Unstoppable 2 Gopichand Glimpse: అన్‌స్టాపబుల్‌లో గోపీచంద్ గ్లింప్స్ వచ్చేసింది.. మ్యాచో స్టార్‌తో రెబల్ స్టార్
Unstoppable 2 Gopichand Glimpse: బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ప్రభాస్, గోపీచంద్ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్‌లో గోపీచంద్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు నిర్వాహకులు.

Unstoppable 2 Gopichand Glimpse: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు క్రేజ్ రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు ఎపిసోడ్‌లు జరుగ్గా.. గత ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వీక్షణలు వచ్చాయి. త్వరలో ఆరో ఎపిసోడ్‌కు ఆహా సిద్ధమవుతోంది. ఈ ఎపిసోడ్‌కు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారు. అంతేకాకుండా ఆయనతో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఫొటోలు, గ్లింప్స్ విడుదల చేశారు నిర్వాహకులు. తాజాగా గోపీచంద్‌కు సంబంధించిన షార్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో బాలయ్య, ప్రభాస్‌తో కలిసి గోపీచంద్ సందడి చేశారు. ఇంతకుముందెన్నడు చూడని విధంగా గోపీచంద్ అలరించారు. ఈ షార్ట్ గ్లింప్స్‌లోనే ప్రభాస్.. గోపీచంద్‌ను రేయ్ అంటూ ఆటపట్టించగా.. బాలయ్య వారితో కలిసి నవ్వులు పూయించారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ పూర్తి ఎపిసోడ్ రానున్నట్లు ఆహా.. ట్విటర్ వేదికగా తెలియజేసింది.
"మన మ్యాచో స్టార్ గోపీచంద్‌ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు.. ఈ చిన్న గ్లింప్స్ మీకోసం. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ఈ మాసివ్ ఎపిసోడ్ అస్సలు మిస్ కావద్దు. ప్రోమో త్వరలోనే విడుదలవుతుంది." అంటూ ఆహా సోషల్ మీడియా వేదికగా తేలియజేసింది.
ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్ 2కు సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ షోకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా రానున్నారని, ఈ సారి మాత్రం పక్కాగా వస్తారని సమాచారం. దీంతో మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమే అయితే.. రేటింగ్స్‌లో దూసుకెళ్తుందని అంచనాలు వేసుకుంటున్నారు.
అన్‌స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు, లోకేష్ రాగా.. అనంతరం విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ సందడి చేశారు. మూడో ఎపిసోడ్‌కు అడివి శేష్, శర్వానంద్ వచ్చారు. నాలుగో ఎపిసోడ్ కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలను రప్పించారు. ఇక ఐదో ఎపిసోడ్‌కు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు విచ్చేశారు. తాజాగా ప్రభాస్, గోపీచంద్ సందడి చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో త్వరలోనే ప్రసారం కానుంది.
సంబంధిత కథనం