తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి

Kalki 2898 AD Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి

30 April 2024, 22:43 IST

    • Kalki 2898 AD Prabhas - IPL 2024: కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్లను ఐపీఎల్‍లోనూ చేస్తోంది మూవీ టీమ్. ఐపీఎల్‍లో ఓ మ్యాచ్ కోసం ప్రభాస్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.
Kalki 2989 AD Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి
Kalki 2989 AD Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి

Kalki 2989 AD Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి

Kalki 2898 AD Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. భారీ బడ్జెట్‍తో గ్లోబల్ రేంజ్‍లో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. భారత పురాణాల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషన్ కంటెంట్ హైప్‍ను పెంచుతూనే ఉంది. జూన్ 27వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ప్రమోషన్ల జోరును మూవీ టీమ్ పెంచేసింది. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండటంతో దీన్ని కల్కి టీమ్ ఉపయోగించుకుంటోంది. ఈ చిత్రంలో బైరవగా నటించిన హీరో ప్రభాస్.. ఐపీఎల్‍లో ఓ మ్యాచ్‍ను, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Prasanth Ranveer Movie: ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా..

OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న 12th ఫెయిల్ హీరో కొత్త సినిమా: డేట్ ఖరారు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

మెగా మ్యాచ్ కోసం..

ఐపీఎల్ 2024 సీజన్‍లో మే 3వ తేదీన ముంబై ఇండియన్స్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీన్ని ఐపీఎల్ మహా మ్యాచ్ అంటూ ప్రమోట్ చేశారు ప్రభాస్. కల్కి 2898 ఏడీలోని భైరవ గెటప్‍లో ఈ ప్రోమోలో ప్రభాస్ కనిపించారు.

రేపటి కోసం నేడు ఆడాలి అంటూ ఈ ప్రోమోలో డైలాగ్స్ చెప్పారు ప్రభాస్. “క్రికెట్ కూడా ఓ యుద్ధమే. ఊపిరి బిగబట్టండి. రేపటి కోసం ఈరోజు ఆడండి” అని ఈ ప్రోమోలో ప్రభాస్ అన్నారు.

అదిరిన ప్రభాస్ లుక్

భైరవగా ఈ ఐపీఎల్ మ్యాచ్ ప్రోమోలో ప్రభాస్ లుక్, సూపర్ హీరో గెటప్, స్వాగ్ అదిరిపోయాయి. ఈ లుక్‍కు ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భైరవగా ప్రభాస్ అద్భుతంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమో వీడియో, ప్రభాస్ లుక్‍కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెబల్ స్టార్ లుక్‍తో ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

రిలీజ్ డేట్

కల్కి 2898 ఏడీ సినిమా కొత్త విడుదల తేదీ ఇటీవలే ఖరారైంది. జూన్ 27వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. మే 9న విడుదల చేయాలని ముందుగా భావించినా.. ఎన్నికల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. జూన్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్ సహా మరిన్ని విదేశీ భాషల్లోనూ ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

అమితాబ్ గ్లింప్స్ కూడా ఐపీఎల్‍లోనే..

కల్కి 2898 ఏడీ చిత్రంలో అశ్వత్థామగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను కూడా ఐపీఎల్ మ్యాచ్‍లోనే మూవీ టీమ్ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ కూడా హాలీవుడ్ రేంజ్‍లో ఉందనే రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా ఈ చిత్రం ప్రమోషన్లకు ఐపీఎల్‍ను బాగానే వినియోగించుకుంటోంది.

కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్‍తో పాటు దీపికా పదుకొణ్, తమిళ స్టార్ కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహా భారతం నుంచి భవిష్యత్తు వరకు సుమారు 6000ఏళ్ల కాలాన్ని ఈ మూవీలో చూపించనున్నట్టు దర్శకుడు నాగఅశ్విన్ ఇటీవల చెప్పారు. సుమారు రూ.600కోట్లతో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం