తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 2nd Episode: ఒక్కో సీన్ ఒక్కో తూటానే- పారిజాతానికి గడ్డి పెట్టిన అనసూయ, తండ్రిని ఏకేసిన కొడుకు

Karthika deepam october 2nd episode: ఒక్కో సీన్ ఒక్కో తూటానే- పారిజాతానికి గడ్డి పెట్టిన అనసూయ, తండ్రిని ఏకేసిన కొడుకు

Gunti Soundarya HT Telugu

02 October 2024, 7:24 IST

google News
    • Karthika deepam 2 serial today october 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అటు జ్యోత్స్న, ఇటు పారిజాతం, మరోవైపు కార్తీక్ ఈరోజు అదరగొట్టేశారు. పారిజాతం దీపను తిడుతుంటే అనసూయ అడ్డుపడి తనకు గడ్డిపెడుతుంది. చురకలు వేస్తూ సరైన సమాధానం ఇచ్చి కోడలిని సపోర్ట్ చేస్తుంది. 
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial today october 2nd episode: జ్యోత్స్న బావతో పెళ్లి కావాలి అంటూ ఇంట్లో గొడవ చేస్తుంది. తన తాతయ్యను ఏకిపారేస్తుంది. తాత ఒక స్వార్థపరుడు. పరువు కోసం మనవరాలి జీవితాన్ని బలి చేశాడని అంటుంది. 

జ్యోత్స్న మీద చెయ్యెత్తిన దశరథ 

దశరథ వారించినా కూడా జ్యోత్స్న ఆగదు. తాతయ్య రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోనీ పరువు మావయ్య చేసుకుంటే పోయిందా అని అనేసరికి దశరథ కూతురి మీదకు చెయ్యి ఎత్తుతాడు.

కొట్టకుండా శివనారాయణ అడ్డుకుంటాడు. మనం ఆలోచించేది తన కోసమే కదా అయినా అర్థం చేసుకోవడం లేదు. నాకు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు మమ్మల్ని చూసుకోవడం కోసం మా నాన్న పారిజాతం పిన్నిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

కానీ మీ మావయ్య భార్య బతికి ఉండగానే తనకు తెలియకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మా నాన్న తన భార్యను సమాజంలో చూపిస్తాడు. కానీ మీ మావయ్య చూపిస్తాడా? అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటికి నిన్ను కోడలిగా పంపిస్తే నువ్వు నీ పిల్లలు జీవితాంతం నిందను మోస్తూ తిరగాలి.

బావను మర్చిపో 

నువ్వు ఈ ఇంటికి వారసురాలివి మా తర్వాత ఆస్తులు కాపాడాల్సింది నువ్వే అని దశరథ అంటాడు. నాకు ఇవేవీ వద్దు నాకు బావ కావాలి తనతో పెళ్లి చేయండి అని అడుగుతుంది. తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదు ఈ పెళ్లి జరగదని దశరథ తెగేసి చెప్తాడు. నాకు బావ కావాలి అని ఏడుస్తుంది.

నీ బావను మర్చిపో అని అంటాడు. అది ఈ జన్మలో జరగదు. బావ నా భర్త. మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. కాదని అనడానికి మీరెవరు. నేను బావను మర్చిపోలేను అని ఖరాఖండిగా చెప్తుంది. ఇదంతా చూసి దీప బాధగా వెళ్లిపోతుంటే పారిజాతం ఆపుతుంది.

జ్యోత్స్నకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని పారిజాతం దీపను తిడుతుంది. నిన్ను చేరదీసి తిండి పెట్టినందుకు మా కుటుంబాన్ని ఏడిపించుకుని తింటున్నావ్. నువ్వు బాగుపడవు. నువ్వు నీ కుటుంబం సర్వ నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టబోతుంటే అనసూయ ఆపండి అని అరుస్తుంది.

