Karthika deepam october 11th episode: ప్రమాదం నుంచి శౌర్యను కాపాడుకున్న వంటలక్క- దీప మెడలో తాళి తెంచేసిన నరసింహ
11 October 2024, 7:29 IST
- Karthika deepam 2 serial today october 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఇంటి బయట ఉండగా నరసింహ తనని ఎత్తుకుని పారిపోతాడు. బిడ్డ కనిపించకపోయే సరికి అనసూయ, దీప కంగారుగా రోడ్డు మీద వెతుకుతారు. ఒకచోట నరసింహ పాపను తీసుకెళ్లడం చూసి దీప అడ్డుకుంటుంది.
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 11వ తేదీ ఎపిసోడ్
శౌర్యను అమ్మవారిగా కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే శివనారాయణ, దశరథ ఇంటికి వస్తారు. కాంచన, సుమిత్ర, దీప సంతోషంగా పూజ చేస్తారు. ఇక పెళ్లి గురించి మాట్లాడమని జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. శివనారాయణ వాళ్ళు ఇంట్లో కాంచన, కార్తీక్ ని చూసి షాక్ అవుతారు.
జంట లేని వాళ్ళు ఉన్నారు
అమ్మవారి పూజ జరుగుతుందని దశరథ చెప్పడంతో అపాల్సిన అవసరం లేదని ముందు పూజ పూర్తి చేయమని పెద్దాయన చెప్తాడు. ఇలా జరిగింది ఏంటి అని దీప టెన్షన్ పడుతుంది. నాన్న ఏమంటాడోనని కాంచన కంగారుపడుతుంది. అమ్మని ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు చెప్తాను అందరి సంగతి అని కార్తీక్ అనుకుంటాడు.
మావయ్య వదినని ఏమీ అనకూడదని సుమిత్ర అమ్మవారికి దణ్ణం పెట్టుకుంటుంది. పూజ అయిపోయింది అందరూ జంటగా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని సుమిత్ర చెప్తుంది. ఇక్కడ జంట లేని వాళ్ళు ఉన్నారని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం రమ్మని తన చేతిని పట్టుకుంటుంది.
ఎక్కడా మచ్చలేని కుటుంబం
మనం భార్యాభర్తలం కాదని అంటాడు. సుమిత్ర పూజ గురించి చెప్పబోతుంటే ఈరోజు ఇంట్లో ఎవరు కంట తడి పెట్టడం మంచిది కాదని చెప్తాడు. దీప శౌర్యను తీసుకుని ఇంటికి వెళ్ళి దిష్టి తీయమని అనసూయకు ఇచ్చి పంపిస్తుంది. పూజకు వాళ్ళను ఎవరు పిలిచారు అని అడగను.
కానీ సొంత పెత్తనం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని శివనారాయణ అంటాడు. సుమిత్ర నీకోక శుభవార్త జ్యోత్స్నకు పెళ్లి సంబంధం ఒకే అయ్యిందని అనడంతో అందరూ షాక్ అవుతారు. అన్ని విషయాలు మాట్లాడాను ఎక్కడా మచ్చలేని గౌరవమైన కుటుంబం అది. తొందర్లోనే మన ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు.
బావను తప్ప ఎవరినీ చేసుకొను
మనవరాలిని పెళ్లి చూపులకు సిద్ధంగా ఉండమని చెప్పమని అంటాడు. మనిషి తప్పు చేస్తే వంశాన్ని వదిలేస్తారా అని కార్తీక్ తన తల్లిని ఇంట్లో నుంచి వెళ్లిపోదామని పిలుస్తాడు. దీప ఆపబోతుంటే కార్తీక్ సీరియస్ అవుతాడు. ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని కాంచన బాధగా వెళ్ళిపోతుంది.
మమ్మీ నేను బావను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకొను వెళ్ళి డాడీతో చెప్పమని జ్యోత్స్న అంటుంది. సుమిత్ర చాలా బాధపడుతుంది. అనసూయ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి శౌర్య ఉండదు. తనను వెతుక్కుంటూ అనసూయ వస్తే దీప ఇంట్లో శౌర్య లేదని చెప్తుంది.
శౌర్య మిస్సింగ్
ఇంటి బయట శౌర్యకు పెట్టిన కిరీటం కనిపించడంతో దీప కంగారుపడుతుంది. శౌర్యను నరసింహ తీసుకెళ్లాడేమోనని అంటాడు. అలా ఏమి జరిగి ఉండదని అనసూయ అంటుంది. నరసింహ ఎత్తుకుపోకపోతే నా బిడ్డ ఏమైందని దీప టెన్షన్ పడుతుంది. అనసూయ, దీప రోడ్డు మీద శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు.
నరసింహ శౌర్యను ఎత్తుకుని పారిపోతుంటాడు. నువ్వు బూచోడివి నన్ను వదులు అని శౌర్య ఏడుస్తూ ఉంటుంది. రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ శౌర్య గురించి దీప వాళ్ళు అడుగుతూ ఉంటారు. శౌర్య నరసింహ చేతిని కొరికేసి పారిపోయి కనిపించకుండా దాక్కుంటుంది.
నరసింహను తన్నిన దీప
నువ్వు మీ అమ్మ నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని నరసింహ గట్టిగా శౌర్యను పిలుస్తాడు. తప్పించుకోవడం కోసం బయటకు వచ్చిన శౌర్య మళ్ళీ నరసింహ కంట పడుతుంది. పద మన ఇంటికి పోదామని అంటాడు. అప్పుడే దీప, అనసూయ అటుగా వస్తారు.
అనసూయ కర్ర తీసుకుని నరసింహను కొట్టబోతుంటే తల్లిని పక్కకి తోసేస్తాడు. నరసింహ శౌర్యను తీసుకుని పారిపోతుంటే దీప వచ్చి ఒక్క తన్ను తన్నుతుంది. దీంతో కింద పడిపోతాడు. అమ్మా బూచోడు అని శౌర్య భయపడుతుంది. బిడ్డ మీద చెయ్యి వేస్తే కొడుకు అని కూడా చూడనని అనసూయ అంటుంది.
ఇప్పటికే చాలా తప్పులు చేశావు మర్యాదగా పోలీసులకు లొంగిపో లేదంటే నేనే నిన్ను పోలీసులకు అప్పగిస్తానని దీప వార్నింగ్ ఇస్తుంది. నీ వల్ల నా బతుకు రోడ్డున పడిందని నరసింహ అంటాడు. నీతో విడాకులు తీసుకున్న తర్వాత నీకు నాకు ఏంటి సంబంధమని దీప అంటే నరసింహ తమ మెడలో తాళి చూపించి ఇదే సంబంధమని అంటాడు.
నరసింహ దీప మెడలో తాళి తెంపడంతో అది ఎగిరి పక్కనే ఉన్న నిప్పుల్లో పడిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్