తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vamshi Paidipally: రామారావు గారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు: ఎన్టీఆర్ బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్

Vamshi Paidipally: రామారావు గారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు: ఎన్టీఆర్ బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

28 September 2024, 13:33 IST

google News
  • Vamshi Paidipally Sri Sri Rajavaru Ramarao: జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవల శ్రీ శ్రీ రాజావారు టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రాజావారు నిర్మాత చింతపల్లి రామారావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వంశీ పైడిపల్లి.

రామారావు గారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు: ఎన్టీఆర్ బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్
రామారావు గారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు: ఎన్టీఆర్ బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్

రామారావు గారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు: ఎన్టీఆర్ బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్

Vamshi Paidipally Sri Sri Rajavaru Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రభాస్ మున్నా సినిమాతో తెలుగులో డైరెక్టర్‌గా డెబ్యూ చేసిన వంశీ పైడిపల్లి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు.

తెలుగులో వారసుడుగా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు బృందావనం మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా బ్లాక్ బస్టర్ హిట్ అందించారు వంశీ పైడిపల్లి. రామ్ చరణ్-అల్లు అర్జున్‌తో ఎవడు, నాగార్జున-కార్తీతో ఊపిరి, మహేష్ బాబుతో మహర్షి వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి ఇళయ దళపతి విజయ్‌తో వారిసు తెరకెక్కించారు. తెలుగులో వారసుడుగా విజయ్ మూవీ రిలీజైన విషయం తెలిసిందే.

అయితే, ఇటీవల నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీ శ్రీ రాజావారు సినిమా టీజర్‌ను వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. "మ్యాడ్", "ఆయ్" చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్.. "శతమానం భవతి" సినిమాతో టాలీవుడ్‌కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్‌ వేగేశ్నతో చేస్తున్న సినిమా ఇది.

హీరోయిన్‌గా సంపద

శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై "గుర్తుందా శీతాకాలం" వంటి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సంపద హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా పండుగకు " శ్రీ శ్రీ శ్రీ రాజావారు" సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

శ్రీ శ్రీ రాజావారు సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "శ్రీ శ్రీ శ్రీ రాజావారు టీజర్ చూశాను చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్‌తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గారు గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్‌లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది" అని వంశీ పైడిపల్లి అన్నారు.

మ్యారేజ్ టైమ్ నుంచి

"మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు. మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఆయనకు శ్రీ శ్రీ శ్రీ రాజావారు మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను. నార్నే నితిన్‌ను మాసీగా ప్రెజెంట్ చేశారు" అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెలిపారు.

"సతీష్ వేగేశ్న గారు, రామారావు గారు ఎప్పటినుంచో ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రామారావు గారికి కూడా నా బెస్ట్ విషెస్ చెబుతున్నా. రావు రమేష్ గారు, నరేష్ గారు లాంటి మంచి యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్పెక్ట్ మూవీ ఇది. శ్రీ శ్రీ శ్రీ రాజావారు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని వంశీ పైడిపల్లి తన స్పీచ్‌ను ముగించారు.

తదుపరి వ్యాసం