తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial April 1st Episode: ‘నాన్న ఎలా ఉంటారమ్మా’? ఏడిపించేసిన వంటలక్క, శౌర్య.. దీప కోసం వచ్చిన కార్తీక్

Karthika deepam 2 serial april 1st episode: ‘నాన్న ఎలా ఉంటారమ్మా’? ఏడిపించేసిన వంటలక్క, శౌర్య.. దీప కోసం వచ్చిన కార్తీక్

Gunti Soundarya HT Telugu

01 April 2024, 8:41 IST

google News
    • Karthika deepam 2 serial april 1st episode: పుట్టినప్పటి నుంచి నాన్నను చూడలేదని చూపించమని శౌర్య అడగడంతో దీప చూపిస్తుంది. తనకు పట్టిన గతి తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అటు కార్తీక్ దీప కోసం తన ఇంటికి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial april 1st episode: వడ్డీ వ్యాపారి మల్లేష్ ఊరి పెద్దలను తీసుకుని దీప ఇంటికి వస్తాడు. మీ ఆయన మల్లేష్ దగ్గర తీసుకున్న అప్పుకు నువ్వు హామీగా ఉన్నావా అంటే నిజమే అంటుంది. మల్లేష్ మాటలు విని అనసూయ బయటకు వస్తుంది. జనాలు టిఫిన్ కోసం ఇంటికి వచ్చేశారా అంటుంది. వాళ్ళు వచ్చింది మీ అబ్బాయి చేసిన అప్పు కోసమని చెప్తుంది. పైసలు అడగడానికి వస్తే పొట్టు పొట్టుగా కొట్టించారు, వాడేవడితోనే కూడా కొట్టించారని చెప్తాడు. మగతోడు లేని ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తానని అనసూయ తిడుతుంది.

దీప భర్త ఎక్కడున్నాడు?

మీ కొడుకు చేసిన అప్పు సంగతి ఏంటని పెద్దమనుషులు అడుగుతాడు. నా కొడుకు నన్ను అడిగి అప్పు చేయలేదు. ఈ పెద్ద మనిషి నన్ను అడిగి అప్పు ఇవ్వలేదు. ఈ అప్పుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగని ఇంటికి వచ్చి గొడవ చేస్తే తాట తీస్తానని అనసూయ వార్నింగ్ ఇస్తుంది. కొంచెం టైమ్ ఇస్తే తీర్చేస్తానని దీప అంటుంది. నీ మొగుడు ఎప్పుడు వస్తాడు వాడు ఎక్కడ ఉన్నాడో నీకే తెలియదని మల్లేష్ అంటాడు. నేను వెతుకుతానని దీప చెప్తుంది. ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఎలా వెతుకుతావ్ అంటారు. నరసింహ హైదరాబాద్ లో ఉన్నాడట ఎక్కడో డ్రైవర్ గా పని చేస్తున్నాడని ఒకతను చెప్తాడు.

హైదరాబాద్ వెళ్ళి తీసుకొస్తానని దీప సంతోషంగా చెప్తుంది. అంత పెద్ద సిటీలో ఎలా పట్టుకుంటావని అనసూయ అడుగుతుంది. ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు చిన్న ఆచూకీ తెలిసింది కదా బిడ్డని తీసుకుని పోయి వెతుకుతానని దీప అంటుంది. పిల్లని వేసుకుని తిరగడం కష్టం నేను నీతో వస్తానని అనసూయ చెప్తుంది. వెళ్ళండి కానీ ఇల్లు నా పేరు మీద రాసేయమని మల్లేష్ అడుగుతాడు. ఈ ఇల్లు నాది ఈ ఇంటి జోలికి వస్తే ఒప్పుకోను. ఎవరు ఎలా పోయిన నా తమ్ముడి ఇల్లు నాకు దక్కాల్సిందే అంటుంది. దీప తిరిగి వస్తుందని నాకు నమ్మకం ఉందని మల్లేష్ అంటాడు. హైదరాబాద్ వెళ్ళి నరసింహని పట్టుకుని వెళ్ళి అప్పు తీర్చమని ప్రెసిడెంట్ చెప్తాడు.

నాన్న ఎలా ఉంటారమ్మా?

నా భర్త ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి అందరి అప్పులు తీరుస్తాను కానీ అంతవరకు మా ఇంటికి ఎవరూ వచ్చి మా అత్తని ఇబ్బంది పడటానికి వీల్లేదని దీప చెప్తుంది. దీంతో అందరూ వెళ్లిపోతారు. అప్పుతో సంబంధం లేదని చెప్పొచ్చు కదాని అనసూయ అంటుంది మెడలో తాళి లేకపోతే అలాగే చెప్పేదాన్ని అంటుంది. దీప రోడ్డు మీద వెళ్తుంటే ఒకాయన పిలిచి మాట్లాడతాడు. జాతరలో నీకు బహుమతి ఇచ్చిన అతను మీ ఇంటికి వచ్చాడా అని అడుగుతాడు. రాలేదని చెప్తుంది. మల్లేష్ చెప్పింది నిజమే నాకోసం వాడిని కొట్టాల్సిన అవసరం ఏముందని అనుకుంటుంది.

కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు వినకపోయినా నీ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే నేను ఆ తప్పు చేయలేదు. వస్తున్నాను దీప నీ దగ్గరకే వస్తున్నానని అంటాడు. అటు దీప కోసం ఆమె ఉన్న ఊరికి కార్తీక్ బయల్దేరతాడు. అటు దీప హైదరాబాద్ వెళ్లేందుకు బ్యాగ్ సర్దుతుంది. శౌర్య వచ్చి ఊరు ఎందుకు వెళ్తున్నామని అడుగుతుంది. మీ నాన్నని చూడటానికని చెప్పేసరికి శౌర్య తెగ సంబరపడిపోతుంది. సైకిల్ మీద వెళ్దామని శౌర్య అమాయకంగా అంటుంది. నాన్న ఎలా ఉంటారు? నేను ఎప్పుడు నాన్నని చూడలేదు. తనని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దులు పెట్టాలి. అందుకే నాన్న ఎలా ఉంటాడో చెప్పమని అడుగుతుంది.

శౌర్యకి తండ్రిని చూపించిన దీప

దీప కన్నీళ్ళతో చూపిస్తానని చెప్పి అద్దం తీసుకొచ్చి శౌర్యకి చూపిస్తుంది. ఇదిగో మీ నాన్న ఇలా ఉంటారని అంటుంది. అద్దంలో తన మొహం చూసుకుని నాన్న నాలా ఉంటారా అని ఆనందపడుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అని అద్దంలోని తన రూపాన్ని ముద్దుపెట్టుకుంటుంది. అనసూయ దీపని తిడుతుంది. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఎందుకు దానికి ఆశలు పెడుతున్నావని అంటుంది. మరి ఏం చేయమంటారు? ఆరేళ్ళ కూతురు నాన్న ఎలా ఉంటారని అడిగితే గుండె పగిలి చచ్చిపోతుందని అంటుంది. తప్పంతా నీదగ్గర పెట్టుకుని మమ్మల్ని అంటావ్ ఏంటని అంటుంది.

అవును తప్పంతా నాదే ఎవరు ఒక్క మాట అన్నా పడరు. మీరు నా మీద అరుస్తారు. నేనే పిచ్చిదానిలా అందరికీ సమాధానం చెప్పుకోవాలని దీప గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నువ్వే మాకు పట్టిన దరిద్రం, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా బతుకులు ఇలా అయ్యాయి. నువ్వు రాకపోయి ఉంటే మా తమ్ముడు ఇంకొక పేలి చేసుకుని ఉండేవాడు నా బతుకు ఇలా అయ్యేది కాదు. ఈ దరిద్రాలకు కారణం నువ్వే. ఎవరు కని పారేశారో ఏంటోనని అనసూయ దీపని చూస్తూ తిట్టుకుంటుంది. ఊరు వెళ్తున్నావ్ అక్కడే ఉండిపోకుండా త్వరగా తిరిగి వచ్చేయ్. నువ్వు వస్తే నా కొడుకుతో రావాలి లేదంటే డబ్బుతో తిరిగి రావాలి. వస్తే అప్పుల వాళ్ళు ఊరుకోరు. ఈ ఇల్లు మాత్రం పోవడానికి వీల్లేదని అనసూయ ఖరాఖండిగా చెప్తుంది.

దీప కోసం వచ్చిన కార్తీక్

కార్తీక్ దీప ఇంటికి వస్తాడు. కానీ ఇంటికి తాళం వేసి ఉంటుంది. అక్కడ ఉన్న పిల్లలను కార్తీక్ పిలిచి దీప వాళ్ళ గురించి అడుగుతాడు. దీపక్క ఊరు వెళ్తానని చెప్పింది వెళ్లిపోయిందేమోనని పిల్లలు చెప్తారు. దీంతో కార్తీక్ బాధగా ఇక నా జీవితానికి క్షమాపణ లేదా దీప అంటాడు. అప్పుడే కార్తీక్ తండ్రి ఫోన్ చేస్తాడు. నా కొడుకు గత రెండు రోజులుగా తప్పిపోయాడని సెటైర్ వేస్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం