తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప వెళ్ళకుండా ఆపిన సుమిత్ర.. ఛీ కొట్టిన శోభ, కార్తీక్ అంతు చూస్తానన్న నరసింహ

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప వెళ్ళకుండా ఆపిన సుమిత్ర.. ఛీ కొట్టిన శోభ, కార్తీక్ అంతు చూస్తానన్న నరసింహ

Gunti Soundarya HT Telugu

24 April 2024, 7:10 IST

google News
    • Karthika deepam 2 serial april 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య క్షేమంగా ఉండాలంటే ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లొద్దని దీపని వెళ్ళకుండా సుమిత్ర ఆపేస్తుంది. దీపని ఊరు పంపించలేదని శోభ నరసింహని ఛీ కొడుతుంది. 
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial april 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ దీపని పట్టుకోబోతుంటే సుమిత్ర అడ్డుపడుతుంది. దీపని ముట్టుకుంటే నీకు చెయ్యి కూడా ఉండదు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తే తప్పు ఏంటని అడుగుతాడు.

నీ మాటలను దీపని చూస్తుంటే అర్థం అవుతుంది నువ్వు ఎంత మంచి మొగుడివో. దీప నీతో రాదని తెగేసి చెప్తుంది. రాదని చెప్పడానికి మీరెవరు అంటే నేను దీప తల్లిని అంటుంది. కన్నతల్లిని దూరం చేసిన దేవుడు కూతురు కన్నీళ్ళు తుడవడానికి అది పుట్టినరోజే ఒక తల్లిని కూడా పుట్టించాడు. ఇప్పటి నుంచి దీప నా కూతురు.

దీప అంతు చూస్తా

ఇంకోసారి మాటలతో దీపని మాటలతో బాధపెట్టాలని చూస్తే ఊచలు లెక్కబెట్టిస్తా జాగ్రత్త అంటుంది. మీరు బెదిరిస్తే నేను భయపడిపోతానా అంటాడు. ఇవాళ మీరు కాపాడారు, రేపు ఎవరు కాపాడతారు. ఇది బయటకు రాదా నాకు దొరకదా అంటాడు. దీప ఎక్కడికి రాదు నువ్వు బయటకు పోరా అని సుమిత్ర కోపంగా చెప్తుంది.

బంటు దీప, నరసింహ వాళ్ళని చూస్తాడు. దీప నువ్వు బయటకు వస్తావ్ కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బతకనివ్వను నీ అంతు చూస్తానని నరసింహ దీపని బెదిరిస్తాడు. బంటు పారిజాతం దగ్గరకు వచ్చి దీప కోసం ఒకడు వచ్చాడని సుమిత్రమ్మ వాడిని పట్టుకుని కొట్టి పంపించేసిందని చెప్తాడు.

చూసేసిన బంటు

ఎవడు వాడు అంటే ఏమో తెలియదని అంటాడు. సుమిత్ర అమ్మగారు దీపని వెళ్లనిచ్చేలా లేదని చెప్తాడు. అది నిన్ను గుర్తు పడితే నువ్వే ఇరుక్కుపోతావు అంటాడు. దీప కోసం వచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు, వాడు దొరికితే దీప కథ ఏంటి? అనేది తెలుసుకుని దాన్ని గెంటేయాలని పారిజాతం ప్లాన్ వేస్తుంది.

దీప తనని ఏమి అడగొద్దని సుమిత్రకి చెప్తుంది. అమ్మానాన్న గురించి చెప్పావ్, భర్త గురించి ఎందుకు చెప్పలేదో ఇప్పుడు చూస్తే అర్థం అయ్యింది. మీ ఇద్దరి సమస్య ఏంటి? కట్నమా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. గూడెంలో ఉండాల్సిన మనిషివి సిటీకి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది.

దీప మాత్రం ఏం చెప్పకుండా ఏడుస్తుంది. నా గతాన్ని తెలుసుకుని నా మీద జాలి చూపించడం నాకు ఇష్టం లేదు. కాసేపటిలో వెళ్లిపోయేదాన్ని నా బాధని మరొకరికి పంచలేనని అంటుంది. నీ కష్టం చెప్పుకోవడానికి అమ్మానాన్న లేరు, వాళ్ళ తర్వాత స్థానం భర్తది. కానీ ఇక్కడ భర్తే కన్నీళ్ళు పెట్టిస్తున్నాడు.

పోలీస్ కేసు పెడతా

ఇక తర్వాత స్థానం నీ కూతురిది. ఇంకా నీ కూతురికి కన్నీళ్ళు ఎందుకు వస్తాయో తెలియని వయసు. దానికి కూడా నీ కష్టం చెప్పుకోలేవు. నువ్వు నన్ను అమ్మ అనుకొకపోయినా నేను నిన్ను కూతురు అనుకుంటున్నాను. కూతురు బాధని తల్లి తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరని సమస్య ఏమిటో చెప్పమని బతిమలాడుతుంది.

దీప చెప్పకపోయే సరికి సరే నేనే వాడి మీద పోలీసు కేసు పెట్టి వాడు నీ జోలికి రాకుండా చేస్తానని అంటే వద్దని అంటుంది. వీటన్నింటికి ఒక్కటే పరిష్కారం నేను వెళ్లిపోవడమే. ఎవరు ఉన్నారు, ఎవరి కోసం వెళ్తావ్ అని అడుగుతుంది. ఊర్లో మా అత్త ఉందని చెప్తుంది.

వాడు నా ముందే నిన్ను బెదిరించాడు బయటకు వెళ్తే నిన్ను వదిలిపెడతాడా? నువ్వు మొండిదానివి నీ మీద కోపంతో నీ కూతురిని తీసుకెళ్తే కోపం మనిషిని మృగంగా మారుస్తుంది. ఈ అమ్మ నీకు ఎప్పుడు తోడు ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండు.

దీపని వెళ్ళకుండా ఆపిన సుమిత్ర

నా వల్ల మీకు సమస్యలు వద్దు నేను వెళ్తాను అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటున్నావ్. నా కూతురు పుట్టినరోజే నువ్వు పుట్టి నాకు పెద్ద కూతురివి అయ్యావు. ఈ ఒక్కటి చాలు నిన్ను ఎక్కడికి పోనివ్వకుండా ఆపడానికి అంటుంది. అప్పుడే శౌర్య భయం భయంగా బూచోడు పోయాడా అంటుంది.

వెళ్ళిపోయాడు ఇక రాడని సుమిత్ర చెప్తుంది. బూచోడు ఎలా తెలుసని అంటే పూలు కోశానని అమ్మని తిట్టాడని శౌర్య అమాయకంగా చెప్తుంది. శౌర్య ఊరు వెళ్లిపోతున్నామని చెప్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటున్నారని సుమిత్ర చెప్తుంది.

ఇప్పుడు అంటే పోయాడు మళ్ళీ నాకోసం రాడని నమ్మకం ఏంటి? మళ్ళీ వస్తే అని భయపడుతుంది. శోభ దీపని పంపించావా అని నరసింహని అడుగుతుంది. దాన్ని రెండు తన్ని వచ్చానని చెప్తాడు. నిన్ను చూస్తుంటే తన్ని వచ్చినట్టు లేదు తన్నిచ్చుకుని వచ్చినట్టు ఉందని పసిగట్టేస్తుంది.

ఛీ కొట్టిన శోభ

మొగిడిని నీచంగా అవమానిస్తుంది. నాలుగు రోజులు చూస్తాను ఈలోపు దాన్ని ఊరు పంపించకపోతే ఊరుకునేది లేదని ఛీ కొడుతుంది. ఒసేయ్ దీప నీకు మామూలుగా చెప్పి వదిలేద్దామని అనుకున్నాను కానీ నువ్వు నన్ను దారుణంగా రెచ్చగొట్టావు. ఎవరి అండ చూసుకుని నీకు ఈ ధైర్యం వచ్చిందో అర్థం అయ్యింది, వాడి దగ్గర నుంచే మొదలు పెడతానని అనుకుంటాడు.

కార్తీక్ ని ఎలాగైనా తన బర్త్ డే పార్టీకి రావాల్సిందేనని జ్యోత్స్న అంటుంది. పార్టీకి వెళ్లకపోతే బాధపడుతుంది, అలాగని వెళ్తే ఇష్టంతో వచ్చానని ఆశలు పెంచుకుంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు. ఈరోజు నేను నీకోసమే పుట్టాను అలాంటి నాకోసం ఒక్క రోజు కూడా స్పెండ్ చేయలేవా అని జ్యోత్స్న అడుగుతుంది.

జ్యోత్స్నకి దూరంగా ఉండాలి

అత్త దగ్గరకు వెళ్ళి అడుగుతానని అనేసరికి కార్తీక్ వస్తానని చెప్తాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. తనకు బిజినెస్ మీటింగ్ ఉందని అబద్ధం చెప్తాడు. పార్టీలో తనతో పాటు డాన్స్ చేయాల్సిందేనని చెప్తుంది. పారు నిజం చెప్పేవరకు జ్యోత్స్నకి దూరంగా ఉండాలని అనుకుంటాడు.

ఎలాగైనా దీపకు నిజం చెప్పాలని డిసైడ్ అవుతాడు. దీప శౌర్య కోసం ఇంట్లోకి వస్తే ఇంకా ఇక్కడే ఉన్నావా ఊరు వెళ్లిపోతావాని అనుకున్నానే అని పారిజాతం నోటికి పని చెప్తుంది. దీప ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటుందని సుమిత్ర చెప్తుంది. ఎవరూ లేకపోతే పరవాలేదు ఎవరైనా ఉంటేనే ఇబ్బందని అంటుంది.

ఇందాక ఎవరో వచ్చారట, గొడవ ఏదో జరిగిందంట కదా. వచ్చిన వాడు దీప కోసమే వచ్చాడట అనేసరికి సుమిత్ర బంటుగాడు చెప్పాడా అంటుంది. శివనారాయణ వచ్చి కాసింత గడ్డి పెడతాడు. శౌర్యని దశరథ ఎత్తుకుని వస్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం