తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Highest Grossed Movie: అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన కమల్ సినిమా

Vikram Highest Grossed Movie: అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన కమల్ సినిమా

HT Telugu Desk HT Telugu

22 September 2022, 12:18 IST

    • Vikram Highest grossed Movie: కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా అరుదైన ఘనత సాధించింది. తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇటీవలే వందరోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే సరికి రూ.500 కోట్లు వసూలు చేసింది.
కమల్ హాసన్ విక్రమ్ చిత్రం
కమల్ హాసన్ విక్రమ్ చిత్రం (PTI)

కమల్ హాసన్ విక్రమ్ చిత్రం

Vikram highest collections: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోజుల తర్వాత కమల్ ఖాతాలో అదిరిపోయే హిట్ పడే సరికి ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. పలితంగా కమల్ కెరీర్‌లోనే కాదు.. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంట గట్టిన నరసింహ..ప్లేటు ఫిరాయించిన అనసూయ

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల పైచిలుకు కలెక్షన్లతో రికార్డు బద్దలు కొట్టింది. ఇంత వరకు ఏ తమిళ సినిమా ఇంత భారీ వసూళ్లను సాధించలేదు. ఇప్పటికే తమిళనాడులో.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వసూళ్లను అధిగమించింది. థియేటర్లలో 113 రోజుల పాటు ఆడిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాది జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా తొలి వారంలోనే రూ.164.75 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్‌ ప్రధాన పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో మెప్పించారు. చివర్లో సూర్య రోలెక్స్ అనే పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కమల్‌తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ విక్రమ్‌కు సీక్వెల్ కూడా తెరకెక్కించే పనిలో పడ్డాడు. 2023లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది. ఈ సినిమాలో కమల్ పాత్రను.. 1986లో ఆయన నటించిన విక్రమ్ సినిమాకు అనుసంధానం చేసి దర్శకుడు రాసుకున్న తీరు అమోఘం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.