Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..దీప కొంగు పట్టుకున్న నరసింహ, చెంప పగలగొట్టిన కార్తీక్.. వంటలక్క మాస్ వార్నింగ్
17 April 2024, 9:54 IST
- Karthika deepam 2 serial april 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. గుడికి వెళ్ళిన దీపకు నరసింహ ఎదురుపడతాడు. తనని ఊరు ఎందుకు వెళ్లిపోలేదని నోటికొచ్చినట్టు తిడుతూ నీచంగా మాట్లాడతాడు. దీంతో దీప చెప్పు చూపించి వార్నింగ్ ఇస్తుంది.
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్
Karthika deepam 2 serial april 15th episode: దీప గుడికి వెళ్తుంది. ఏ ఆలోచనతో ఈ ఊరు వచ్చానో అది జరగదని అర్థం అయ్యింది. తిరిగి ఊరు వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదు. మా అత్తయ్య అక్కడ ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో. ఇక్కడే ఉందామని అంటే ఆ మనిషి కళ్లెదుటే తిరుగుతున్నాడు. అతను కనిపించకుండా ఉండటం కోసమైన ఊరు వెళ్లిపోవాలని అనుకుంటుంది.
నరసింహ చెంప పగలగొట్టిన కార్తీక్
దీపతో నిజం చెప్పే వరకు తను ఇక్కడే ఉండాలి. నేను తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని కార్తీక్ దేవుడికి విన్నవించుకుంటాడు. నా జీవితాన్ని నాశనం చేసిన వాడు, నా జీవితంలో సంతోషం లేకుండా చేసిన వాడు ఇద్దరు నా కళ్ళకు కనిపించకూడదణి దేవుడిని వేడుకుంటుంది.
గుడిలో నుంచి బయటకు వచ్చిన దీపకు నరసింహ ఎదురుపడతాడు. ఊరికి పోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని నిలదీస్తాడు. ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదని అని కోపంగా వెళ్లిపోతుంటే ఆగమని చెప్పి తన చీర కొంగు పట్టుకుంటాడు. కార్తీక్ లాగిపెట్టి ఒకటి పీకుతాడు.
తాళికట్టిన మొగుడిని కొట్టిస్తావా?
నరసింహ కాలర్ పట్టుకుంటాడు. లోపల నుంచి చూస్తూనే ఉన్నాను ఎవడు నువ్వు దీప చీర పట్టుకున్నావ్ అని నిలదీస్తాడు. నేనే నీ మెడలో తాళి కట్టిన మొగుడిని అని చెప్పమని నరసింహ అనేసరికి కార్తీక్ తన కాలర్ వదిలిపెడతాడు. మొగుడిని కొట్టించేంత బరితెగించావన్నమాట అంటాడు.
నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని చెప్తుంది. నువ్వు కూతురుని వేసుకుని వీడితో షాపింగ్ కి తిరగడం చూశాను. ఊరికి పోతావని అనుకుంటే బాగా డబ్బున్న వాడిని పట్టావే అని నోటికొచ్చినట్టు వాగుతాడు. ఆయన్ని ఏమైనా అంటే పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇస్తుంది.
చెప్పు చూపించిన దీప
నువ్వు ఇక్కడే ఉండి పిచ్చి వేషాలు వేస్తానంటే ఊరుకొనని నరసింహ అనేసరికి దీప చెప్పు తీసి పొమ్మని తిడుతుంది. నువ్వు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు ఇంకెక్కడైన కనిపిస్తే ఊరుకోను. ఈ రాత్రికి బస్సు ఎక్కి ఊరు వెళ్లిపో లేదంటే ఊరుకొనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
శౌర్య దశరథ ఒడిలో కూర్చుని ముచ్చట్లు చెప్తుంది. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని అనిపిస్తే రావచ్చా అని అడుగుతుంది. మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ మా నానమ్మఒక్కసారి కూడా బాగా మాట్లాడలేదు కోప్పడుతుందని అనేసరికి సుమిత్ర వాళ్ళు బాధగా చూస్తారు.
