Hansika Wedding: హ‌న్సిక పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ - భారీ ధ‌ర‌కు హ‌క్కుల్ని కొన్న‌ హాట్‌స్టార్‌-ansika sohail kathuria wedding video to stream on this ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ansika Sohail Kathuria Wedding Video To Stream On This Ott Platform

Hansika Wedding: హ‌న్సిక పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ - భారీ ధ‌ర‌కు హ‌క్కుల్ని కొన్న‌ హాట్‌స్టార్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 14, 2022 07:00 AM IST

Hansika Wedding: వ్యాపార‌వేత్త సోహైల్‌ క‌తూరియాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించింది హీరోయిన్ హ‌న్సిక. ఈ జంట పెళ్లి డిసెంబ‌ర్ 4న జైపూర్‌లో జ‌రుగ‌నుంది. కాగా పెళ్లి వీడియో హ‌క్కుల్ని ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఆ ఓటీటీ ఏదంటే..

హ‌న్సిక‌, సోహైల్‌ క‌తూరియా
హ‌న్సిక‌, సోహైల్‌ క‌తూరియా

Hansika Wedding: త్వ‌ర‌లోనే హీరోయిన్‌ హ‌న్సిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌బోతుంది. చిర‌కాల మిత్రుడు, వ్యాపార‌వేత్త సోహైల్‌ క‌తూరియాను పెళ్లాడ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే హ‌న్సిక ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 4న జైపూర్‌లో వీరి పెళ్లి జ‌రుగ‌నుంది. జైపూర్‌లోని ప్రాచీన ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌ను పెళ్లి వేదిక‌గా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

డిసెంబ‌ర్ 2 నుంచి నాలుగో తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు పెళ్లి వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. పెళ్లి కోసం రెండో తేదీ నాడు హ‌న్సిక, సోహైల్‌తో పాటు వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, స‌న్నిహితులు జైపూర్ చేరుకోనున్న‌ట్లు చెబుతున్నారు.

కాగా హ‌న్సిక‌, సోహాన్ పెళ్లి వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. పెళ్లి ప్ర‌సార హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. పెళ్లి జ‌రిగిన కొద్ది రోజులుగా వీడియోను డాక్యుమెంట‌రీ రూపంలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం హ‌న్సిక తెలుగులో 105 మినిట్స్‌, మై నేమ్ ఈజ్ శృతి సినిమాలు చేస్తోంది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌తో రూపొందిన ఈ సినిమాలు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. త‌మిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. న‌వ‌త‌రం తార‌ల పోటీ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టిపెడుతోంది హ‌న్సిక‌.


IPL_Entry_Point