తెలుగు న్యూస్  /  Entertainment  /  Drama Juniors 6 In Zee Telugu To Commence From June 11th

Drama Juniors 6 in Zee Telugu: ప్రదీప్, జయప్రద, శ్రీదేవిల కిడ్నాప్.. డ్రామా జూనియర్స్ సీజన్ 6 వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu

02 June 2023, 11:03 IST

    • Drama Juniors 6 in Zee Telugu: ప్రదీప్, జయప్రద, శ్రీదేవిలను కిడ్నాప్ చేశారు. వాళ్లను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు డ్రామా జూనియర్స్ సీజన్ 6లో రాబోతున్న చిన్నారి చిచ్చర పిడుగులు.
జీ తెలుగులో రాబోతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6
జీ తెలుగులో రాబోతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6

జీ తెలుగులో రాబోతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6

Drama Juniors 6 in Zee Telugu: యాంకర్ ప్రదీప్, నటి జయప్రద, మరో నటి శ్రీదేవి, కమెడియన్ బాబు మోహన్ లను కిడ్నాప్ చేశారు. వాళ్లను వేర్వేరు చోట్ల బంధించి టార్చర్ పెట్టారు. ఇదంతా చేసింది ఎవరో కాదు జీ తెలుగులో రాబోతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6లోని చిన్నారి చిచ్చర పిడుగులు. ఈ కొత్త సీజన్ టెలికాస్ట్ తేదీని అనౌన్స్ చేస్తూ జీ తెలుగు ఓ వినూత్న ప్రోమోను రిలీజ్ చేసింది.

డ్రామా జూనియర్స్ సీజన్ 6 జూన్ 11 నుంచి జీ తెలుగులో రాబోతోంది. అయితే ఈ విషయాన్ని చెబుతూ.. ఈ షో హోస్ట్ చేసే యాంకర్ ప్రదీప్, జడ్జీలుగా ఉండే జయప్రద, శ్రీదేవి, బాబు మోహన్ లను చిన్నారులు కిడ్నాప్ చేసినట్లుగా ప్రోమోలో చూపించారు. ప్రోమో ప్రారంభం కాగానే టీవీలో ఓ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది.

ప్రముఖ యాంకర్ ప్రదీప్, నటీనటులైన జయప్రద, శ్రీదేవి, బాబు మోహన లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ టీవీలో న్యూస్ రీడర్ చెబుతుంది. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ ముందు ఓ అపరిచితుడు ప్రత్యక్షమవుతాడు. నీకేం శిక్ష కావాలో నిర్ణయించుకో.. శూల దండనమా, కుంభీపాకమా అని అడుగుతాడు. అటు నటి శ్రీదేవి, బాబుమోహన్, జయప్రదలను కూడా ఇలాగే కిడ్నాప్ చేసి బంధిస్తారు.

చివరికి జయప్రద కెమెరా ముందుకు వచ్చి.. వీళ్లందరూ మమ్మల్ని కిడ్నాప్ చేసి బ్లాక్ చేశారంటుంది. ఆ తర్వాత బాబు మోహన్ వచ్చి ఇక మీరు కూడా మీ రిమోట్లను లాక్ చేసుకోండి అంటాడు. వీళ్ల అల్లరి మేమే కాదు మీరు కూడా భరించాలని క్యూట్ నటి శ్రీదేవి చెబుతుంది. మొత్తానికి డ్రామా జూనియర్స్ సీజన్ 6 ప్రోమోతోనే జీ తెలుగు ఈ షోపై ఆసక్తిని పెంచింది. ఈ కొత్త సీజన్ జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.