తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Fires On Dpif Awards: దాదాసాహెబ్ పురస్కారాలపై కంగనా ఫైర్.. నెపో మాఫియా అంటూ ఘాటు వ్యాఖ్యలు

Kangana fires on DPIF Awards: దాదాసాహెబ్ పురస్కారాలపై కంగనా ఫైర్.. నెపో మాఫియా అంటూ ఘాటు వ్యాఖ్యలు

22 February 2023, 9:06 IST

    • Kangana fires on DPIF Awards: దాదాసాహేబ్ పురస్కారాలను ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు, నటీనటులకే ఇవ్వడంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఓ రేంజ్‌లో విమర్శించింది. మళ్లీ నెపో మాఫియాకే అన్నీ అవార్డులు వెళ్లాయని ఆరోపించింది. అంతేకాకుండా అర్హులైన వారికే అవార్డులివ్వాలంటూ తన జాబితాను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది.
కంగనా రనౌత్
కంగనా రనౌత్

కంగనా రనౌత్

Kangana fires on DPIF Awards: వీలు చిక్కినప్పుడల్లా బాలీవుడ్ అగ్ర నటీనటులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. మొన్నటి వరకు నెపోటిజంపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఈ ముద్దుగుమ్మ.. చాలా సార్లు బాలీవుడ్‌లో జరుగుతున్న అంశాల గురించి బహిరంగంగానే ఎండగట్టింది. తాజాగా మరోసారి వార్తాల్లో నిలిచింది. మంగళవారం నాడు దాదాసాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించగా.. అందులో ఎక్కువగా పురస్కారాలను బాలీవుడ్ చిత్రాలకే ఇవ్వడంపై మండిపడింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ ఇలా చాలా వరకు హిందీ చిత్రాలకే ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కంగనా సొంతంగా తన అవార్డులను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

"అవార్డు సీజన్‌లో మరోసారి నెపో మాఫియా వచ్చేసింది. అర్హులైన ప్రతిభావంతుల నుంచి మొత్తం అవార్డులన్నీ వారే కొల్లగొడుతున్నారు. 2022లో అద్భుత విజయాలను అందుకుని తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న కొందరి జాబితా ఇక్కడ ఉంది చూడండి." అని కంగనా రనౌత్ తన అవార్డులను ప్రకటించింది.

కంగనా ప్రకటించిన అవార్డు గ్రహీతల జాబితా..

బెస్ట్ యాక్టర్- రిషబ్ శెట్టి(కాంతార)

బెస్ట్ యాక్ట్రెస్- మృణాల్ ఠాకూర్(సీతా రామం)

బెస్ట్ డైరెక్టర్- ఎస్ఎస్ రాజమౌళి(ఆర్ఆర్ఆర్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- అనుపమ్ ఖేర్(కశ్మీర్ ఫైల్స్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్- టబు(దృశ్యం/భూల్ భూలియా)

"బాలీవుడ్ అవార్డులను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తోంది. నా షెడ్యూల్ నుంచి నాకు కాస్త సమయం దొరికినట్లయితే నేను అర్హులైన ప్రతిభావంతులందరికీ అవార్డు లిస్టు రూపొందించేదాన్ని. అని కంగనా తన ట్విటర్ వేదికగా రాసుకొచ్చింది.

మంగళవారం ప్రకటించిన దాదాసాహేబ్ పురస్కారాలు ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలకు, నటీనటులకే వచ్చాయి. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్.. బ్రహ్మాస్త్ర సినిమాకు అందుకున్నారు. ఉత్తమనటిగా ఆలియా భట్(గంగూబాయ్ కఠియా వాడి), ఉత్తమ దర్శకుడిగా ఆర్ బాల్కి(చుప్), క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా వరుణ్ ధావన్(భేదియా), ఉత్తమ నటిగా విద్యాబాలన్ (జల్సా), మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా రిషబ్ శెట్టి(కాంతార)కు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.