Fathers Day Wishes : హ్యాపీ ఫాదర్స్ డే.. ఇలాంటి గొప్ప మాటలతో మీ నాన్నకు విషెస్ చెప్పండి-happy fathers day 2024 greetings whatsapp status facebook messages quotes best lines fathers day wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fathers Day Wishes : హ్యాపీ ఫాదర్స్ డే.. ఇలాంటి గొప్ప మాటలతో మీ నాన్నకు విషెస్ చెప్పండి

Fathers Day Wishes : హ్యాపీ ఫాదర్స్ డే.. ఇలాంటి గొప్ప మాటలతో మీ నాన్నకు విషెస్ చెప్పండి

Anand Sai HT Telugu
Jun 15, 2024 03:30 PM IST

Fathers Day Wishes In Telugu : ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి కొన్ని మంచి మాటలతో విషెస్ చెప్పండి. మీరు చెప్పే మాటలు మనసులో నుంచి వచ్చినట్టుగా ఉండాలి. మీ నాన్న వాటిని చదివి ఆనందపడిపోవాలి. అలాంటి కొన్ని కోట్స్ కింద ఉన్నాయి. మీ తండ్రికి షేర్ చేసేయండి.

ఫాదర్స్ డే శుభాకాంక్షలు
ఫాదర్స్ డే శుభాకాంక్షలు

Fathers Day Greetings In Telugu : అమ్మ ప్రాణం పోస్తే, ఆ జీవితానికి ఆశ కలిగించేది నాన్న. ఆమె ఆప్యాయతలో అమ్మ ప్రేమ కనిపిస్తుంది. కానీ నాన్న అలా కాదు.. తన బాధ్యతలో ప్రేమను చూపిస్తాడు. తన బాధ్యతను తెలివిగా నిర్వహిస్తూ ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తాడు. మదర్స్ డే జరుపుకున్నట్లే ఫాదర్స్ డే కూడా ప్రత్యేకంగా జరుపుకోవాలి. సాధారణంగా నాన్నకు మనపై కొండంత ప్రేమ ఉంటుంది. కానీ చూపించరు. అదే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు మీ నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. దీని ద్వారా మీరు మీ ప్రేమను చూపించవచ్చు. అందుకోసం కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి.

మా అమ్మ నాకు జీవితాన్ని ఇస్తే, మా నాన్న నాకు బతకడం అంటే ఏంటో నేర్పించాడు.. నా చేయి పట్టుకుని నా భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆశతో తన జీవితాన్ని త్యాగం చేశాడు. నన్ను మంచి వ్యక్తిని చేసినందుకు ధన్యవాదాలు నాన్న.. Happy Fathers Day

ఇప్పటికీ, ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మీరు నా జీవితంలో ఉన్నందుకు థాంక్యూ నాన్న.. నేను చాలా అదృష్టవంతుడిని.. హ్యాపీ ఫాదర్స్ డే

కొంతమంది తండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటారు, మరికొందరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు.. అలా అని పిల్లలను ప్రేమించరని కాదు, వారు తమ ప్రేమను వ్యక్తపరిచే విధానం అది. ఒక కుమార్తెకు తన పెళ్లయ్యాక తండ్రి ప్రేమ ఏమిటో తెలుస్తుంది, కొడుకు.. అతను తండ్రి అయినప్పుడు తండ్రి గొప్పతనం అర్థమవుతుంది.. మీ కొండంత ప్రేమ ఇప్పుడు అర్థమవుతోంది నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే

ఎవరైనా తండ్రి కావచ్చు, కానీ కొద్దిమంది మాత్రమే మంచి నాన్న అవుతారు.. వారిలో ఒకరు మీరు. నాన్న మీరు చాలా ప్రత్యేకమైనవారు, నాకు ఎలా బతకాలో నేర్పించారు.. లవ్ యూ నాన్న.... హ్యాపీ ఫాదర్స్ డే 2024

మా భవిష్యత్ కోసం నువ్వు చిందించిన ప్రతి చెమట చుక్క రుణం తీర్చుకుంటాను, నువ్వు నాకు భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన బహుమతి. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు.. నాన్న నేను నీకు మంచి పేరు తీసుకొస్తాను.. పితృ దినోత్సవ శుభాకాంక్షలు..

మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ఎవరు అడిగినా నా జీవితంలో నేను చూసిన సూపర్ హీరో మా నాన్నే అని చెబుతాను.. నాన్న, నా కోసం మీ జీవితాన్ని ఖర్చు చేసినందుకు మీకు కృతజ్ఞతలు.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

దేశాన్ని రక్షించే సైనికుడిలా మమ్మల్ని రక్షించే యోధుడివి, నాకు మీరే బెస్ట్ ఫ్రెండ్... హ్యాపీ ఫాదర్స్ డే

తల్లి ప్రేమతో కూడిన ఒడిని అందిస్తే.. తండ్రి రక్షణతో కూడిన భుజాన్ని ఇస్తాడు.. Happy Fathers Day 2024

పిల్లల భవిష్యత్ కోసం జీవితాన్నే ఖర్చు చేసే గొప్ప వ్యక్తిత్వం తండ్రిది. మీరు లేని మా జీవితాలు శూన్యం.. హ్యాపీ ఫాదర్స్ డే 2024

ఒక తండ్రి కూతురి చేతిని కొన్నేళ్లు మాత్రమే పట్టుకుంటాడు.. కానీ ఆమె హృదయంలో తండ్రి ఇచ్చిన ధైర్యం జీవితాంతం ఉంటుంది.. Happy Fathers Day

ప్రియమైన నాన్న.. నా జీవితంలో ఎందరు పరిచయం అవుతారో.. ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు.. కానీ నా జీవితంలో మెుదటి వ్యక్తివి ఎప్పుడూ నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే

ప్రియమైన నాన్న మీరు ప్రపంచంలో ఒక్కరే కావొచ్చు.. కానీ నాకు మాత్రం మీరే ప్రపంచం.. happy fathers day 2024

నాన్నగారూ... మీ శ్రమ, త్యాగం, బాధ వల్లనే నేను సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను.. మీకు ధన్యవాదాలు చెప్పడం అనేది చాలా చిన్న పదం.. హ్యాపీ ఫాదర్స్ డే

ఈ క్షణంలో నా ఆనందానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం నువ్వే నాన్న.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

నా జీవితంలో అత్యుత్తమ రోజు మీరు మీ అరచేతులలో మొదటిసారి నన్ను ఎత్తుకుని నా నుదిటిపై ముద్దు పెట్టిన రోజు... Happy Fathers Day 2024

పిల్లల భవిష్యత్ బాగుండాలని తమ జీవితాలను ఖర్చు చేస్తున్న తండ్రులందరికీ HT Telugu తరఫున Happy Fathers Day

WhatsApp channel