తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amigos Streaming On Netflix: ఓటీటీలో రిలీజైన క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Amigos Streaming on Netflix: ఓటీటీలో రిలీజైన క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

01 April 2023, 7:12 IST

  • Amigos Streaming on Netflix: క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా శ‌నివారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందిన‌ ఈసినిమా ఏ ఓటీటీలో రిలీజైందంటే...

క‌ళ్యాణ్ రామ్ అమిగోస్
క‌ళ్యాణ్ రామ్ అమిగోస్

క‌ళ్యాణ్ రామ్ అమిగోస్

Amigos Streaming on Netflix: క‌ళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా న‌టించిన అమిగోస్ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శ‌నివారం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఈ సినిమా రిలీజైంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అమిగోస్‌ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన యాభై రోజుల త‌ర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల‌ కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ త్రిబుల్‌రోల్‌లో న‌టించారు. డోప‌ల్‌గ్యాంగ‌ర్ అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి ఈ సినిమాను తెర‌కెక్కించారు. స్టోరీ బాగున్నా సినిమాను ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌లేక‌పోవ‌డంతో అమిగోస్ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

భారీ అంచ‌నాల‌తో ఫిబ్ర‌వ‌రి 10న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అమిగోస్ సినిమాలో ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది.

అమిగోస్ క‌థేమిటంటే...

ఒకే పోలిక‌ల‌తో ఉన్న ముగ్గురు ఏ మాత్రం సంబంధం లేని వ్య‌క్తుల క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి అమిగోస్ సినిమాను తెర‌కెక్కించారు. సిద్ధార్థ్‌, మంజునాథ్‌, మైఖేల్ ఒకే పోలిక‌ల‌తో ఉంటారు. మైఖేల్ కార‌ణంగా మిగిలిన ఇద్ద‌రి జీవితాలు ఎలా చిక్కుల్లో ప‌డ్డాయి?

డేంజ‌ర‌స్ క్రిమిన‌ల్ అయినా మైఖేల్ అమాయ‌కులైన సిద్ధార్థ్‌, మంజునాథ్‌ల‌తో ఎందుకు స్నేహం చేశాడు? మైఖేల్ బారి నుంచి వారిద్ద‌రు ఎలా త‌ప్పించుకున్నార‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్(Mythri Movie Makers) సంస్థ అమిగోస్ సినిమాను నిర్మించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.