తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K Movie Update: ప్రాజెక్టు కే కోసం భారీ టైర్ తయారీ.. ఫ్యూచర్ మొబిలిటీని ఆవిష్కరించే ప్రయత్నం

Project K Movie update: ప్రాజెక్టు కే కోసం భారీ టైర్ తయారీ.. ఫ్యూచర్ మొబిలిటీని ఆవిష్కరించే ప్రయత్నం

31 December 2022, 15:13 IST

    • Project K Movie update: ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్టు కే సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ సరికొత్త టైరునే ఆవిష్కరించే ప్రయత్నంచారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు.
ప్రాజెక్టు కే
ప్రాజెక్టు కే

ప్రాజెక్టు కే

Project K Movie update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ కే. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో ప్రభాస్, అమితాబ్ పోస్టర్లను వారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల కూడా చేశారు. తాజాగా 2023 నూతన సంవత్సరం సందర్భంగా ప్రీ ప్రొడక్షన్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది ప్రాజెక్ట్ కే బృందం.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

ఈ సినిమాలో భవిష్యత్ మొబిలిటీని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్‌లో ఆటోమొబైల్ రంగంలో ఏర్పడే మార్పులు, వాహనాల అప్‌గ్రేడ్‌లను ఈ సినిమాలో చూపించనున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో చిత్రబృందం అధునాతన టైర్‌ను తయారు చేసింది. ఇందుకోసం ఆటోమొబైల్ నిపుణుల సహకారం తీసుకుంది. కస్టమ్ మేడ్ వెహికల్ కోసం ఈ టైర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఉన్న ఈ టైర్‌ను చూస్తుంటే భవిష్యత్తులో ఆటోమొబైల్ సెక్టార్ ఏ విధంగా పుంజుకుంటుందో ఈ సినిమా ద్వారా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ టైర్ తయారీ కోసం నాగ్ అశ్విన్ టీమ్ ఎంత కష్టపడిందో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. మొదటి ఎపిసోడ్‌లో స్క్రాచ్ నుంచి వారు టైర్‌ను ఎలా తయారు చేశారనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో వచ్చే మార్పులను, అప్ గ్రేడ్లను ఇందులో చూపించనున్నారు. ఇందుకోసం మహీంద్రా సంస్థకు చెందిన ఆటోమొబైల్ నిపుణుల సహాయం కూడా తీసుకుంటోంది చిత్రబృందం.

వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రాజెక్టు కే సినిమాను అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023 చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.