తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaalodu Ott Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ గాలోడు - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Gaalodu OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ గాలోడు - స్ట్రీమింగ్ డేట్ ఇదే

12 February 2023, 9:18 IST

  • Gaalodu OTT Release Date: సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన గాలోడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు రిలీజ్ కానుందంటే...

సుడిగాలి సుధీర్  గాలోడు
సుడిగాలి సుధీర్ గాలోడు

సుడిగాలి సుధీర్ గాలోడు

Gaalodu OTT Release Date: సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా న‌టించిన గాలోడు సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17న ఆహా ఓటీటీలో గాలోడు రిలీజ్ కానుంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 18న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన గాలోడు నిర్మాత‌ల‌కు ఐదు కోట్ల‌కుపైగా లాభాల‌ను మిగిల్చింది. బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ బిగ్‌స్క్రీన్‌పై క‌లిసివ‌చ్చింది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గెహ‌నా సిప్పీ హీరోయిన్‌గా న‌టించింది.

గాలోడు క‌థేమిటంటే...

ర‌జ‌నీకాంత్ (సుడిగాలి సుధీర్‌) అనే యువ‌కుడు ఏ ప‌ని పాట లేకుండా ఊరిలో జులాయిగా తిరుతుంటాడు. అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకున్న అత‌డు ఆ నేరం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? శుక్ల (గెహానా సిప్పీ) అనే అమ్మాయి ప్రేమ‌ను ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

కంప్లీట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో సుధీర్ న‌టించిన సినిమా ఇది. గాలోడుకు ముందు సుడిగాలి సుధీర్‌, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల కాంబినేష‌న్‌లో సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమా రూపొందింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.