తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan To Replace Kajal With Another Heroin

Kajal Out from Indian2: భారతీయుడు2 నుంచి కాజల్ ఔట్.. మరో హీరోయిన్‌తో కమల్ మూవీ!

08 July 2022, 15:07 IST

    • భారతీయుడు-2లో హీరోయిన్‌గా మొదట కాజల్‌ను అనుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమా నుంచి ఆమెను తప్పించనున్నారట. ఆమె స్థానంలో మరోకరిని తీసుకోనున్నారని తెలుస్తోంది.
కాజల్-కమల్
కాజల్-కమల్ (Twitter)

కాజల్-కమల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గతేడాది గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనంతరం గర్భం దాల్చడంతో తన వద్ద ఉన్న ఆఫర్లన్నింటినీ ఒక్కొక్కటిగా వదులుకుంది. ఆచార్య, ది ఘోస్ట్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ సమంయలో ఆమె వదులుకున్నవే. తాజాగా మరో భారీ చిత్రం నుంచి ఈ బ్యూటీ తప్పుకుంది. అదే ఏదో కాదు.. డైరెక్టర్ శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో రానున్న భారతీయుడు-2.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

ప్రస్తుతం తన బిడ్డతో జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదిస్తున్న కాజల్.. ఇప్పుడప్పుడే సినిమాలకు ఓకే చెప్పేలా లేదు. దీంతో నాగార్జునతో చేయాల్సిన ది ఘోస్ట్ చిత్రం నుంచి కూడా తప్పుకుంది. అదేవిధంగా కమల్ హాసన్‌తో భారతీయుడు 2 చిత్రం చేయాల్సి ఉండగా.. చిన్నారితో బిజీగా ఉన్న ఆమె.. పునరాగమనం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. దీంతో చిత్రబృందం.. తమ సినిమాలో హీరోయిన్‌గా ఆమె స్థానంలో మరోకరిని తీసుకోవాలని భావించారట.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్-నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు తదితర కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇటీవల విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కమల్.. ఆ సినిమా ప్రమోషన్ల సందర్భంగా భారతీయుడు 2 గురించి అప్డేట్ ఇచ్చారు. ఎలాగైన ఈ సినిమా తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ మధ్యలో కాజల్‌కు పెళ్లి జరగడం, గర్భం దాల్చి పండండి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. తాజాగా భారతీయుడు 2 నుంచి ఆమెను తీసివేసి మరోకరిని తీసుకోనున్నారు మేకర్స్. కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం.. భారతీయుడు 2లో కాజల్ స్థానంలో బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.