Maha lakshmi rajayogam: మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారిపై కనక వర్షం, అప్పుల బాధలు తీరిపోతాయ్
Maha lakshmi rajayogam: కుంభ రాశిలో కుజుడు, శుక్రుడు కలయిక వల్ల హోలీ రోజు మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. దీని వల్ల కొన్ని రాశుల వారికి భారీగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అప్పుల బాధలు తీరతాయి.
Maha lakshmi rajayogam: అసురుల అధిపతిగా భావించే అంగారకుడు ప్రస్తుతం శని స్వరాశి కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో సంపదన ఇచ్చే శుక్రుడు కూడా ప్రయాణిస్తున్నాడు. కుంభ రాశిలో శని, కుజుడు, శుక్రుడు కలయిక జరిగింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
సంపద, భౌతిక ఆనందం, వైవాహిక జీవితానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మార్చి 25న శుక్రుడు, కుజుడు కలయికతో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. సుమారు పది సంవత్సరాల తర్వాత యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగనున్నాయి. భారీగా ఆర్థిక లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారపరంగా పురోగతి సాధిస్తారు. మనసుని సంతోషపెట్టే శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుదల వంటివి ఈ యోగం ద్వారా లభిస్తాయి.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన రాజయోగాలలో మహాలక్ష్మి రాజయోగం ఒకటి. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు లాభపడనున్నారు. ఈ యోగం వల్ల అకస్మాత్తుగా సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. జాతకంలో ఈ యోగం ఉన్న వారికి అప్పుల బాధలు తొలగిపోతాయి.
మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో ఐశ్వర్యం, సంపద, ప్రేమ పెరుగుతాయి. జాతకంలో యోగం ఉంటే మీరు సంపదను పొందుతారు. మహాలక్ష్మి రాజయోగంతో పాటు హోలీ రోజున ధన శక్తి యోగం కూడా ఏర్పడింది. కుంభ రాశిలో శని, కుజుడు, శుక్రుడు గ్రహాల కలయిక జరగ్గా.. అటు మీనరాశిలో సూర్యుడు, బుధుడు, రాహువు కలయిక ఉంటుంది. మహా లక్ష్మీ రాజయోగం వల్ల ప్రయోజనాలు పొందే రాశులు ఇవే..
తులా రాశి
తులా రాశి ఐదో ఇంట్లో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. విదేశీ వ్యాపారులతో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరుగుతాయి. పిల్లల చదువుల్లో పురోగతి ఉంటుంది. ఊహించని విధంగా ధన లాభం పొందుతారు. ఆదాయం పెరగడం వల్ల బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి నాలుగో ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఫలితంగా భౌతిక ఆనందాలు పొందుతారు. వాహనం, ఆస్తి సమకూరుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. సానుకూల ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పని చేస్తారు. తెలివిగా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతతతో నిండిపోతుంది. మహా లక్ష్మీరాజయోగం వల్ల ధనానికి ఎటువంటి కొరత ఉండదు.
కుంభ రాశి
శుక్రుడు, కుజుడు కలయిక కుంభ రాశిలోనే జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మహాలక్ష్మీ రాజయోగం కుంభ రాశి ఒకటో ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ధైర్యంగా ఉంటారు. వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు గడిస్తారు. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈ మహాలక్ష్మి రాజయోగం కొన్ని రోజులపాటు ఉండనుంది. ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం వంటి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.