తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Atm Series Trailer: ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీలోకి హరీష్ శంకర్

ATM Series Trailer: ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీలోకి హరీష్ శంకర్

07 January 2023, 21:33 IST

    • ATM Series Trailer: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథను సమకూర్చిన వెబ్ సిరీస్ ఏటీఎం. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్‌ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్
ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్

ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్

ATM Series Trailer: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు ఓ వెబ్‌సిరీస్‌లోనూ భాగమయ్యారు. ఆయన రాసిన కథతో ఏటీఎం అనే సిరీస్ తెరకెక్కింది. ఫలితంగా ఈ సిరీస్‌తో ఘనంగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్‌బాస్ 5 విన్నర్ వీజే సన్నీ ఇందులో నటించాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్. హరీష్ శంకర్ ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ట్రెండింగ్ వార్తలు

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

సీ చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా ఈ షో ప్రసారం కానుంది. దోపిడి నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. జనవరి 20 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "దోపిడీ జోనర్‌లో రాసిన ఈ కథ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీలక పాత్రలో నటించారు. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న యూవకుడు ఏం చేశాడనేది ఇందులో కథాంశం. సిరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. పిల్లి-ఎలుక గేమ్‌లాగా ఉంటుంది. ఓ వైపు నవ్విస్తూ ఉంటుంది." అని హరీష్ శంకర్ చెప్పారు.

ఈ సిరీస్‌కు హర్షిత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. వీజే స‌న్నీ, కృష్ణ‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌శాంత్ ఆర్‌. విహారి సంగీతం స‌మ‌కూర్చారు. జీ5 వేదికగా ఈ సిరీస్ జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.