తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anchor Suma : 31 నుంచి 1 వరకు సుమకు బ్రేకా? ఎప్పటిలాగే ఫన్ కోసమా?

Anchor Suma : 31 నుంచి 1 వరకు సుమకు బ్రేకా? ఎప్పటిలాగే ఫన్ కోసమా?

Anand Sai HT Telugu

27 December 2022, 19:18 IST

    • Anchor Suma Shocking Decision : యాంకర్ సుమ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. ఇంట్లో సుమ మాట వినిపించని రోజు ఉండదేమో. తెలుగువారికి అంతలా కనెక్ట్ అయిపోయింది ఈ యాంకరమ్మ. ఇక తాజాగా యాంకరింగ్ కు సుమ దూరం.. సో..సాడ్ అంటూ.. కుప్పలుకుప్పలుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమేంత?
సుమ కనకాల
సుమ కనకాల (twitter)

సుమ కనకాల

యాంకర్ సుమ(Anchor Suma).. ఎప్పుడూ షోలతో బిజిబిజిగా ఉంటారు. ప్రతిరోజూ టీవీలో కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో ఓ మనిషిలాగే చాలామంది ఫీలవుతుంటారు. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న ఎంతోమందికి ఆమె ఒక డిక్షనరీ అనుకోవచ్చు. ఈవెంట్స్ లో మైక్ పట్టుకుని ఎంత పెద్ద స్టార్ నైనా.. ఈజీగా డీల్ చేస్తారు సుమ కనకాల(Suma Kanakala). ఆడియన్స్ ను నవ్విస్తూ.. అట్రాక్ట్ చేస్తారు. కాంట్రవర్సీల జోలికి వెళ్లరు. హెల్తీ రిలేషన్ షిప్స్ మెయింటెన్ చేస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇదంతా సరే.. తాజాగా ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పారంటూ.. ఒకటే వార్తలు. ఎన్నో షోలు సక్సెస్ అయ్యేందుకు కారణం సుమ. ప్రజలకు ఎంతో ఇష్టమైన యాంకర్ సుమ.. ఇలాంటి డెసిషన్ తీసుకుందని అందరూ షాక్ అవుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ యాంకర్ గా ఉన్నారు. మొదట్లో పలు సినిమాలు(Cinema), సీరియల్స్ లో నటించినా తర్వాత యాంకర్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఓ వైపు టీవీ షో(TV Show)లు.. మరోవైపు.. సినిమా ఈవెంట్లు(Cinema Events) అబ్బో చాలా బిజిగా ఉంటారు. కానీ తాజాగా ఓ టీవీ షోలో సుమ షాకింగ్ న్యూస్ చెప్పింది.. అందరూ ఇదే అంటున్నారు.. సుమ షాకింగ్ నిర్ణయమంటూ వార్తలు వస్తున్నాయి.

న్యూ ఇయర్(New Year) సెలబ్రేషన్స్ కోసం.. ఓ టీవీలో షో చేశారు. స్పెషల్ కార్యక్రమం కావడంతో చాలా మంది వచ్చారు. దీనికి సంబందించిన మెుదటి ప్రోమో విడుదలైంది. అందరినీ ఆకట్టుకుంది. తర్వాత రెండో ప్రోమో విడుదలైంది. అందులో చివరలో సుమకు అక్కడ నటులు సన్మానం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. సుమ మాట్లాడారు. 'మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే అది కేవలం తెలుగు వాళ్లు చూపించిన అభిమానం, ప్రేమ. అవి లేకపోతే నేను అసలు లేను. ఇది రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను.' అని సుమ కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా ప్రోమో ఉంది.

దీనిపై చాలా వార్తలు వచ్చాయి. అయితే చాలామంది ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ షో డిసెంబర్ 31కి ప్రసారం అవుతుంది.. కాబట్టి.. జనవరి 1వరకు బ్రేక్ అని చివరిలో ట్విస్ట్ ఇస్తారని అంటున్నారు. నిజానికి టీవీ షోలలోనూ ప్రాంక్ వీడియోల(Prank Videos) కల్చర్ స్టార్ట్ అయింది. ఈ షోలో సుమకు సన్మానం.., యాంకరింగ్ కు సుమ బ్రేక్ అనేది ప్రాంక్ లాంటిదేనని చాలామంది అంటున్నారు. సుమ యాంకరింగ్ మానేస్తే.. ఇప్పటికి ఇప్పుడు అంతటి స్టార్ యాంకర్(Anchor) ఎవరూ అంటూ మరికొంతమంది మాట్లాడుతున్నారు. డిసెంబర్ 31న ప్రసారం అయ్యే షో చూస్తే.. అసలు విషయం తెలుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.