Jd Chakravarthy Dayaa Web Series: జేడీ చక్రవర్తి తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ రివీల్
03 June 2023, 5:52 IST
Jd Chakravarthy Dayaa Web Series: సీనియర్ హీరో జేడీ చక్రవర్తి తెలుగులో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు. ఈ సిరీస్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అదేమిటంటే...
జేడీ చక్రవర్తి
Jd Chakravarthy Dayaa Web Series: శివ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి, గులాబి, బొంబాయి ప్రియుడు, సత్య వంటి సినిమాలతో హీరోగా సక్సెస్‌లను దక్కించుకొన్నాడు. పలు సినిమాల్లో విలన్‌గా కనిపించాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకొన్న జేడీ చక్రవర్తి ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు.
ఈ సిరీస్‌కు దయా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు పవన్ సాదినేని దర్శకత్వంలో వహిస్తోన్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దయా సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. నటీనటులు ఎవరూ లేకుండా ఓ వ్యాన్, దాని తాలూకు టైర్ గుర్తులతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
ఈ సిరీస్‌లో జేడీ చక్రవర్తితో ఈషారెబ్బా, రమ్యనంబీశన్ కీలక పాత్రలను పోషిస్తోన్నట్లు సమాచారం. పిట్టకథలు, 3 రోజెస్ తర్వాత ఈషారెబ్బా నటిస్తోన్న తెలుగు వెబ్‌సిరీస్ ఇది కావడం గమనార్హం. ఇందులో జేడీ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది .
ఈషారెబ్బా కూడా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రను చేస్తోన్నట్లు చెబుతోన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇతర భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు.
గతంలో ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి సినిమాలకు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. సేనాపతి తర్వాత కొంత గ్యాప్ అనంతరం దయా వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవన్ సాదినేని.