తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Teaser: హ‌నుమాన్ టీజ‌ర్ రిలీజ్ - సూప‌ర్ హీరోగా తేజ స‌జ్జా

Hanuman Teaser: హ‌నుమాన్ టీజ‌ర్ రిలీజ్ - సూప‌ర్ హీరోగా తేజ స‌జ్జా

21 November 2022, 13:07 IST

  • Hanuman Teaser: తేజ స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ‌నుమాన్ టీజ‌ర్ సోమ‌వారం రిలీజైంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

తేజ స‌జ్జా
తేజ స‌జ్జా

తేజ స‌జ్జా

Hanuman Teaser: తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తోన్న హ‌నుమాన్ టీజ‌ర్ సోమ‌వారం విడుద‌లైంది. గ్రాఫిక్స్‌, యాక్ష‌న్ అంశాల‌తో పాటు డిఫ‌రెంట్ విజువ‌ల్స్‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది . మైథ‌లాజిక్ పాయింట్‌తో రూపొందుతోన్న ఈ సూప‌ర్ హీరో సినిమాకు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌భీర సాగ‌ర గ‌ర్భంత‌ర‌స్థ అధిలోక‌ మ‌హిమాన్విత మ‌హా శ‌క్తి యుత హ‌నుమ రుధిర మ‌ణి నిరీక్ష‌ణం అనే డైలాగ్‌తో టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా మొద‌లైంది.

ట్రెండింగ్ వార్తలు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

అతీంద్రియ శ‌క్తుల‌తో పోరాడే ఓ యువ‌కుడిగా తేజ స‌జ్జా ఈ సినిమాలో క‌నిపిస్తున్నాడు. హ‌నుమాన్ అండ‌తో సాధార‌ణ యువ‌కుడు మ‌హాశ‌క్తిశాలిగా మారి శ‌త్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడో సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లుగా టీజ‌ర్ చేస్తే తెలుస్తోంది. తేజా స‌జ్జాపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ టీజ‌ర్‌లో విన‌య్ రాయ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌నిపించారు. అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తొలుత ఈనెల 15న టీజ‌ర్‌ను రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ సీనియ‌ర్ హీరో కృష్ణ క‌న్నుమూయ‌డంతో కార్య‌క్ర‌మాన్ని వాయిదావేశారు.

జాంబీరెడ్డి త‌ర్వాత తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమా ఇది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈసినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. జాంబీరెడ్డి సినిమాతో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌యమ‌య్యాడు. ఇష్క్‌, అద్భుతం త‌ర్వాత అత‌డు హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.