తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  F-3 Trailer | ఎఫ్- 3 ట్రైలర్ రిలీజ్...దగ్గుబాటి, మెగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్

f-3 Trailer | ఎఫ్- 3 ట్రైలర్ రిలీజ్...దగ్గుబాటి, మెగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్

HT Telugu Desk HT Telugu

09 May 2022, 10:20 IST

  • వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టించిన ఎఫ్‌-3(#F3Trailer) సినిమా ట్రైల‌ర్ సోమ‌వారం విడుద‌లైంది. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఆహ్లాభ‌రితంగా సాగిన ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సినిమాపై నెల‌కొన్న అంచ‌నాల్ని డ‌బుల్ చేసింది.
వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్
వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్ (twitter)

వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్

వేస‌విలో వినోదాల జ‌ల్లును కురిపించేందుకు వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ సిద్ధ‌మ‌వుతున్నారు. వారు హీరోలుగా న‌టిస్తున్న మల్టీస్టార‌ర్ చిత్రం ఎఫ్‌-3 మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల‌చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు అంటూ మురళీశర్మ డైలాగ్ తో ఆసక్తికరంగా ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో వెంకటేష్(venkatesh), వరుణ్ తేజ్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. డబ్బున్న వాడికి ఫన్..లేనివాడికి ప్రస్ట్రేషన్ అంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది. నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా వరుణ్ తేజ్ సినిమాలో కనిపిస్తున్నారు. వారిది మరాఠీ ఫ్యామిలీ ఐతే మాది దగ్గుబాటి ఫ్యామిలీ అంటూ వెంకటేష్ చెప్పిన పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రగతి, తమన్నా, సునీల్, వెన్నెలకిషోర్ తో పాటు ప్రతి పాత్ర వినోదాన్ని పంచుతూ ట్రైలర్ లో సందడిచేశాయి. డ‌బ్బు వ‌ల్ల ఎదుర‌య్యే క‌ష్టాల‌ను వినోదాత్మ‌కంగా ట్రైల‌ర్‌లో చూపించారు.

2019లో విడుద‌లైన ఎఫ్‌-2(f2 movie)కు సీక్వెల్ గా సినిమా తెర‌కెక్కుతోంది. తొలుత ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు.కానీ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌వ‌డం, పెద్ద సినిమాల మధ్య స‌ర్ధుబాటుతో మే నెలకు వాయిదాప‌డింది. ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్‌తో పాటు సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. పూజాహెగ్డే ప్ర‌త్యేక‌గీతంలో ఆడిపాడింది. ఈ పాట సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. సునీల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.