పారిజాతం తుప్పు వదిలించిన అనసూయ 

స్వప్న, కాశీ పెళ్లి జరిగితే జ్యోత్స్న, కార్తీక్ పెళ్లి జరగదని తెలిసే దీప ఈ పెళ్లి చేసిందని పారిజాతం అంటుంది. దీప చేయకపోతే వాళ్ళు చేసుకోరా? పిల్ల తండ్రి ఎవరో తెలియకుండానే మీ మనవడు తాళి కడతాడా? ఈరోజు కాకపోతే రేపు అయిన నిజం బయటపడుతుంది.

తప్పు చేసిన మనిషిని వదిలేసి న్యాయం చేసిన మనిషిని ఆడిపోసుకుంటావ్ ఏంటని అనసూయ పారిజాతాన్ని కడిగేస్తుంది. అనసూయ అని గట్టిగా అరుస్తుంది. కానీ అనసూయ మాత్రం అసలు ఎక్కడ తగ్గకుండా దుమ్ముదులిపేస్తుంది. నీ కొడుకు రెండో పెళ్ళిని సమర్థించినప్పుడు ఏమైంది నీ బుద్ధి అని పారిజాతం రివర్స్ లో ప్రశ్నిస్తుంది.

ఈరోజు నీ కొడుకు నిన్ను తరిమేసరికి మళ్ళీ నీ కోడలు పంచం చేరావని అవమానిస్తుంది. అవును నాకు బుద్ధి వచ్చి ఇప్పుడు నా మేనకోడలు ఇంటికి వచ్చానని అంటుంది. మనుషులన్న తర్వాత మారాలి. నేను మనిషిని మారాను మీరు మారండని చురకలు వేస్తుంది.

క్షమాపణ చెప్పిన శ్రీధర్ 

కార్తీక్ కి రోడ్డు మీద శ్రీధర్ తారసపడతాడు. కార్తీక్ మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. మీ అమ్మ ఎలా ఉందని అడుగుతాడు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?నమ్మించి మోసం చేస్తే కోలుకోవడం చాలా కష్టమని అంటాడు. నేను తప్పు చేశాను ఒప్పుకుంటానని శ్రీధర్ అంటాడు.

మీరు తప్పు కావాలని చేశారని అంటే క్షమాపణ అడుగుతున్నాను కదాని శ్రీధర్ చెప్తాడు. ఎవరికి కావాలి మీ క్షమాపణ పోయిన నా తల్లి నమ్మకాన్ని తీసుకొస్తుందా? తెగిపోయిన పుట్టింటి బంధాన్ని తీసుకొస్తుందా అనడంతో శ్రీధర్ షాకింగ్ గా ఏమైందని అడుగుతాడు.

పరువు పోయిన కుటుంబంతో వియ్యం అందుకునేది ఏంటని మావయ్య, తాతయ్య ఇంటికి వచ్చి చెప్పారు. వాళ్ళు తెంపుకుంది సంబంధం మాత్రమే కాదు బంధాన్ని కూడా. నా తల్లికి మెట్టినిల్లు, పుట్టిల్లు ఒకేసారి దూరం చేశారు. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా ఇష్టం లేదంటే మీ స్థాయి ఏంటో ఆలోచించుకో.

దీప నిజం చెప్పలేదు 

మేం ఏం తప్పు చేశాం? ఇన్నేళ్ల నుంచి ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలిగావని తండ్రిని నిలదీస్తాడు. ఎప్పటికప్పుడు నిజం చెప్పాలని అనుకున్నాను అంటే ఎందుకు నా తల్లిని చంపడానికా? అదేదో నాకు నిజం తెలిసినప్పుడే చెప్పకపోయానా అనడంతో శ్రీధర్ షాక్ అవుతాడు.

నీకు ముందే నిజం తెలుసా అంటే తెలుసు అంటాడు. నువ్వు చేసిన తప్పుకు నా తల్లికి ఎందుకు శిక్ష పడాలి. ఈ నిజాలు దీపకు తెలుసని నాకు తెలుసు. కానీ నాకు దీప చెప్పలేదు. ఒకరోజు రోడ్డు మీద మీ రెండో ఫ్యామిలితో మిమ్మల్ని చూశాను. చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదు.

అలాంటిది మోసం చేశారు అంటే ఎలా నమ్మాలి. నా పరిస్థితి ఇలా ఉంటే ఇన్నేళ్ళు మీతో కలిసి బతికిన మా అమ్మ పరిస్థితి ఇంకెలా ఉంటుంది. అందుకే అమ్మకు నిజం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కానీ స్వప్న దాసు మావయ్య కొడుకునే ప్రేమించింది. అప్పుడే అర్థం అయ్యింది కథ క్లైమాక్స్ కి వచ్చిందని.

తండ్రిని ఏకేసిన కార్తీక్ 

నిజం బయట పడిన రోజు అందరి కంటే మీరు ఎక్కువ నష్టపోతారు అనుకున్నా. కానీ మా అమ్మ నష్టపోయిందని కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ కాళ్ళు పోయినప్పుడు కూడా ఇంత బాధపడి ఉండదు. కానీ ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తుంది.

నువ్వు భార్యనే కాదు కొడుకు కూతురిని అందరినీ మోసం చేసింది. చివరికి నీ గురించి నిజాలు బయట పడతాయని నా చెల్లెలికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశావు. ఏదో అదృష్టం బాగుండి దీప వాళ్ళ పెళ్లి చేసిందని కార్తీక్ సమర్థిస్తాడు. అసలు ఇవన్నీ జరగడానికి కారణం దీప అని శ్రీధర్ అంటాడు.

ఇక చాలు ఆపండి దీప దగ్గరుండి పెళ్లి చేసింది స్వప్నకు మీకు పిన్నికి కాదని తిడతాడు. మీరు లేకుండా నేను బతకలేనని శ్రీధర్ బతిమలాడతాడు. మా అమ్మ మాత్రమే కాదు నేను కూడా మీతో మాట్లాడను మాకు అడ్డు రావద్దు అని కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు.

ఎందుకు ఇక్కడ ఉండటం 

ఆ మనిషితో మాటలు పడుతూ మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటని అనసూయ దీపను అడుగుతుంది. ఇది బాధ్యత, వాళ్ళకు నేను రుణపడి ఉన్నాను. నేను బతికి ఉన్నాను అంటే దానికి కారణం కార్తీక్ బాబు. నేను స్వప్న వాళ్ళకి పెళ్లి చేయడం వల్లే కార్తీక్ బాబు పెళ్లి ఆగిపోయింది.

నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉండాలని దీప చెప్తుంది. అప్పుడే కార్తీక్ ఆవేశంగా ఇంటి దగ్గరకు వస్తాడు. శౌర్య సంతోషంగా కార్తీక్ దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకుంటుంది. కార్తీక్ డల్ గా ఉండటంతో ఏమైందని శౌర్య అడుగుతుంది.

తేల్చుకోవడానికే వచ్చాను 

ఏం లేదని సర్ది చెప్తాడు. మీ నాన్న చేసిన తప్పుకు మీ తాత మీతో సంబంధం తెంచుకోవడం ఏంటని దీప అడుగుతుంది. ఆ విషయం మాట్లాడటం కోసమే వచ్చాను. ఏ నేరం చేసిందని నా తల్లికి శిక్ష వేశాడో అడగటం కోసమే వచ్చానని కార్తీక్ చెప్తాడు. ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళని నిలదీస్తే అమ్మ బాధపడుతుందని సైలెంట్ గా ఉండిపోయాను.

అలా సైలెంట్ గా ఉండి తప్పు చేశానని అర్థం అయ్యింది అందుకే అడిగేందుకు వచ్చాను అని కార్తీక్ ఆవేశంగా ఇంట్లోకి వెళతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం