తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh | వెంకటేష్‌తో జాతిరత్నాలు డైరెక్టర్.. ఇక నవ్వులే నవ్వులు..!

Venkatesh | వెంకటేష్‌తో జాతిరత్నాలు డైరెక్టర్.. ఇక నవ్వులే నవ్వులు..!

HT Telugu Desk HT Telugu

19 March 2022, 18:15 IST

    • విక్టరీ వెంకటేష్ తన తర్వాతి చిత్రాన్ని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో నటించనున్నాడట. ఆ దర్శకుడు చెప్పిన కథకు వెంకీకి నచ్చడంచో సినిమాకు ఓకే చెప్పాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జాతిరత్నాలు డైరెక్టర్ ‌తో వెంకటేష్
జాతిరత్నాలు డైరెక్టర్ ‌తో వెంకటేష్ (Twitter)

జాతిరత్నాలు డైరెక్టర్ ‌తో వెంకటేష్

జాతిరత్నాలు సినిమాతో ఓ రేంజ్‌లో హిట్ కొట్టాడు దర్శకుడు అనుదీప్. చేసింది రెండో సినిమా అయినా గతేడాది విడుదల చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ బ్లాక్‌బాస్టర్ తర్వాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడో అని అంతా ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే అందరికీ షాకిస్తూ తమిళ నటుడు శివకార్తీకేయన్‌తో ప్రాజెక్టును పక్కాలెక్కించాడు. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోతో పనిచేయబోతున్నాడట యువ దర్శకుడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్‌తో జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ కలిసి పనిచేయబోతున్నాడట.

ట్రెండింగ్ వార్తలు

Asuraguru Review: అసుర గురు రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

అయితే ఇందుకు వెంకీ కూడా అతడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొన్ని రోజుల ముందే వెంకటేష్‌ను కలిసిన అనుదీప్ ఓ కథను చెప్పారట. ఆయనకు స్టోరీ నచ్చేయడంతో సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం అనుదీప్ తెలుగు, తమిళ భాషల్లో శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే.. వెంకీతో చిత్రం పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట.

కామెడీ టైమింగ్‌లో వెంకీని కొట్టేవారే లేదు. దీంతో జాతిరత్నాలు లాంటి ఫుల్ హాస్యాస్పద చిత్రాన్ని తెరకెక్కించిన అనుదీప్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడనే టాక్ రావడంతో వెంకీ అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

గతేడాది విక్టరీ వెంకటేష్ హీరోగా రెండు సినిమాల్లో నటించారు. అందులో నారప్ప ఒకటి. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌ రీమేక్‌గా తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీని తర్వాత వచ్చిన దృశ్యం-2 కూడా ఓటీటీలోనే విడుదలై ప్రేక్షకాదరణ పెరిగింది. దీంతో వెంకీని థియేటర్లలో ఎప్పుడూ చూద్దామా అని ప్రేక్షకులకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మే 27న ఎఫ్3 మూవీ రూపంలో వారి కోరిక నెరవేరనుంది.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.