తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్.. కలిసిపోయిన దీప, కార్తీక్.. పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. కలిసిపోయిన దీప, కార్తీక్.. పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ

Gunti Soundarya HT Telugu

26 June 2024, 8:05 IST

google News
    • Karthika deepam 2 serial today june 26th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ తప్పు లేదని తెలుసుకున్న దీప అతనిని క్షమించమని అడుగుతుంది. దీప తనని అర్థం చేసుకోవడంతో కార్తీక్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. 
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 26వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 26వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 26వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial today june 26th episode: శౌర్యకు సంబంధించిన సమస్య అయితే తప్పకుండా తనకు చెప్పాలని కార్తీక్ చెప్పి వెళ్లబోతుంటే దీప ఆపుతుంది. క్షమాపణ చెప్తుంది. మా నాన్న విషయంలో ఏదైతే చూశానో ఏదైతే నిజమని నమ్మాను. జరిగింది మీరు చెప్పిన తర్వాత నేను చేసిన తప్పు అర్థం అయ్యింది.

క్షమాపణలు చెప్పిన దీప 

మీకున్న స్థాయికి నాతో మాటలు పడాల్సిన అవసరం లేదు కానీ పడ్డారు. క్షమాపణలు చెప్పారు మిమ్మల్ని మాట అన్న ప్రతీసారి ఎంత బాధపడ్డారో అర్థం చేసుకోగలను. నన్ను క్షమించండి. మీరు ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకున్నానని చెప్తుంది.

థాంక్స్ దీప నా బరువు మొత్తం దిగిపోయిందని కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఎవరి దృష్టిలో నేరస్థుడిని కాదని కార్తీక్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. శ్రీధర్ కావేరి వాళ్ళతో హ్యాపీగా గడుపుతాడు. డాడీ నువ్వు కాసేపు ఉంటేనే హ్యాపీగా ఉన్నాం ఇక ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందోనని స్వప్న ఆశపడుతుంది.

స్వప్నకు పెళ్లి చేయాలన్న కావేరి 

స్వప్నకు పెళ్లి సంబంధాలు చూడటం కోసం మ్యారేజ్ బ్రోకర్ ని కలవాలని కావేరి చెప్తుంది. తొందరపడి జాగ్రత్తగా పెళ్లి చేయాలని కావేరి అంటే నాకు లవ్ అఫైర్స్ ఉన్నాయని అనుకుంటున్నావా అని స్వప్న సీరియస్ అవుతుంది. తను ఇప్పుడు పెళ్లి చేసుకొనని అందుకు వంద కారణాలు ఉన్నాయి అవన్నీ నువ్వే అంటుంది.

నువ్వు బిజినెస్ సెట్ చేసుకుని జాబ్ అన్నీ మానేసి ఎప్పుడైతే మాతో ఇంట్లో ఉంటావో అప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని స్వప్న చెప్తుంది. నువ్వు క్యాంప్ కి వెళ్ళి నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే మమ్మీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. మీ మమ్మీని వదిలిపెట్టి అసలు ఉండను తను పక్కన ఉన్నప్పుడు ఎవరి ఫోన్స్ లిఫ్ట్ చేయనని శ్రీధర్ అంటాడు.

అబద్ధం చెప్పిన శ్రీధర్ 

అప్పుడే కాంచన ఫోన్ చేస్తుంది. శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆఫీసులో ఉన్నానని అబద్ధం చెప్తాడు. అది విని స్వప్న బిత్తరపోతుంది. హడావుడిగా శ్రీధర్ వెళ్ళిపోతాడు. కానీ స్వప్నకు మాత్రం అనుమానం వస్తుంది. దీప భోజనం చేయడానికి శౌర్యను రమ్మని పిలుస్తుంది. కానీ గదిలో శౌర్య తల్లిని ఆటపట్టించడం కోసం దాక్కుంటుంది.

