

నువ్వు ఇలాగే మాట్లాడితే ఇప్పుడే పోయి దీపను చంపేస్తాను. అది చస్తే కూతురు నా దగ్గరకు వస్తుంది, నా రెండో పెళ్ళాం నా దగ్గరకు వస్తుందని అంటాడు. దీపను చంపేస్తాను అది చస్తేనే నాకు మనశ్శాంతి, నాకే కాదు నీకు కూడా ఉపయోగమే. ఏదైనా కేసు అయితే సాయం చేయమని అడుగుతాడు.

మీరు సరే అంటే మిగతాది నేను చూసుకుంటానని నరసింహ అంటే జ్యోత్స్న సరే అంటుంది. తొందర్లోనే దీప తల దగ్గర దీపం పెడతానని ఆవేశంగా మాట్లాడతాడు. శౌర్య బూచోడు ఎందుకు వచ్చాడు అని ఆయాసపడుతూ మాట్లాడుతుంది. అది చూసి అనసూయ పిల్లకు మళ్ళీ గుండె జబ్బు వచ్చినట్టు ఉందని భయపడుతుంది.

బూచోడు మళ్ళీ రాడు భయపడకు అని సర్ది చెప్తుంది. ఇల్లు కోసం నరసింహ ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏమోనని దీప భయపడుతుంది. నరసింహ తాగుతుంటే శోభ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రేపు ఒక్క రోజు ఆగితే మన ఇద్దరి జాతకాలు మారిపోయేలా చేస్తానని నరసింహ శోభకు మాట ఇస్తాడు.

పంతుల్ని మ్యానేజ్ చేసిన జ్యోత్స్న 

ఇంట్లో అందరినీ జ్యోత్స్న పిలిపిస్తుంది. ఎందుకు రమ్మన్నావ్ అంటే అప్పుడే పంతులు ఎంట్రీ ఇస్తాడు. పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి పంతుల్ని పిలిపించానని జ్యోత్స్న చెప్తుంది. నిశ్చితార్థం కలిసి రావడం లేదు పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామని బావ చెప్పాడు కదా అందుకే పిలిపించానని చెప్తుంది.

ఇప్పుడు ముహూర్తాలు పెట్టించాల్సిన తొందర ఏముందని కాంచన అంటుంది. పంతుల్ని పిలిచే ముందు మాకు ఒక మాట చెప్పొచ్చు కదాని దశరథ అంటాడు. ఇది ఎవరూ ఇచ్చిన సలహా కాదు తానే పిలిపించానని చెప్తుంది. పంతులు జాతకం చూసి అన్నీ ముహూర్తాలు కుదిరే పరిస్థితి లేదు.

వీళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు రోజుల్లో మంచి దివ్యమైన ముహూర్తం ఉందని చెప్తాడు. జ్యోత్స్న పంతుల్ని కలిసి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందని చెప్పాలి. తర్వాత ఆరు నెలల వరకు ముహూర్తం ఉన్నా పనికి రాదని చెప్పాలని చెప్తుంది. ఈ విషయాన్ని పంతులు, జ్యోత్స్న గుర్తు చేసుకుంటారు.

రెండు రోజుల్లో పెళ్లి 

రెండు రోజుల్లో పెళ్లి ఏంటి అని కార్తీక్ అంటే అవును రెండు తర్వాత ముహూర్తం కాకపోతే ఆరు నెలల వరకు అనువైన ముహూర్తం లేదని పంతులు చెప్తాడు. పెళ్లి సింపుల్ గా చేసి రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దామని పారిజాతం అంటుంది. పెళ్ళికి టైమ్ ఎక్కువ లేదు కష్టమేమోనని అందరూ అనుకుంటారు.

మీ ప్రాబ్లం పెళ్లి ఏర్పాట్లు అయితే తనకు రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఒకేనని జ్యోత్స్న అనడంతో అందరూ నవ్వుతారు. కార్తీక్ కూడా పెళ్ళికి సరే అంటాడు. ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ సక్సెస్ ఫుల్ అయ్యిందని జ్యోత్స్న సంతోషపడిపోతుంది. కార్తీక్ బయటకు వెళ్తుండగా శౌర్య దిగులుగా కూర్చుని ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు.

బూచోడు రాత్రి మా ఇంటికి వచ్చాడు. అమ్మ, నానమ్మను కొప్పడ్డాడని చెప్తుంది. సరేనని కార్తీక్ దీప దగ్గరకు వెళతాడు. వెనుకే జ్యోత్స్న కూడా వెళ్తుంది. ఇల్లు, డబ్బుల కోసం వచ్చాడని దీప చెప్తుంది. వాడికి గట్టిగా బుద్ధి చెప్తే ఇక మీ జోలికి రాడని మనసులో అనుకుంటాడు.

మా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ 

నరసింహ గురించి వదిలేయమని దీప అంటుంది. నువ్వు వదిలేయమన్నా మా బావ వదిలేయడు. ఎందుకో తెలుసా నువ్వంటే మా బావకు అంత గౌరవం. దీపకు గుడ్ న్యూస్ చెప్పావా అంటుంది. పంతులు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టారు రెండు రోజుల్లో పెళ్లి అని చెప్తుంది.

చాలా మంచి మాట చెప్పావని దీప సంతోషంగా మాట్లాడుతుంది. పెళ్లి జరుగుతుంది కానీ ఆ పెళ్ళికి నువ్వు రావు ఈలోపు నరసింహ నీ అంతు చూస్తాడని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తదుపరి వ్యాసం