Kamal Haasan - Trisha Movie: ముచ్చటగా మూడోసారి కమల్ హాసన్ - త్రిష రొమాన్స్
31 December 2022, 14:13 IST
Kamal Haasan - Trisha Movie: మన్మథన్ అంబు, తూంగవనం తర్వాత కమల్‌హాసన్, త్రిష కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
త్రిష
Kamal Haasan - Trisha Movie: కమల్‌హాసన్‌తో వెండితెరపై మూడోసారి రొమాన్స్ చేసేందుకు త్రిష రెడీ అవుతోంది. గతంలో కమల్‌హాసన్‌తో కలిసి మన్మథన్ అంబు, తూంగవనం సినిమాలు చేసింది త్రిష. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ రాబోతున్నది.
1987లో నాయకుడు తర్వాత కమల్‌హాసన్, విలక్షణ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
త్రిష ప్రధాన పాత్రలో నటించిన రాంగి సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మణిరత్నం, కమల్‌హాసన్‌లతో సినిమాలు చేయాలని ఉందంటూ త్రిష చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్‌డైరెక్ట్‌గా కమల్, మణిరత్నం సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు త్రిష అనౌన్స్‌చేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ -1 సినిమాలో చోళ యువరాణి కుందైవిగా కనిపించింది త్రిష. ఇందులో రాచరికపు ఎత్తులు తెలిసిన యువరాణిగా నటనతో పాటు అందంతో ఆకట్టుకున్నది. పొన్నియన్ సెల్వన్ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది.
ఈ సీక్వెల్‌లో త్రిష క్యారెక్టర్‌కు మరింత ఇంపార్టెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ పూర్తయిన వెంటనే కమల్‌హాసన్, మణిరత్నం సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కమల్‌హాసన్ నటిస్తోన్న 234వ సినిమా ఇది 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్స్ సంస్థలు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్‌హాసన్ నిర్మాణ భాగ్యస్వామిగా వ్యవహరిస్తోన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ -2 సినిమా చేస్తున్నాడు కమల్‌హాసన్.