నరసింహ మాటలు గుర్తు చేసుకుని భయపడుతుంది. కాసేపటికి కుర్చీ వెనుక దాక్కున్న కూతురిని గమనించి ఊపిరి పీల్చుకుంటుంది. తల్లీకూతుళ్ళు కాసేపు సరదాగా ఉంటారు. కాంచనతో మాట్లాడిన దాని గురించి శివనారాయణ సుమిత్ర వాళ్ళకు చెప్తాడు.

ఆలస్యం చేయకుండా మంచి రోజు కలుసుకుని ముహూర్తాలు పెట్టుకుంటే మంచిదని సుమిత్ర అంటుంది. అవును కాకపోతే మనవడు రెస్టారెంట్ పూర్తి అయ్యే వరకు ఆగమన్నాడు కదా దాని గురించి కాంచన కనుక్కుంటానని చెప్పిందని చెప్తాడు. అలాగని ఐదేళ్లు ఆగండని పారిజాతం ఆవేశపడుతుంది.

దీప ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది?

ఇది నా మనవరాలు, మనవడి పెళ్లి ఇందులో జోక్యం చేసుకోవద్దని శివనారాయణ పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. దీప విషయంలో జాగ్రత్తగా ఉండమని పారిజాతం అంటుంది. సుమిత్ర కంగారుగా ఏమైందని అడుగుతుంది. కాంచనకు బాగోలేదని కార్తీక్ చెప్తే దీప వెళ్ళి వంట చేసి వచ్చింది.

దీప ఆ ఇంటికి ఏ ఉద్దేశం లేకుండానే వెళ్ళిందా? ఈ విషయం దీప మొగుడికి తెలిస్తే వాడు అనే మాటలు మీరు భరించగలరా? ఇది ఆ నోట ఈ నోట అందరికీ తెలిస్తే మన పిల్లకు పెళ్లి చేస్తే విలువ ఉంటుందా? అని అంటుంది. నోరు మూయకపోతే ఊరుకొనని శివనారాయణ తిడతాడు.

సాయం చేయడానికి వెళ్ళిన దీపను తప్పుపడితే ఒప్పుకొనని అంటాడు. నా మనవరాలి మెడలో మూడు ముళ్ళు పడిన తర్వాత నేను నోరు ఎత్తితే అప్పుడు చెప్పండని అంటుంది. ముహూర్తాలు ఏవో త్వరగా పెట్టించి వాళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ చేస్తే ఇలా అందరికీ సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రాదని సుమిత్ర అంటుంది.

తండ్రి కోసం ఆరాటపడుతున్న శౌర్య 

అవును ప్రతి దానికి దీపను ఆడిపోసుకుంటే ఎలా తను ఎంత మంచిది. కల్మషం లేని మనసు తనదని శివనారాయణ, సుమిత్ర అనుకుంటారు. శౌర్య ఏదో రాస్తూ దీప రాగానే దాచిపెట్టి సర్ ప్రైజ్ అంటుంది. శౌర్య పేపర్ తో తయారు చేసిన రాబిట్ చూపెడుతుంది.

కాగితంతో కుందేలు బొమ్మలు తయారు చేసి అందులో నాన్న బొమ్మ అని కూడా చూపిస్తుంది. రేపు ఫాదర్స్ డే నాన్న లేరుగా అందుకే బొమ్మ చేశాను. ఇక్కడ నాన్న మనతోనే ఉన్నారు. ముగ్గురం ఉంటే ఎంత బాగుందో కదా నువ్వు ఎలాగూ నాన్నను తీసుకురావడం లేదు కదా అందుకే నేను తీసుకొచ్చాను నాన్న బాగున్నారు కదా అంటుంది.

బొమ్మను పట్టుకుని నాన్న నువ్వు ఎక్కడికి వెళ్లకు నాతోనే ఉండు అని మురిసిపోతుంది. అది చూసి దీప లోలోపలే బాధపడుతుంది. తండ్రి కోసం ఇంత తాపత్రయ పడే నీకు తండ్రికి దూరంగా బతికేలా చేశాడని కుమిలిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం