Devara OTT: ఎన్టీఆర్ దేవర ఓటీటీ అగ్రిమెంట్ ఇదే.. రిలీజ్‌కు రెండు రోజుల ముందుగా ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Junior NTR Devara OTT Streaming: జూనియర్ ఎన్టీఆర్ హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌పై అప్డేట్ వచ్చింది. దేవర రిలీజ్‌కు రెండు రోజుల ముందు డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఆలస్యంగా రానుందని ప్రచారం సాగుతోంది.
Junior NTR Devara OTT Release: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే దేవరనే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. అలాగే ఆచార్య వంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర కావడంతో హ్యూజ్ ఎక్స్‌పెక్టెషన్స్ ఉన్నాయి.
ఇక తారక్ నటన సినిమాకు పవర్ నింపిందని, జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండాఫ్‌లోనే ఉంటుందని సమాచారం. ఇక దేవర సినిమాకు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు జోరుగా దేవర ప్రమోషన్స్ సాగుతున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటే.. బాలీవుడ్ బ్యూటి అలియా భట్‌తో ఎన్టీఆర్ చిట్ చాట్ చేశాడు.
దేవర ఓటీటీ స్ట్రీమింగ్
అలాగే, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2లో దేవర టీమ్ పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 25) విడుదల చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కగా.. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు రెండు రోజుల ముందుగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
దేవర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. దేవర టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ కలెక్షన్స్ తగ్గినా.. పెరిగినా.. ఓటీటీ రిలీజ్ విషయంలో ఏమాత్రం మార్పు లేదని తెలుస్తోంది.
నవంబర్‌లో దేవర ఓటీటీ రిలీజ్
దేవర సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్‌కు 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీలోకి వస్తుంది కాబట్టి థియేటర్లలోనే సినిమాను చూడాల్సిందిగా మేకర్స్ కోరారు. ఇక దేవర ఓటీటీ రిలీజ్ డేట్ పక్కాగా తెలియదు కానీ, నవంబర్ నెలలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అది కూడా నవంబర్ నెల మధ్యలో అంటే రెండో వారం లేదా మూడో వారంలో దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఉంటుందనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. ఇదిలా ఉంటే, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌తో జాన్వీ జోడీ కట్టింది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.