Kangana trolls Aamir Khan: పొగిడినా తప్పు పట్టిన కంగనా.. ఆమీర్‌పై ఫైర్ బ్రాండ్ సెటైర్-kangana ranaut trolls aamir khan even as he praises her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana Ranaut Trolls Aamir Khan Even As He Praises Her

Kangana trolls Aamir Khan: పొగిడినా తప్పు పట్టిన కంగనా.. ఆమీర్‌పై ఫైర్ బ్రాండ్ సెటైర్

Maragani Govardhan HT Telugu
Feb 11, 2023 09:03 AM IST

Kangana trolls Aamir Khan: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తనను పొగిడిన తప్పుపడుతోంది. ఆమీర్ ఖాన్ కంగనా నటనను ప్రశంసించగా.. తనెవరో తెలియదన్నట్లుగా నటించడానికి అతడు శాయాశక్తులా ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.

కంగనా-ఆమీర్ ఖాన్
కంగనా-ఆమీర్ ఖాన్

Kangana trolls Aamir Khan: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అనే సంగతి తెలిసిందే. గతంలో నెపోటిజంపై దుయ్యబడుతూ పలువురు అగ్ర నటులను టార్గెట్ చేస్తూ మరీ విమర్శలు గుప్పించింది. ఫలితంగా ఈ ముద్దుగుమ్మ మాటలకు ఏ ఇతర నటులు కూడా మాట్లాడేందుకే భయపడేలా చేసింది. ఖాన్ త్రయం సైతం ఈ బ్యూటీ నోటికి జడుసుకుంటుందంటే ఆశ్చర్యపోకతప్పదు. ఎంతలా అంటే చివరకు ఆమెను పొగిడినా సరే.. అందులో తప్పులు వెతికేస్తోందీ బ్యూటీ. తాజాగా ఆమీర్ ఖాన్‌ను తప్పపట్టింది కంగనా.

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ రైటర్ శోభా దే బుక్ లాంచింగ్ కార్యక్రమానికి ఆమీర్ ఖాన్ హాజరయ్యారు. అనంతరం శోభపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా శోభా బయోపిక్‌ను తీయాలంటే ఎవరు సరిపోతారని ప్రశ్నను ఆమీర్‌ను అడుగ్గా.. ఆయన దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ పేర్లు చెప్పాడు. ఇంతలో శోభ అందుకుని మీరు మరో పేరు మర్చిపోయారు అంటూ కంగనా పేరును గుర్తు చేస్తారు.

అందుకు ఆమీర్ స్పందిస్తూ.. "అవును, ఆమె అద్భుతమైన నటి. కంగనా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆమె చాల బలమైన, వైవిధ్యమైన నటి. తలైవిలో బాగా చేసింది" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మాటలపై కూడా ఆమీర్‌ను ఓ రేంజ్‌లో వేసుకుంది కంగనా. అతడు తన గురించి తెలియనట్లు నటించడానికి శాయశక్తులా ప్రయత్నించాడని ఆరోపించింది. "ఆమీర్ ఎంత అమాయకుడు.. హా హా హా మూడు సార్లు జాతీయ అవార్డు గెల్చింది నేనే అని తెలియనట్లు నటించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. శోభా గారు మీకు ధన్యవాదాలు. మీ పాత్రను పోషించడం నాకిష్టమే" అని కంగనా ట్విటర్ వేదికగా తెలియజేసింది.

శోభా గారికి తనకు రాజీకయ పరంగా విభేదాలున్నప్పటికీ ఆమె ప్రతిభను మాత్రం తక్కువ చేయలేనని కంగనా చెప్పుకొచ్చింది. "రాజకీయపరంగా శోభాజీ అభిప్రాయాలను వ్యతిరేకించి ఉండొచ్చు. కానీ కళను, కృషి, సమగ్రతను, క్రాఫ్ట్ పట్ల అంకిత భావాన్ని గుర్తించకుండా ఆపలేదు. మీ కొత్త పుస్తకానికి శుభాకాంక్షలు మేడమ్." అంటూ కంగనా తెలిపింది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.