తెలుగు న్యూస్  /  Entertainment  /  Hansika Motwani Marriage As The Beauty In Red Saree Performs Maata Ki Chowki

hansika motwani marriage: మొదలైన హన్సిక పెళ్లి వేడుకలు.. రెడ్ శారీలో ప్రీవెడ్డింగ్‌ ఫొటో చూశారా?

HT Telugu Desk HT Telugu

23 November 2022, 12:26 IST

    • hansika motwani marriage: టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటి హన్సిక మోత్వానీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. రెడ్‌ శారీలో ఆమె మెరిసిపోయింది. ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి వేడుకల్లో రెడ్ శారీలో హన్సిక
పెళ్లి వేడుకల్లో రెడ్ శారీలో హన్సిక

పెళ్లి వేడుకల్లో రెడ్ శారీలో హన్సిక

hansika motwani marriage: అందాల నటి హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె వ్యాపారవేత్త సోహైల్‌ కథూరియాను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. వీళ్ల పెళ్లి డిసెంబర్‌ 4న జరగనుంది. జైపూర్‌లోని ముండోతా ఫోర్ట్‌కు వీళ్ల పెళ్లికి వేదిక కానుంది. అయితే పెళ్లికి 12 రోజుల ముందు నుంచే అంటే మంగళవారమే (నవంబర్‌ 22) పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari april 30th: మురారి బిడ్డ ముకుంద కడుపులో.. కృష్ణ నెల తప్పిందని భవానీ ఆనందం, ఆదర్శ్ జలస్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర

Heeramandi OTT Release Date: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?

Brahmamudi April 30th Episode: కావ్య విశ్వ‌రూపం - అనామిక త‌ల్లిదండ్రుల‌కు మాస్ వార్నింగ్ - దుగ్గిరాల ఇంట్లో క‌న‌కం ర‌చ్చ

ఈ వేడుకలకు హన్సిక రెడ్‌ శారీలో వచ్చింది. ఈ చీరలో ఆమె చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ముంబైలో జరిగిన మాతా కీ చౌకీ ఉత్సవంతో వీళ్ల పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. త్వరలోనే పెళ్లి కూతురు కానున్న హన్సికలో ఇప్పుడే ఆ పెళ్లి కళ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇందులో ఆమె కాబోయే భర్త సోహైల్ కథూరియా కూడా ఉన్నాడు. అప్పుడే మాతా పూజ పూర్తి చేసి వీళ్లు కెమెరాలకు పోజులిచ్చారు. మాతా కీ చౌకీ తర్వాత వీళ్ల పెళ్లి వేడుకలు ఇక జైపూర్‌కు షిఫ్ట్‌ అవుతాయి. అక్కడ డిసెంబర్‌ 2 నుంచి పెళ్లి పనులు మొదలవుతాయి. 2వ తేదీన సూఫీ నైట్ ఉంటుంది.

ఇక డిసెంబర్‌ 3న మెహెందీ, సంగీత్‌ వేడుకలు ఉంటాయి. 4వ తేదీన పెళ్లి జరుగుతుంది. వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా వచ్చిన అతిథులు పోలో మ్యాచ్‌ కూడా ఎంజాయ్‌ చేయనున్నారు. దీనికి తోడు క్యాసినో థీమ్‌తో పెళ్లి తర్వాతి పార్టీ జరగనుంది.

ఇక హన్సిక, సోహైల్‌ పెళ్లి వేడుకలను ఓ ఓటీటీలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా చేయనుండటం విశేషం. ఈ స్ట్రీమింగ్‌ హక్కుల కోసం రెండు ఓటీటీలు పోటీ పడినట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ ఏ ఓటీటీకి ఈ హక్కులు దక్కాయన్నది ఇంకా స్పష్టం కాలేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.