మీ ఊరు వెళ్లొద్దు, ఇక్కడ స్కూల్ లో చేర్పిస్తాను. కారులో పంపిస్తానని సుమిత్ర అనేసరికి శౌర్య చాలా సంబరపడుతుంది. సుమిత్ర పాయసం చేసి తినమని శౌర్యకు ఇస్తే తిని బాగోదని అంటుంది. మా అమ్మ చాలా బాగా చేస్తుందని చెప్తుంది. అసలు మీ అమ్మ ఏం చేస్తుందని సుమిత్ర అడుగుతుంది.
దీప గురించి చెప్పిన శౌర్య
సైకిల్ మీద వెళ్ళి అందరికీ టిఫిన్ ఇస్తుంది. మా అమ్మ వంట బాగా చేస్తుందని చెప్తుంది. అందుకే మా అమ్మని ముత్యాలమ్మ గూడెం అన్నపూర్ణ అంటారని చెప్తుంది. నిన్ను అడగకుండానే నీ విషయాలు తెలిశాయి. కానీ ఒకటే అర్థం కావడం లేదు నువ్వు భర్త ఆదరణ లేని ఆడదానివా? భర్త వదిలేసిన ఆడదానివా అని సుమిత్ర బాధగా ఆలోచిస్తుంది.
నరసింహ మాటలు తలుచుకుని దీప కోపంగా నడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళే రోడ్డు మర్చిపోతుంది. అటుగా కార్తీక్ వస్తాడు. మా నాన్న కోసమే హైదరాబాద్ వచ్చామని శౌర్య చెప్పింది. ఇక్కడ చూస్తే ఇతను చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అసలు ఏం జరిగిందో చెప్పమని కార్తీక్ అడుగుతాడు.
కోడలి కోసం ఆరాటం
అవన్నీ అనవసరమని దీప కోపంగా అంటుంది. ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరుగుతుంది. మీరు ద్వేషించినట్టుగా అని కార్తీక్ అంటుంటే తప్పు చేయలేదని అంటారు కదా కానీ నేను నమ్మనని అంటుంది. శివనారాయణ ఇంటికి ఎలా వెళ్లాలని రోడ్డు మీద పోయే వ్యక్తిని ఆపి దీపను అడుగుతుంది.
కార్తీక్ పక్కనే ఉండి అడ్రస్ చెప్తాడు. భలే చెప్పావయ్యా అంటే నేను ఆ ఇంటికే వెళ్తున్నానని అంటాడు. అయితే ఇంకెటమ్మా అతనితో పాటు వెళ్ళమని దీపను ఒప్పించి కార్తీక్ తో కారు ఎక్కించి పంపించేస్తాడు. జ్యోత్స్న పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వాలని కాంచన నగలు సెలెక్ట్ చేస్తుంది.
నగల ఫోటోస్ సుమిత్రకి పంపిస్తుంది. మీ అత్త ఫోటోస్ తో పాటు మెసెజ్ కూడా పెట్టింది. నా కోడలిని మెట్టినింటికి ఎప్పుడు పంపిస్తారని అడుగుతుందని సుమిత్ర చెప్తుంది. పిల్లలు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. జ్యోత్స్నకి కార్తీక్ అంటే ఎంత ఇష్టమో, కార్తీక్ కి జ్యోత్స్న ఎంత ఇష్టమోనని పారిజాతం అంటుంది. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేయమని చెప్తుంది.
పెళ్లి గురించి మాట్లాడుతుంటే అప్పుడే కార్తీక్ దీపను తీసుకుని వస్తాడు. పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మారదని శివనారాయణ అంటాడు. కాంచన కొడుకుతోనే సుమిత్ర కూతురు పెళ్లి అంటుండగా దీప కారులో నుంచి దిగడం పారిజాతం చూస్తుంది.
టాపిక్