Harish Shankar ATM OTT Premier Date: టాలీవుడ్‌లోని ప్రముఖ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజుతో చేతులు కలిపి తీసిన వెబ్ సిరీస్ ఏటీఎం (ATM). ఏటీఎంల దోపిడీ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. ఓ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఏడాది కిందట అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.,ఈ ఏటీఎం సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 శుక్రవారం (జనవరి 6) అధికారికంగా అనౌన్స్ చేసింది. జనవరి 20 నుంచి ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ సిరీస్ తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది.,ఏటీఎంల దోపిడీ గురించి న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను చూపిస్తూ ఈ వీడియో సాగింది. చివర్లో ఏటీఎం టైటిల్‌తోపాటు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు, రోయెల్ శ్రీ, రవిరాజ్, కృష్ణ బురుగుల ఈ సిరీస్‌లో కీలకపాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను చంద్రమోహన్ డైరెక్ట్ చేయగా.. హరీష్ శంకర్ కథ అందించాడు. ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.,ఏటీఎం టైటిల్‌కు పైసల్‌తోఆట అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఈ టైటిల్, ట్యాగ్‌లైన్‌ను బట్టి స్టోరీ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఏటీఎంల దోపిడీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఏటీఎంలలోని డబ్బుని కొల్లగొట్టడానికి కొందరు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. అలాంటి వాటిని చాలా ఆసక్తికరంగా ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.,