Bhool Bhulaiyaa 3: భయపెడుతున్న తృప్తి దిమ్రి కొత్త హారర్ థ్రిల్లర్ భూల్ భులయ్యా 3, టీజర్ రిలీజ్.. కథ ఇంకా పూర్తి కాలేదు!-bhool bhulaiyaa 3 teaser released kartik aaryan tripti dimri vidya balan horror comedy movie bhool bhulaiyaa 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhool Bhulaiyaa 3: భయపెడుతున్న తృప్తి దిమ్రి కొత్త హారర్ థ్రిల్లర్ భూల్ భులయ్యా 3, టీజర్ రిలీజ్.. కథ ఇంకా పూర్తి కాలేదు!

Bhool Bhulaiyaa 3: భయపెడుతున్న తృప్తి దిమ్రి కొత్త హారర్ థ్రిల్లర్ భూల్ భులయ్యా 3, టీజర్ రిలీజ్.. కథ ఇంకా పూర్తి కాలేదు!

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2024 02:05 PM IST

Tripti Dimri Bhool Bhulaiyaa 3 Teaser Released: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా 3. తాజాగా భూల్ భులయ్యా 3 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ కామెడీతోపాటు భయపెట్టే హారర్ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భయపెడుతున్న తృప్తి దిమ్రి కొత్త హారర్ థ్రిల్లర్ భూల్ భులయ్యా 3, టీజర్ రిలీజ్.. కథ ఇంకా పూర్తి కాలేదు!
భయపెడుతున్న తృప్తి దిమ్రి కొత్త హారర్ థ్రిల్లర్ భూల్ భులయ్యా 3, టీజర్ రిలీజ్.. కథ ఇంకా పూర్తి కాలేదు!

Tripti Dimri Bhool Bhulaiyaa 3: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, పాపులర్ హీరోయిన్ విద్యా బాలన్, యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా భూల్ భులయ్యా 3. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన భూల్ భులయ్యా, భూల్ భులయ్యా 2 సినిమా ఫ్రాంఛైజీలో మూడో మూవీగా భూల్ భులయ్యా 3 తెరకెక్కింది.

హారర్ సీన్స్‌తో

తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 27) భూల్ భులయ్యా 3 టీజర్‌ను టీ-సిరీస్ విడుదల చేసింది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోను టీ-సిరీస్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఈ టీజర్ హారర్ సీన్స్‌తో భయపెట్టేలా సాగింది. అలాగే, కొన్ని చోట్లు కాస్తా కామెడీ టచ్ ఇచ్చారు.

ఇందులో విద్యా బాలన్ అదిరిపోయే నటనతో మరోసారి భయపెట్టనున్నట్లు తెలుస్తోంది. కథ అప్పుడు ముగిసిపోయిందా అని కార్తీక్ ఆర్యన్ చెప్పే డైలాగ్‌తో ఇంటెన్సివ్‌గా భూల్ భులయ్యా 3 టీజర్ కొనసాగింది. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చూపించే గ్రాఫిక్స్ బాగున్నాయి. విద్యా బాలన్ కుర్చీని పైకి లేపే సీన్ భూల్ భులయ్యా 1లో మంచాన్ని అమాంతం లేపే సన్నివేశాన్ని గుర్తు చేసింది.

అయితే, భూల్ భులయ్యా 3 ఒక సింహాసనం కోసం జరిగే పోటీలా అనిపిస్తోంది. విద్యాబాలన్‌లోని దెయ్యం అది తన సింహాసనం అని, దాని జోలికి ఎవరు రాకూడదని ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటుంది. మంజులికగా ఉన్న విద్యా బరువైన కుర్చీని పైకి లేపుతూ "ఎన్నిసార్లు నా నుంచి లాక్కుంటావు? అది నా సింహాసనం. నాది!" అని గట్టిగా అరవడం హైలెట్‌గా నిలిచింది.

తృప్తితో రొమాన్స్

ఇక దెయ్యాన్ని ఎదుర్కొనే రూహ్ బాబా పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. "దెయ్యాలకు భయపడే మూర్ఖులు మనుషులు" అని చెప్పిన కార్తీక్ ఆర్యన్ ఓ సన్నివేశంలో దెయ్యానికి భయపడటం కామెడీ తెప్పిస్తుంది. అలాగే, ఈ టీజర్‌లో కార్తీక్, తృప్తి దిమ్రి మధ్య రొమాన్స్‌ను చూపించారు. చాలా బ్యూటిఫుల్‌గా కనిపించే తృప్తి దిమ్రి, కార్తీక్ ఆర్యన్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని తెలుస్తోంది.

ఇక భూల్ భులయ్యా 3 టీజర్‌లో రాజ్ పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, అశ్విని కల్సేకర్ కూడా కనిపించారు. టీజర్‌ను ముగించిన తీరు కూడా చాలా బాగుంది. ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్ నిర్మించిన భూల్ భులయ్యా 3 ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది.

టీ-సిరీస్ ఫిల్మ్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తనిష్క్ బాగ్చి, సాచెత్-పరంపర, అమల్ మల్లిక్ తదితరులు సంగీతం అందించారు. సమీర్, రష్మీ విరాగ్, ఆదిత్య రిఖారీ, ధృవ్ యోగి, సోమ్ పాటల రచయితలుగా బాధ్యతలు తీసుకున్నారు.

హారర్ ఫ్రాంచైజీ

కాగా 2007 బ్లాక్ బస్టర్ భూల్ భులయ్యాలో విద్యా బాలన్ మంజులిక పాత్రను పోషించింది. ఈ సినిమాను ప్రియదర్శన్ డైరెక్ట్ చేయగా.. టీ సిరీస్ నిర్మించింది. ఇందులో అక్షయ్ కుమార్, షైనీ అహుజా, అమీషా పటేల్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ జోషి, అస్రానీ, విక్రమ్ గోఖలే తదితరులు నటించారు.

దీనికి సీక్వెల్‌గా 2022లో భూల్ భులయ్యా 2 వచ్చింది. దీనికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టబు, కియారా అద్వానీలతో పాటు కార్తీక్ నటించారు. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 266 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.