తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Director Bobby Interview: వాల్తేరు వీరయ్య టైటిల్ ఆ విధంగా వచ్చింది.. బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు

Director Bobby Interview: వాల్తేరు వీరయ్య టైటిల్ ఆ విధంగా వచ్చింది.. బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు

07 January 2023, 19:55 IST

    • Director Bobby Interview: చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా వచ్చిందో తెలిపాడు.
వాల్తేరు వీరయ్య గురించి బాబీ ఇంటర్వ్యూ
వాల్తేరు వీరయ్య గురించి బాబీ ఇంటర్వ్యూ

వాల్తేరు వీరయ్య గురించి బాబీ ఇంటర్వ్యూ

Director Bobby Interview: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచింది. శృతిహాసన్ కథనాయికగా నటించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా సంక్రాంతికి విడుదల కానున్న సందర్భంగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

"చిరంజీవి గారికి ఉన్న లక్షల మంది అభిమానుల్లో నేను ఒకడిని. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలనుకున్నాను. అయితే ఆ కల దాదాపు 20 ఏళ్ల తర్వాత తీరింది. వాల్తేరు వీరయ్యతో ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. మాస్ ఆడియెన్స్ ఏం కోరుకుంటారో దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని చేశాను. లాక్డౌన్ కంటే ముందే ఈ కథను చిరంజీవి గారికి చెప్పాను. అయితే కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారడంతో చిన్న చిన్న మార్పులు చేసి రవితేజ పాత్రను తీసుకొచ్చాను. ఆయన అతిథి పాత్రలో కనిపించారా? పూర్తిస్థాయిలో కనిపిస్తారా అనేది మీరు తెరపైనే చూడాలి" అని బాబీ అన్నారు.

ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని కూడా వివరించారు బాబీ. "వెంకీ మామ షూటింగ్ సమయంలో నాజర్ గారు ఓ పుస్తకం ఇచ్చారు. ఇందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఆ టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముంది బాపట్లలో ఆయన నాన్నగారికి ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందల ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోలతోనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. అది చాలా నోస్టాలజిక్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు వీరయ్య అనే పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది." అలా వాల్తేరు వీరయ్య పేరు వచ్చింది.

వాల్తేరు వీరయ్య చిత్రానికి సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఇప్పటికైతే ఆ ఆలోచన లేదని చెప్పారు బాబీ. ప్రేక్షకుల కోరిక బట్టి ఆ దిశగా ఆలోచిస్తామని తెలిపారు. చిరంజీవి, రవితేజకు హిందీలో మంచి మార్కెట్ ఉందని, అందుకే తెలుగుతోపాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం