Prabhas in Unstoppable 2: ప్రభాస్‌ దెబ్బకు ఆహా యాప్‌ డౌన్‌.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్యతో యంగ్‌ రెబల్‌ స్టార్‌-prabhas in unstoppable 2 as the aha ott crashed with overwhelming response for the episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Prabhas In Unstoppable 2 As The Aha Ott Crashed With Overwhelming Response For The Episode

Prabhas in Unstoppable 2: ప్రభాస్‌ దెబ్బకు ఆహా యాప్‌ డౌన్‌.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్యతో యంగ్‌ రెబల్‌ స్టార్‌

Hari Prasad S HT Telugu
Dec 29, 2022 10:16 PM IST

Prabhas in Unstoppable 2: ప్రభాస్‌ దెబ్బకు ఆహా యాప్‌ డౌన్‌ అయింది. అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్యతో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ముచ్చటించిన ప్రోగ్రామ్‌ చూడటానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ట్యూన్‌ కావడంతో యాప్‌ పని చేయలేదు.

అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్

Prabhas in Unstoppable 2: యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాసా మజాకా? అతనికి ఉన్న క్రేజ్‌కు తాజా నిదర్శనమిది. బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 షోలో న్యూ ఇయర్‌ స్పెషల్‌గా ప్రభాస్‌ వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ను చాలా రోజులుగా ఆహా ఓటీటీ ప్రమోట్‌ చేస్తోంది. తొలిసారి అన్‌స్టాపబుల్‌లో ఒక సెలబ్రిటీ టాక్ షోను రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ గురువారం (డిసెంబర్‌ 29) రాత్రి 9 గంటలకు స్ట్రీమ్‌ అవుతుందని చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సమయానికి ఈ షో స్ట్రీమింగ్‌ ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆహా యాప్‌లోకి లాగిన్‌ అవడానికి ప్రయత్నించారు. ఈ ట్రాఫిక్‌ను తట్టుకోలేక ఆ యాప్‌ డౌన్‌ అయింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీనే ట్విటర్‌ ద్వారా అనౌన్స్‌ చేసింది.

"మీ ప్రేమకు హద్దుల్లేవు డార్లింగ్స్‌! మా యాప్‌ ఆఫ్‌లైన్‌ కావచ్చు కానీ మా ప్రేమ కాదు. మా యాప్‌ను ఫిక్స్‌ చేయడానికి కాస్త సమయం ఇవ్వండి. త్వరలోనే యాప్‌ను పునఃప్రారంభిస్తాం" అని ఆహా ఓటీటీ ట్వీట్‌ చేసింది. #PrabhasOnAHA, #UnstoppableWithPrabhas, #NandamuriBalakrishna హ్యాష్‌ట్యాగ్‌లతో ఆహా ఈ ట్వీట్‌ చేసింది.

గురువారం ఉదయం నుంచే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ కౌంట్‌డౌన్‌ను ఆహా ప్రారంభించింది. ట్విటర్‌లో గంట గంటకూ అప్‌డేట్స్‌ ఇస్తూ వెళ్లింది. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌కు మాచో స్టార్‌ గోపీచంద్‌తో కలిసి ప్రభాస్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో షోపై మరింత ఆసక్తి పెంచింది. వచ్చే గురువారం (జనవరి 6) ప్రభాస్‌, గోపీచంద్‌ల రెండో భాగం టాక్‌ షో స్ట్రీమింగ్ కానుంది.

సాధారణంగా ప్రభాస్‌ను ఇలాంటి షోలలో చూడటం చాలా అరుదు. దీంతో డార్లింగ్‌లోని మరో యాంగిల్‌ను చూడటానికి అతని ఫ్యాన్స్‌ చాలా ఆసక్తి చూపారు. ఆ ఆసక్తే ఆహా యాప్‌ పని చేయకుండా చేసింది. తొలి సీజన్‌ కంటే కూడా రెండో సీజన్‌లో గెస్ట్‌ల ఎంపికతోనే అన్‌స్టాపబుల్‌ షో సూపర్‌ సక్సెస్‌ సాధించింది. ప్రభాస్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌ కూడా రానుంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ ఈ మధ్యే జరిగింది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.