OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే వచ్చేసిన 11 సినిమాలు.. వాటిలో 7 స్పెషల్.. హారర్, క్రైమ్, రొమాంటిక్, ఫ్యామిలీ జోనర్స్
OTT Movies To Release On Friday: ఇవాళ (సెప్టెంబర్ 27) ఒక్కరోజే ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 11 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చాలా స్పెషల్‌గా 5 మూవీస్, 2 వెబ్ సిరీసులతో కలిపి 7 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్, ఫ్యామిలీ చిత్రాలు ఉన్నాయి.
Today OTT Releases: ప్రతి వారం ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తాయన్న విషయం తెలిసిందే. అలా ఈ వారం కూడా ఓటీటీల్లోకి 24 వరకు సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో గురువారం (సెప్టెంబర్ 26) ఒక్కరోజు 5 ఓటీటీ రిలీజ్ కాగా.. ఇవాళ్టీ (సెప్టెంబర్ 27) నుంచి 11 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సరిపోదా శనివారం (తెలుగు చిత్రం)- సెప్టెంబర్ 26
రెజ్ బాల్ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 27
విల్ అండ్ హార్పర్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 27
గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27
అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27
వాళై (తమిళ చిల్డ్రన్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 27
జీ5 ఓటీటీ
డిమోంటీ కాలనీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ సినిమా)- సెప్టెంబర్ 27
లవ్ సితార (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ చిత్రం)- సెప్టెంబర్ 27
ప్రతినిధి 2 (తెలుగు మూవీ)- ఆహా ఓటీటీ- సెప్టెంబర్ 27
ఆర్టీఐ (లీగల్ థ్రిల్లర్ మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబర్ 26
హనీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- సెప్టెంబర్ 27
భరతనాట్యం (మలయాళ కామెడీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 27
హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్
ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలో 11 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చాలా స్పెషల్‌గా బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డిమోంటీ కాలనీ 2 ఉంది. అలాగే, శోభితా ధూళిపాళ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా మూవీ లవ్ సితార కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది.
క్రైమ్ థ్రిల్లర్స్
నారా రోహిత్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి 2 సైతం క్యూరియాసిటీ కలిగిన సినిమానే. వీటితోపాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తాజా ఖబర్ 2, మర్డర్ మిస్టరీ హనీమూన్ ఫొటోగ్రాఫర్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియెన్స్‌కు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. అలాగే, ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు అందరి మనసుకు హత్తుకునే చిత్రంగా వాళై టాప్ ప్రిరియారిటీగా ఉంది.
7 స్పెషల్
అయితే, ఇక్కడ మనోరమ మ్యాక్స్ ఓటీటీకి ఆదరణ లేదు. కానీ, అందులో ఇవాళ్టీ నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ కామెడీ డ్రామా భరతనాట్యం కూడా స్పెషల్ సినిమా జాబితాలో చేర్చుకోవచ్చు. ఇలా 11 ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో ఐదు సినిమాలు, రెండు వెబ్ సిరీసులతో మొత్తంగా 7 చాలా స్పెషల్‌గా చూసేవిధంగా ఉన్నాయి.